పార్ధసారధి పోట్లూరి ………. మధ్యాహ్నం 2.30,జనవరి 10,2023. గిల్గిట్ & బాల్టిస్థాన్ లోని ప్రజలు పాకిస్థాన్ కి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన ! మేము భారత్ తో కలిసిపోతాము ! దశాబ్దాలుగా పాకిస్థాన్ మమ్మల్ని ఘోరంగా మోసం చేస్తూ వచ్చింది. ఇక భరించలేము. మేము భారతదేశంలోని భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం అయిన లాడాక్ లో కలిసిపోతాము. లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు గిల్గిట్ & బాల్టిస్టాన్ లో. గిల్గిట్ ,బాల్టిస్టాన్ ప్రజలు భారత్ లోని లాడాక్ లో గల కార్గిల్ జిల్లా రోడ్ ని తెరిస్తే మేము కార్గిల్ వెళ్లిపోతాము అంటూ డిమాండ్ చేశారు!
**************************************************
బలవరిస్థాన్ నేషనల్ ఫ్రంట్ [Balawaristan National Front (BNF)]! బహుశా ఈ పేరు మీరు ఎప్పుడూ విని ఉండరు ! ఈ బలవరిస్థాన్ నేషనల్ ఫ్రంట్ – BNF, దీనిని నవాజ్ ఖాన్ నాజీ [Nawaz Khan Naji]1989 లో స్థాపించాడు గిల్గిట్ బాల్టిస్థాన్ లో. BNF మొదట రాజకీయ పార్టీగా తన ప్రస్థానం మొదలుపెట్టినా రాను రాను పాకిస్థాన్ ప్రభుత్వం తమని నిర్లక్ష్యం చేస్తున్నదనే భావనతో తమకి ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం మొదలుపెట్టింది. ప్రత్యేక దేశం వలన తమకి ఒనగూరేది ఏదీ లేదని CPEC ప్రాజెక్ట్ మీద పాకిస్థాన్ చైనాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక తెలుకున్నది BNF.
గిల్గిట్ బాల్టిస్థాన్ లో ఉన్న సహజ వనరులని తీసుకుపోయి ఉర్దూ భాష మాట్లాడే ప్రాంతాలకి అనుకూలంగా ఖర్చు పెడుతున్నది అంటూ ఏకంగా తాము భారత దేశంలో కలుపుకోమని డిమాండ్ చేయడం మొదలపెట్టారు అక్కడి ప్రజలు. దీనికి BNF వెనక ఉండి ఉద్యమం నడిపిస్తున్నది అని భావించిన పాకిస్థాన్ ప్రభుత్వం BNF మీద నిషేధం విధించింది. BNF ప్రస్తుత ఛైర్మన్ అయిన అబ్దుల్ హమీద్ ఖాన్ [Abdul Hamid Khan] బెల్జియం పారిపోయి అక్కడ రాజకీయ శరణార్ధీగా ఉంటున్నాడు ఇప్పుడు.
Ads
*************************************************************
వాస్తవం తెలిసొచ్చింది గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలకి BNF నాయకత్వానికి ! 1948 లో గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు కూడా పాకిస్థాన్ సైన్యానికి అనుకూలంగా పోరాడారు తాము పాకిస్థాన్ లో కలిసిపోతాము అంటూ ! ఇప్పుడు బెల్జియంలో ఉంటున్న BNF ఛైర్మన్ అబ్దుల్ హమీద్ ఖాన్ [Abdul Hamid Khan] ఏమంటున్నాడు ? The Sunday Gaurdian పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అబ్దుల్ హమీద్ ఖాన్ మాట్లాడుతూ ‘‘మా తాతలు గిల్గిట్ బాల్టిస్థాన్ ని పాకిస్థాన్ లో కలపడానికి పోరాడి ప్రాణాలు కోల్పోయారు. కానీ గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలకి పాకిస్థాన్ లో ఉండడం వలన వొరిగింది ఏమీ లేదు ! మా ప్రాంత వనరులని దోచుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నది పాకిస్థాన్ ప్రభుత్వం ! మమ్మల్ని అణిచివేస్తున్నది మా కనీస హక్కుల కోసం పోరాడుతున్నందుకు !
గత 5 ఏళ్లలో పరిస్థితులు బాగా దిగజారాయి ! పాకిస్థాన్ ప్రజల అవసరాలు తీరాక మాకు గోధుమపిండి లాంటి నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు, అదీ లాహోర్,ఇస్లామాబాద్,కరాచీ లాంటి చోట్ల గోధుమపిండి కిలో 149/- రూపాయలకి దొరుకుతుంటే మాకు కిలో 200 కి అమ్ముతున్నారు, అదీ రేషన్ పద్ధతిలో ! మైదాపిండి కూడ గోధుమపిండి ధరకే అమ్ముతున్నారు ఇది మరీ దారుణం ! మేము భారతదేశంలో కలవడానికి గత పదేళ్లుగా పోరాడుతున్నాము కానీ మా ఉద్యమం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది తక్కువ..’’ అని ఆక్రోశించాడు…
******************************************************************
జనవరి 10,2023 న గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు స్కర్డు [Skurdu ] పట్టణంలో భారీగా చేరి పాకిస్థాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్ వైపున ఉన్న కార్గిల్ రోడ్ ని తెరవాలని డిమాండ్ చేస్తూ ఊరగింపుగా స్కర్డు పట్టణం ని చుట్టుముట్టారు. PoK మాజీ ప్రధాని రజా ఫరూక్ హైదర్ [Raja Farooq Haider] గుమి గూడిన ప్రజలని ఉద్దేశిస్తూ పాకిస్థాన్ సైన్యం వందల ఏళ్లుగా మేము ఉంటున్న ప్రాంతాన్ని ఆక్రమించి మమ్మల్ని ఇక్కడ నుండి వేరే ప్రాంతాలకి తరలించాలని ప్రయత్నిస్తున్నది. దీనికి మేము ఒప్పుకోము. గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజలు భారత దేశంలో కలిసిపోవాలని కోరుకుంటున్నారు. మేము లాడాక్ వెళ్లిపోతాము కానీ మేము ఇక్కడ ఉండగా పాక్ సైన్యం మమ్మలని వేరే ప్రాంతాలకి తరలించడానికి ఒప్పుకోము అని అన్నారు.
******************************************************************
భారత రక్షణ మంత్రి తరుచూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉండడం వలన, గిల్గిట్ బాల్టిస్థాన్ దగ్గర సైనిక స్థావరాలని నిర్మించాలనే నెపంతో అక్కడి ప్రజలని దూరంగా తరలించాలని ప్రయత్నిస్తున్నది కానీ అక్కడి ప్రజలు దీనికి వొప్పుకోవడం లేదు ! గిల్గిట్ బాల్టిస్థాన్ కి ఆనుకొని చైనాకి చెందిన CPEC రోడ్ మార్గం ‘కారకోరం ‘ ఉన్నది కాబట్టి గిల్గిట్ బాల్టిస్థాన్ విషయంలో పాకిస్థాన్ కంటే చైనాకే ఎక్కువ భయాలు ఉన్నాయి.
****************************************************************
గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజల సహకారంతో 1948 లో గిల్గిట్ బాల్టిస్థాన్ ని పాకిస్తాన్ ఆక్రమించుకోగలిగింది ఇప్పుడు అదే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటున్నది. ఇది పాక్ సైన్యానికి కావొచ్చు పాక్ సైన్యానికి రక్షణగా రావొచ్చు అనుకుంటున్న చైనా సైన్యానికి ఇబ్బంది కలుగ చేయవచ్చు !
************************************************************
ఒకేసారి పాకిస్థాన్ మరియు చైనాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది ఒకవేళ భారత్ గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రజల కోరిక మేరకు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ! ప్రస్తుతం గిల్గిట్ బాల్టిస్థాన్ ట్రిగ్గర్ పాయింట్ అవుతున్నది టూ ఫ్రంట్ వార్ కి ! అయితే PoK ని స్వాధీనం చేసుకోవడం వలన భారత దేశం మీద పడే ఆర్ధిక వ్యయప్రయాసలు ఎలా ఉండవచ్చు ? PoK ని స్వాధీనం చేసుకోవడం వలన భారత్ కి లాభమా ? నష్టమా ? PoK ని స్వాధీనం చేసుకోవడం సులభమేనా ? PoK ని స్వాధీనం చేసుకునే సమయంలో భారత సైన్యానికి ఎంత ఖర్చు ఉండవచ్చు ?
PoK ని స్వాధీనం చేసుకున్నాక దాని నిర్వహణ కోసం భారత్ పన్ను చెల్లింపుదారుల సొమ్ముని ఎంత ఖర్చు పెట్టాలి ? తిరిగి ఎంత పన్నుల రూపంలో భారత్ కి తిరిగి వస్తుంది ? ఇలాంటి విషయాలని పరిగణలోకి తీసుకొని తగిన చర్య తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే PoK మనకి భారం అవుతుంది ! సెంటిమెంట్ అని భావించి స్వాధీనం చేసుకుంటే ఆ తరువాతి పరిణామాలని కూడా భారత ప్రజలు భరించాల్సి ఉంటుంది. ఉల్లిపాయలు కిలో 50 రూపాయలు అయితే ప్రభుత్వాలని దింపేసిన చరిత్ర ఉన్నది మన దేశానికి…
Share this Article