.
ముందుగా ఓ వార్త చదవండి.,. ‘‘ABN ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల చైర్మన్ రాధాకృష్ణ ఫోన్ నంబర్లను కేసీయార్ ప్రభుత్వం ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్ అధికారులు…
విచారణకు రావాలని రాధాకృష్ణకు సూచించిన అధికారులు..! నోటీసులు పంపిస్తే… వీలును బట్టి వచ్చి వాంగ్మూలం ఇస్తానని సిట్ అధికారులకు చెప్పిన రాధాకృష్ణ!
Ads
పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు, అలా జరగకపోతేనే ఆశ్చర్యం… రారా పోరా అనుకునేంత చనువు, దోస్తీ… ఐతేనేం… రాధాకృష్ణ టీడీపీ మనిషి, చంద్రబాబు మనిషి… కేసీయార్ కూడా ఆ క్యాంపే ఒకప్పుడు… తరువాత దారులు వేరు…
మొదట్లో కేసీయార్‌తో బాగానే ఉన్నా రాధాకృష్ణకు కేసీయార్‌తో దూరం పెరిగింది… తను చంద్రబాబు… కేసీయార్ యాంటీ చంద్రబాబు… ఐనా కేసీయార్ సీఎం అయ్యాక కూడా బాగానే ఉండేది… కానీ ఎక్కడో బెడిసింది… అసలు ఇల్లు కదలని కేసీయార్ ఆంధ్రజ్యోతి ఆఫీసు అంతస్థు ఒకటి కాలిపోయిందని తెలియగానే అగమేఘాల మీద వెళ్లాడు…
కానీ ఆర్కే చంద్రబాబు మనిషి అనే కోణంలో కేసీయార్ ట్యాప్ చేయించాడు… ఓ మిత్రుడు అన్నాడు… ‘‘అసలు నీడ మీద కూడా నిఘా పెట్టేవాడు కేసీయార్’’ అని… పిరికి, భయం, అభద్రత, అసహనం, అన్నింటికీ మించి నీడనూ నమ్మలేనితనం… అందుకే ఆర్కే ఫోన్ ట్యాప్ పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు… వాళ్లెవరో రాశారు కదా, మొత్తం 40 వేల ఫోన్ల ట్యాపింగు అని…
సరే, ఆ ట్యాపింగు పేరిట ఎవరెవరు సినిమా తారల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారనే నీచమైన అంశాల జోలికి పోవడం లేదు గానీ… ఒక ఆర్కే ఏం ఖర్మ..? మీడియా ప్రతినిధులు, జడ్జిలు, బ్యూరోక్రాట్లు, సొంత పార్టీ నాయకులే కాదు… చివరకు బిడ్డ, అల్లుడు, కోడలు కూడా ట్యాపింగ్ బాధితులే… ఎస్, నీడను నమ్మనివాడే చేయగలడు ఆ పని…
సీఎం కుర్చీ ఓ ముళ్ల సింహాసనం… అది భయపెడుతూనే ఉంటుంది… ప్రగతి భవన్ గోడల్ని అమాంతం మూడు రెట్లు పెంచుతుంది… బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు కూడా కడుతుంది… చివరకు ఆయుత చండీ యాగాలు కూడా చేయిస్తుంది… క్షణక్షణం భయం…
మరి ఎందుకా బతుకు అనకండి… తను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉన్నాడు, స్వేచ్ఛగా ఉన్నాడు… చివరకు తన డొక్కు ఎన్నికల ప్రచార జీపుకి పెట్రోల్ లేకపోతే ఓ విలేకరి సొంత ఖర్చుతో పోయించిన ఉదాహరణలూ తెలుసు… కానీ కేసీయార్ అప్పట్లో తలెగరేసుకుని బతికాడు, ఎటొచ్చీ సీఎం దాకా ఎదిగాకే భయంభయంగా బతికాడు…
కనీవినీ ఎరుగని భారీ ట్యాపింగు… అదీ సొంత సామాజికవర్గ అధికారులను మాత్రమే నమ్ముకుని ఓ ట్యాప్ యాగం చేయించాడు ప్రతిరోజూ… ఎంత దుర్భరం ఆ బతుకు..? పది మంది కార్యకర్తలు వస్తే, అందరినీ పిలిచి, సహపంక్తిలో అందరితో జోకులు వేస్తూ భోజనాలు చేసిన అలనాటి కేసీయార్‌కూ, సీఎం కేసీయార్‌కూ నడుమ ఎంత తేడా..?
మరెందుకు అధికారం..? నీడనూ నమ్మలేక… వందల ఎకరాలు, వేల కోట్లు ఉన్నా ఏం సుఖం..? పదే పదే ఆయుత చండీయాగాలు చేసుకుంటూ, భద్రతను ఆశించడమేనా..? ఆ యాగమూ చివరలో కూడా యాగస్థలి పైకప్పు అంటుకుని మండిపోయింది గుర్తు లేదేమో సారు గారికి..?
ఎస్.., సీఎం కుర్చీ అంటే భరోసా కాదు, భద్రతా కాదు, అదొక ముళ్ల కుర్చీ, కుదురుగా ఉండనివ్వదు, పడుకోనివ్వదు… ఈ ట్యాపింగు అరాచకాలు ఆ భయంలో నుంచి పుట్టినవే… జైలు పాలు చేశాక బయటికొచ్చి, మీసం తిప్పి ఇంకేం పీక్కుంటారు అని రేవంత్ రెడ్డి మీసం మెలేసిన ఫోటో గుర్తుందా..? అలా ఎందుకు బేఫికర్‌గా ఉండలేకపోయావ్ కేసీయార్..? ఆఫ్టరాల్ ఏ షార్ట్ లైఫ్ వుయ్ హ్యావ్..!!
Share this Article