ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే కోలా డ్రింక్స్ కోక్, పెప్సీ. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు కంపెనీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ఒకానొక సమయంలో రెండింటి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. ఒకరిపై ఒకరు యాడ్స్ రూపంలో విమర్శలు చేసుకునేవి.
క్రీడలు బాగా పాపులర్ అయ్యాక కూడా పోటా పోటీగా స్టేడియం హక్కులను కొని తమ డ్రింక్స్‌ను ప్రేక్షకులకు నిర్బంధంగా అంటగట్టాయి. అయితే ఈ రెండు కంపెనీల పోటీ కారణంగా పరస్పరం నష్టపోతున్నట్లు గ్రహించాయి. దీంతో బయటకు కలిసినట్లు కనిపించక పోయినా.. కలిసి అమ్మకాలు పెంచుకునేందుకు వ్యూహాలు రచించాయి. దీనిలో భాగంగా పలు కొత్త పద్దతులకు శ్రీకారం చుట్టాయి.
ముందుగా స్టేడియంలలో అమ్మకాల హక్కులను కొనడం మానేశాయి. ఆ తర్వాత తమ ప్రొడక్టులను స్టేడియంలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పబ్లిక్ ప్లేసులలో సమానంగా అందుబాటులోకి తెచ్చాయి. ఏ సూపర్ మార్కెట్‌కు వెళ్లినా కోక్, పెప్సీ ప్రొడక్ట్స్ పక్కపక్కనే ఉండేలా చేసుకున్నాయి. వెండింగ్ మెషిన్లు కూడా పక్కపక్కన ఏర్పాటు చేశాయి.
Ads
అలా చేయడం వల్ల సేల్స్ ఎందుకు పెరుగుతాయనేగా మీ డౌటనుమానం! ఇక్కడే అసలు కిటుకు ఉంది. అదే మార్కెటింగ్ సైన్స్. వినియోగదారుడికి కోక్ ఒక్కటే కనపడితే.. తాగుదామా? వద్దా? అని మాత్రమే ఆలోచిస్తాడు. అదే కోక్, పెప్సీ రెండూ పక్కపక్కనే కనపడితే.. రెండింట్లో ఏది కొందామని ఆలోచిస్తాడు. మనిషి బుర్రలో కొనాలా వద్దా? అనే డైలమాను తప్పించి.. రెండింటిలో ఏది కొనాలనే వరకు తీసుకెళ్లడమే ఈ మార్కెటింగ్ సైన్స్.
అందుకే సూపర్ మార్కెట్లు, మాల్స్‌కు వెళ్తే ప్రత్యర్థి కంపెనీ ప్రొడక్టులన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఆ రెండు కంపెనీలు కలిపి మీలో కొనాలని ఉన్న డైలమాను తప్పించి ఏదో ఒకటి కొనిపించేలా చేస్తాయి.
కోక్, పెప్సీ కంపెనీలు ఈ మార్కెటింగ్ సైన్స్‌ను అవలంభించిన దగ్గర నుంచి చిన్నాచితకా కంపెనీలు మనుగడలో లేకుండా పోయాయి. థమ్సప్, సిట్రా, గోల్డ్‌స్పాట్ వంటి అనేక ప్రొడక్టులను తమలో కలిపేసుకున్నాయి.
మీకు ఒక యాడ్ గుర్తుందా? ఒక పిల్లాడు వెండింగ్ మెషీన్ దగ్గరకు వచ్చి రెండు కోక్ టిన్స్ కొంటాడు. తర్వాత ఆ టిన్స్‌ను మెషిన్ దగ్గర పెట్టి.. దాని మీద నిల్చోని పెప్సీ టిన్ కొని.. తాగుతాడు. పెప్సీ కంటే కోక్ సేల్స్ రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఒప్పుకుంటూనే.. పోపోవోయ్.. మీ కోక్ టిన్స్‌ను మా పెప్సీని కొనడానికి పిలగాళ్లు వాడుతున్నారని సెటైరికల్‌గా చెప్పాడు. వాస్తవానికి ఆ రెండు కంపెనీలు మార్కెటింగ్ సైన్స్ అప్లయ్ చేసిన తర్వాతే ఆ యాడ్ వచ్చింది. కలిసి కట్టుగా మనలను బురిడీ కొట్టించాయి.
ప్రస్తుతం కోలా మార్కెట్‌లో కోక్‌కు 42% మార్కెట్ ఉండగా.. పెప్సీది 24% మాత్రమే. కోక్ పక్కన పెప్సీ బాటిల్స్ పెట్టడం వల్లే ఆ మాత్రమైన అమ్ముడవుతున్నాయనే సెటైర్లు కూడా ఉన్నాయి. Inputs : Elon Musk #భాయ్‌జాన్ (John Kora)
Share this Article