https://twitter.com/Ease2Ease/status/1357675009905291264
ఈ ట్వీట్ చూశారు కదా… అరవై వేల పైచిలుకు లైకులు, పదిహేను వేలు దాటిన కామెంట్లు… సూపర్ వైరల్ వీడియో బిట్… ఏమీలేదు… సింపుల్ వీడియో… ఓ పెళ్లి రిసెప్షన్… ఫోటోగ్రాఫర్ వేదిక ఎక్కి వధువు ఫోటోలు తీస్తున్నాడు… ఓ దశలో వరుడిని పక్కకు నెట్టేసి, వధువు క్లోజప్పులు తీస్తున్నాడు… ఓవరాక్షన్… ఆమె తలను అటూ ఇటూ తిప్పుతూ ఫోటోలు తీస్తుంటే వరుడికి చిర్రెత్తుకొచ్చింది… ఈడ్చి ఒక్కటి పీకాడు… అక్కడి వరకూ వోకే… వధువు ROFL… అంటే కింద చతికిలపడిపోయి ఒకటే నవ్వులు… నిజానికి ఆమె అంతగా నేల మీద పడీపడీ నవ్వనక్కర్లేదు… వరుడి ఉక్రోశం, ఫోటోగ్రాఫర్ సిట్యుయేషన్ చూసి నవ్వు ఆపుకోలేకపోయిందేమో గానీ… ఈ వీడియో మాత్రం నిన్న ఒకటే వైరల్… జూమ్ పెట్టి, ఫోటోలు తీసుకునే సౌలభ్యం ఉండగా, మరీ మొహంలోనే కెమెరా పెట్టి, ఫ్లాషులు కొట్టాల్సిన అవసరం ఏముంది..? మెంటల్ కేసు… వరుడికి కోపం వచ్చిందీ అంటే రాదా మరి..?!
Ads
ఆమె నవ్వింది, మనమూ నవ్వాం… వోకే… బహుశా ఇది తెలుగు ఫోటో అయి ఉండకపోవచ్చు… అయితే రిసెప్షన్ల సంగతి, ప్రివెడ్ షూట్ల దందాల గురించి కాసేపు వదిలేద్దాం… ప్రివెడ్ షూట్లు ఓ వైరస్… మనంతట మనమే… కాస్త డబ్బు ఎక్కువై, పెళ్లికి ముందే వధూవరులతో రకరకాల విన్యాసాలు చేయిస్తున్నాం… పెళ్లిళ్లలో పెద్ద పెద్ద టీవీల్లో ఆ సీన్లను, ఆ వీడియోలు ప్రదర్శించి చప్పట్లు కొడుతున్నాం… ఇక పెళ్లి తంతులో పురోహితులది తక్కువ పాత్ర అయిపోయింది… ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లే తంతును నిర్దేశిస్తున్నారు… మనకెందుకు వచ్చిన తల్నొప్పి అని పురోహితులూ వదిలేస్తున్నారు… నిజానికి ఒక తంతు జరుగుతుంటే దాన్ని యథాతథంగా షూట్ చేసుకుంటే సరి, ఫోటోలు తీస్తే సరి… అది శృతి తప్పింది…
నిజానికి ఫోటోగ్రాఫర్ల తప్పుకన్నా పేరెంట్స్ తప్పే ఎక్కువ… వధూవరుల తప్పే ఎక్కువ… ఫోటోల్లో పెళ్లి తంతుకన్నా వాళ్లకు ఫోజులే ఎక్కువ కనిపించాలి… నవ్వొస్తుంది కొన్నిసార్లు… అరుంధతి నక్షత్రాన్ని వధువుకు, వరుడు చూపించే సీన్ కొన్ని వేల ఆల్బముల్లో ఒకేరీతిలో ఉంటుంది… అసలు అరుంధతి నక్షత్రాన్ని చూపించడమనే తంతే పెద్ద అబ్సర్డ్… కానీ ఏదో చూపించినట్టు పురోహితుడి యాక్షన్, వధువుకు చూపిస్తున్నట్టు వరుడి యాక్షన్, మస్తు ఫోజు ఫోటో తీసినట్టు ఫోటోగ్రాఫర్ యాక్షన్… చాలా సీన్లు ఇలాంటివే… టైమ్‌కు సరిగ్గా ఫోటో ఫ్రేములోకి రాలేదు అనుకుంటే… మళ్లీ మళ్లీ తలంబ్రాలు పోస్తున్న ఫోజులు, మళ్లీ మళ్లీ తాళికడుతున్నట్టు ఫోజులు, మళ్లీ మళ్లీ కాళ్లు కడుగుతున్నట్టు ఫోజులు, మళ్లీ మళ్లీ మెట్టెలు తొడుగుతున్నట్టు ఫోజులు… ఆ ప్రక్రియ అలా సాగుతూనే ఉంటుంది… రాను రాను ఫోటో, వీడియో బిల్లు రేంజ్, వధువు పేరెంట్స్ మీద భారం ఎంత పెరుగుతున్నదీ అంటే… పెళ్లి హాలు, డెకరేషన్, తిండి ఖర్చులతో సమానంగా ఫోటో బిల్లు… ఎప్పటికీ ఉండే మొమరీస్ కదా, ఒకసారి ఖర్చు అనే ఒక్క డైలాగుతో వధువు తల్లిదండ్రుల నడుముల్ని మరింత వంచేస్తున్నారు… ఇదొక విషాదం…!!
Share this Article