Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బే, ఈనాటి సినిమాల్లో అలాంటి బుర్రకథలు చూడటం అసంభవం…

April 11, 2024 by M S R

Subramanyam Dogiparthi…..   మూడు సెంటర్లలో వంద రోజులు ఆడిన హిట్ సినిమా 1970 లో వచ్చిన ఈ పెత్తందార్లు సినిమా . NTR వియ్యంకులు అయిన యు విశ్వేశ్వరరావు నిర్మాత . సి యస్ రావు దర్శకులు . ఓ చిన్న గ్రామంలో బడా పెత్తందారు నాగభూషణం . ఆయన ముఠాలో రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , ముక్కామల , ధూళిపాళ , సత్యనారాయణ ఉంటారు .

ఆ పెత్తందారు ఆ గ్రామంలో చేయని అఘాయిత్యం ఉండదు . ఆ అఘాయిత్యాలను అరికడతాడు ఆయన మేనల్లుడు , గ్రామ యువజన సంఘం నాయకుడు NTR . ఇలాంటి సినిమాలు ఆయనకు కొట్టిన పిండి . ఇలాంటి కధాంశం ఉన్న సినిమాలు ఎన్ని నటించాడో !

నాకయితే NTR ఈ సినిమాలో అంత గొప్పగా ఏం నటించలేదనే అనిపిస్తుంటుంది . స్క్రీన్ ప్లే కూడా అంత గొప్పగా ఏం ఉండదు . కె వి మహదేవన్ సంగీత దర్శకుడు అయినా ఒక్క ఏకాంత సేవకు వేళాయెరా అనే పాట తప్పించి మిగిలిన పాటలు హిట్ కాలేదు . అయినా సినిమా హిట్టయంది . సినిమాలు , జీవితాలు సక్సెస్ కావాలంటే సుడి / అదృష్టం కూడా ఉండాలి .

Ads

బుర్ర కధ ఒకటి బాగుంటుంది . NTR బుర్ర కధలో నటించిన సినిమా ఇదొక్కటేనేమో ! శాంతి , అహింసలను బోధించిన జీసస్ క్రైస్ట్ , మహాత్మాగాంధీ ఎలా ఘోరంగా హత్య చేయబడ్డారో , శిలువ వేయబడ్డారో ఆ బుర్రకధలో కీర్తించడం ఉంటుంది . బహుశా ఇప్పటి సినిమాలలో అలాంటి సీన్లు చూడటం అసంభవం ఏమో ! ముఖ్యంగా మహాత్మాగాంధీ గురించి . నయా చరిత్రకారులు , భాష్యకారులు వచ్చారు కదా !

NTR , విజయనిర్మల , శోభన్ బాబు , సంధ్యారాణి , రాజబాబు , రమాప్రభ , ప్రభాకరరెడ్డి, సావిత్రి జంటలు . విలన్ల గురించి ముందే చెప్పేసా . ఇతర పాత్రల్లో నాగయ్య , హేమలత , చలపతిరావు , విజయలలిత , బేబీ రాణి ప్రభృతులు నటించారు . రేలంగి పోలీసు ఇనస్పెక్టర్ పాత్ర . చివర్లో తెలుస్తుంది . ముందరంతా పిచ్చోడి లాగా గ్రామంలో తిరుగుతుంటాడు . వేమన పద్యాలు పాడుతూ చురకలు అంటిస్తుంటాడు . మంచి పాత్ర . విజయలలిత హొయలు బాగుంటాయి . జ్యోతిలక్ష్మి గ్రూప్ డాన్స్ బాగుంటుంది .

మొత్తం మీద సినిమా హిట్టయిన సినిమా . డబ్బులు , పేరు రెండూ వచ్చాయి . మా నరసరావుపేటలోనే చూసా . వెంకటేశ్వర పిక్చర్ పేలస్ అని గుర్తు . యూట్యూబులో ఉంది . NTR అభిమానులు , విజయలలిత , నాగభూషణం అభిమానులు చూడవచ్చు . 1970s దశకం అంతా నాగభూషణానిదే . 1980s వచ్చేటప్పటికి రావు గోపాలరావు వచ్చేసాడు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions