Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బోనం అంటే..? తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీక… ఇది చదివితే సమజైతది…

July 21, 2023 by M S R

బోనం ! తాత్త్వికత !!

~~~~~~~~~~~~~~

శైవ&శాక్తేయ సంప్రదాయాలకు కేంద్రస్థానమైన

Ads

తెలంగాణ సంస్కృతిలో బోనం ఒక విశిష్ట పర్వం !

ఏడాది పొడుగునా ఇక్కడ బోనాలేబోనాలు…

బోనం కథ & తాత్త్వికత చాలా చాలా పెద్దది

అది రాస్తే రామాయణం,పాడితే భాగవతం…!!

బోనం అంటే భువనం !

సకల ప్రాణికోటికి మూలస్థానం !!

బోనం అంటే వట్టి మట్టికుండే. కానీ అది నిండుకుండ.

బోనం ఒక పూర్ణకుంభం. బోనం ఒక బ్రహ్మాండబాండం.

బోనం ఒక ధాన్యాగారం. బోనం ఒక ధనాగారం.

బోనం సృష్టికి ప్రతిసృష్టిచేసే ఒక మాతృగర్భం… !!

పసుపన్నం కావచ్చు, పరమాన్నమే కావచ్చు,

బెల్లపునీళ్లో పసుపునీళ్లో నింపిన ఘటమో కావచ్చు

కానీ బోనమంటే ఆహారరూపంలోని ఒక సఫలతాశక్తి…!!

bonam

మన పచ్చని ప్రకృతి అర్థనారీశ్వరమయం !

తాండవమో లాస్యమో ఆదిదంపతులకు అదేకదా ప్రీతి.

అభినయంలో ప్రథమం ఆంగికం… ఇదేమరి భువనం.

భువనం అంటే దివారాత్రులు పుట్టిపెరిగేది కదా.

అనునిత్యం చలనంలో,గమనంలో ఉండేదికదా.

మరి అది ప్రకృతిపరమైన ఆది పరాశక్తే కదా.

ఏ శక్తికైనా మౌలికమైన బలం ఆహారమే కదా.

ఆహారమంటే ఒక ప్రపథమ సఫలతా శక్తేగదా.

సమస్త సఫలతా శక్తులకు—

మాతృశక్తి,, అన్నమేనని ప్రకటించే సందర్భం…

కొండంత ప్రకృతిశక్తికి – కుండంత కృతజ్ఞతే బోనం…!!

అమ్మ సర్వసాత్విక.. అందుకే పిల్లలతొట్లెలు.

అమ్మ ఆగ్రహరూపిణి.. అందుకే అంబల్లు, ఉల్లిగడ్డలు.

అమ్మ క్రిమినాశిని…అందుకే పసుపు, ఎల్లిగడ్డలు,వేపాకులు.

అమ్మ అన్నపూర్ణ… అందుకే ఆహారనివేదనలు.

అమ్మ శాకాంబరి… అందుకే పచ్చగూరలు,గుమ్మడికాయలు.

అమ్మ బలవర్ధకి… అందుకే పలారాలు, చమిలిముద్దలు.

అమ్మ కటాక్షప్రసాదిని… అందుకే వెయికండ్ల కుండలు.

అమ్మ వృద్ధికారిణి.. అందుకే రాట్నాల బహుమానాలు.

అమ్మ సకల చరాచరసృష్టికి సమస్తప్రసాదిని…

అందుకేగదా గండచిలుకలూ,చెంఢ్లూ, ఇండ్లూ, బండ్లూ…!!

ప్రకృతిలో ముడిబడ్డదే మన మౌలికమైన సంస్కృతి.

అర్థంచేసుకుంటే గనుక అనంతమైన విస్తృతి.

అపార్థమే గొప్పదనుకుంటె అంతులేని వికృతి.

ఇది కల్లాకపటం తెలియని వట్టి ఎడ్డిమాలోకం.

చేరదిస్తే చంకనెక్కుద్ది…దూరంకొడితే పారిపోద్ది

చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత…!!

~~~~~~~••~~~~~~~

పరమాన్నం

బోనంల ఏముంటదన్నది అందరికీ పెద్ధ ఆసక్తిగదా !

మాకు బోనం అంటె బెల్లంవేసి వండిన పరమాన్నమే.

వట్టి పసుపన్నం వండుతరు. పప్పులుగం వండుతరు.

వట్టి తెల్లన్నం వండుతరు. లేదంటే పసుపునీళ్లే నింపుతరు.

బోనంమీదికి కలెగలుపు అన్నితీర్ల కాయగూర వండుతరు.

కొందరు కలెగలుపుగ ఆకుకూరలేసి పచ్చగూర వండుతరు.

పచ్చిపులుసు చేస్తరు. ఉల్లిగడ్డలు మిరుపకాయ నివేదిస్తరు.

మా ఇండ్లల్ల బోనమంటే.. పరమాన్నమే ! ఇగో, అదే ఇది…!! — డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions