Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యో బాపూ… ఏం వండాలని అనుకున్నావో, ఏం వండావో…

March 14, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… బాపు , ముళ్ళపూడి , దుక్కిపాటి మధుసూదనరావు వంటి ముగ్గురు ఉద్దండులు కలిసి వండివార్చిన వంట 1982 జూలైలో వచ్చిన ఈ పెళ్ళీడు పిల్లలు సినిమా .

ఈ ముగ్గురూ కలిసి ఈ సినిమా కధను , స్క్రీన్ ప్లేని తయారు చేసారు . వాళ్ళు ఏం తీయాలని అనుకున్నారో , ఏం చెప్పాలని అనుకున్నారో , ఏం చెప్పారో అర్థం కావటం కష్టం . అయిననూ సినిమా రెండు మూడు వాయిదాలలో చూడబులే .

Ads

బాపు సినిమా కావడం వలన శుభ్రంగా ఉంటుంది . హీరోయిన్ల కళ్ళు బాగుంటాయి . ఒకటి రెండు పాటలు చాలా బాగుంటాయి . సినిమా ఎక్కువ భాగం అమరావతి , వైకుంఠపురం , గుంటూరు చుట్టుపక్కల తీసారు . సురేష్ తెలుగులో హీరోగా నటించిన మొదటి సినిమా .

అప్పుడప్పుడే పైకి వస్తున్న విజయశాంతి , సుమలతలు లేత అందంతో కనిపిస్తారు . సుమలత హుషారైన డోంట్ కేర్ చలాకీ పాత్రను పోషించింది . ఈ సినిమాలో రమాప్రభ పాత్ర బాగుంటుంది . రమాప్రభ కూడా ప్రౌఢ అందంతో కనిపిస్తుంది .

మా భూమి సినిమాలో పరిచయమైన త్రిపురనేని రామస్వామి చౌదరి మనమడు , త్రిపురనేని గోపీచంద్ కుమారుడు సాయిచంద్ హీరోగా పునఃప్రవేశం చేసారు ఈ సినిమాలో . ఈ సినిమాలో ఓ విశేషం ఏమిటంటే సాఫ్ట్ & స్మూత్ పాత్రలకే సూటయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి సోమయాజులిని మేనకోడళ్ళని మోసం చేసే విలన్ గా చూపడం .

bapu

దుక్కిపాటి- బాపులు ఇంకా మరి కొన్ని సాహసాలు చేసారు . ఏ యస్ వరలక్ష్మో , వై విజయో వేయాల్సిన పొసెసివ్ పాత్రకు సంగీతను సెలెక్ట్ చేసుకోవటం . బహుశా ఆమె బాపు ఫౌండ్ హీరోయిన్ కావటమే కారణమేమో !

మరో సాహసం డైలాగులు తక్కువ ఉండే అందమైన హీరోయిన్ పాత్రలకే సూటయ్యే మీక్ వాయిస్ సుమలతను డోంట్ కేర్ చలాకీ పాత్రకు సెలెక్ట్ చేసుకోవటం . ఇలా ఎన్నో ప్రయోగాల , సాహసాల మిళితం ఈ పెళ్ళీడు పిల్లలు సినిమా .

ఆకలిరాజ్యం సినిమా హీరోలా తరచూ మహాకవి శ్రీశ్రీ మాటల్ని కోట్ చేసే పాత్రలో సంగీత భర్తగా శరత్ బాబు నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో సూర్యకాంతం , భానుప్రకాష్ , సాక్షి రంగారావు , కాసేపు కనిపించే పాత్రల్లో అల్లు రామలింగయ్య , మాడాలు నటించారు .

bapu

యం యస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో పరువపు వలపుల సంగీతం అనే శ్రీశ్రీ పాట చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది . సంగీత ప్రియులు తప్పక వినవలసిన పాటే . ఆయన వ్రాసిన మరో రెండు పాటలు వయసే వెల్లువగా , ముసిముసి నవ్వుల రుసరుసలు కూడా శ్రావ్యంగా ఉంటాయి .

ఆత్రేయ వ్రాసిన పదహారు ప్రాయం , ఉండి ఉండి గుండె వచ్చి , చెయ్యెత్తి జైకొట్టు భామా పాటలు హుషారుగా , శ్రావ్యంగానే ఉంటాయి . బాబా ఆజ్మీ విజయశాంతి , సుమలత , సంగీతల కళ్ళను అందంగా చూపారు . రమాప్రభని కూడా ప్రౌఢాందంతో చూపారు .

ఎన్నో సాహసాలతో తీయబడ్డ ఈ అన్నపూర్ణ వారి లో బడ్జెట్ సినిమాకు ప్రేక్షకులు జై కొట్టలేదు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . బాపు , విజయశాంతి అభిమానులు ట్రై చేయవచ్చు . It’s a neat , clean and feel good romantic movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
  • ఇవే వీథికుక్కల గాట్లకు చిన్నారులు మరణిస్తే… ఒక్క గొంతూ ఏడవలేదు…
  • కేసీయార్ చేస్తే సరస శృంగారమట… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమట..?!
  • హార్డ్‌వర్క్ ఎవరిక్కావాలి… లక్కు కావాలి… లేదంటే ఏవో గిమ్మిక్కులు…
  • మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!
  • బేరసారాల్లో మానవత్వం ఉండదు… మానవత్వంలో బేరసారాలు ఉండొద్దు…
  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions