Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా… అదీ శేఖర్ కమ్ముల అంటే… సరదాగా సాగిన ఓ ఆంగ్ల గీతం…

June 12, 2025 by M S R

.

పీపీపీ డుమ్ డుమ్… ఈ పాట రిలీజ్ చేశారు కదా… డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొత్త సినిమా కుబేర నుంచి… ఇంట్రస్టింగు ఉంది… సరదాగా, వెరయిటీగా… శేఖర్ టేస్టుకు తగినట్టుగా…

ఆ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా చేస్తున్నాడా..? 3000 కోట్ల రష్మిక నటిస్తున్నదా..? నాగార్జున కూడా ఉన్నాడా..? ఇవేవీ పెద్దగా ఆకర్షించలేదు… ఎందుకంటే, ఇదెప్పుడో స్టార్టయినట్టుంది… అకారణ, అనవసర జాప్యం… ఫాఫం…

Ads

ఇక్కడ పాపం అన్నది శేఖర్ కమ్ముల గురించే… రెండు పుష్కరాల క్రితం అమెరికాలో మంచి కెరీర్ వదిలేసి, అక్కడే ఫైన్ ఆర్ట్స్ ‌లో ఏదో కోర్సు చేసి, తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు… డబ్బు పిచ్చోడు కాదు… అశ్లీలాన్ని, అసభ్యతను దగ్గరకు రానివ్వడు…

నాని వంటి దారితప్పిన పిచ్చి హీరో… రక్తపాతాన్ని, హింసను ట్రెండుగా ఆమోదించి, ప్రేక్షకుల మీదకు వదులుతున్న రోజులివి… సో, శేఖర్ కమ్ముల ఉత్తమాభిరుచి ఏమిటో అర్థం చేసుకోవాలి… కానీ తను తన టేస్టుతో సక్సెస్ సాధించాడా..? చిక్కు ప్రశ్న…

డాలర్ డ్రీమ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే… ఆనంద్ … వారెవ్వా, వాట్ ఏ ఫిలిమ్ (2004)… గోదావరి పర్లేదు 2006)… కానీ 2007 నాటి హేపీడేస్ బంపర్ హిట్… తరువాత లీడర్ ప్చ్… లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎందుకు తీశాడో తనకే తెలియదేమో… అది 2013… హేపీడేస్ తరువాత ఆరేళ్లు…

తరువాత అనామిక ఓ హిందీ రీమేక్… విద్యాబాలన్ చేసిన కహానీ రోల్‌కు నయనతార… అదీ రాంగ్ డెసిషనే… మళ్లీ 2017లో వచ్చిన ఫిదా బ్లాక్ బస్టర్… అంటే హేపీడేస్ తరువాత పదేళ్లు… తరువాత నాలుగేళ్లకు లవ్ స్టోరీ తీశాడు గానీ… కథ, ట్రీట్‌మెంట్ పెద్దగా ఎవరికీ నచ్చలేదు… అది 2021… ఇప్పుడు 2025… అంటే నాలుగేళ్లు…

మూణ్నాలుగేళ్లు తేడా ప్రతి సినిమాకూ నడుమ… కానీ అంత తేడా కరెక్టు కాదు, ప్లానింగ్ ఫెయిల్యూర్ కావచ్చు… ఈ కుబేర సినిమా ఆసక్తిని ఎందుకు రేపుతున్నదీ అంటే… ధనుష్, నాగార్జున, రష్మిక… పైగా దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్… అందుకే…

శేఖర్ అంటే వెరయిటీ… క్లీన్, నీట్… ఈ పాట విషయానికి వస్తే… మొత్తం ఇంగ్లిషే… ఏదో ఆడపిల్లల హాస్టల్ కావచ్చు.., ఈ పాట రాసింది చైతన్య పింగళి… తెలుసు కదా, ఎన్‌కౌంటర్ దశరథరామ్ అనే చిరస్మరణీయ జర్నలిస్టు బిడ్డ… లిరిసిస్టుగా ఇదే తొలి ప్రయత్నమా ఆమెకు..? తెలియదు…

కానీ సరళమైన ఇంగ్లిషు పదాలతో… అలా అలా సరదాగా, అదే సమయంలో కాస్త అర్థమూ ఉండేలా సాగింది లిరిక్స్… అఫ్‌కోర్స్, డీఎస్పీ దీనిపై పెద్దగా దృష్టి పెట్టాల్సినంత క్లిష్టమైన పాటేమీ కాదు… పైగా కుబేర సినిమా పాటల విషయంలో డీఎస్పీ విపరీతంగా సతాయించడానీ అంటున్నారు…

ఆల్రెడీ ఇతర సినిమాలకు సంబంధించీ తనపై ఇవే విమర్శలు వస్తున్నాయి… పుష్ప2 విషయంలో హీరో, నిర్మాత, దర్శకులకు చిరాకెత్తి అర్థంతరంగా తప్పించి, వేరే వాళ్లను పెట్టుకున్నారు ఫాఫం…సరే, ఈ కుబేర హిట్ కావాలని కోరుకుందాం… ఎందుకు..?

శేఖర్ కమ్ముల వంటి దర్శకులను రక్షించుకుంటేనే… తెలుగు సినిమా ప్రస్తుత అవలక్షణాల్ని, అపసవ్య పోకడల నుంచి కాసింతైనా రక్షణ..!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions