Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫుల్వంతి…! రసహృదయులకు విందుభోజనం ఈ మరాఠీ మూవీ…!

January 28, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……  It’s a literary , musical and visual splendour . అద్భుతమైన కళా ఖండం . ప్రతి సినిమా ప్రియుడు , కళాభిమాని , రస హృదయుడు తప్పక తప్పక చూడవలసిన మరాఠీ సినిమా . ప్రైంలో ఉంది .

ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి . వాటిని ఎక్కడ చదవనిస్తుంది సినిమా ! ఏదేదో రస లోకాలకు తీసుకుని పోతుంది .

Ads

పీష్వాల కాలం సినిమా . ఫుల్వంతి అనే నర్తకి దేశమంతా పేరు మోసిన నర్తకి . ఎంత గొప్ప నర్తకో అంత శృతిమించిన ఆత్మ విశ్వాసం , అహంభావం కూడా ఉంటాయి . మస్తానీ నృత్యం చేసిన పూణేలోని శనివారవాడలో నృత్యం చేయాలనేది ఆమె చిరకాల కోరిక .

పూణేలో పీష్వా సమక్షంలో నృత్యం చేస్తూ ఆమె , ఆ ఆస్థాన పండితుడు అయిన వెంకట శాస్త్రి ఒకరి మీద ఒకరు సవాలు విసురుకుంటారు . ఆమె ఓడిపోతే శాస్త్రి గారికి బానిస కావాలి . ఆయన ఓడిపోతే ఆమె గజ్జెలు కట్టుకుని నగరంలో తిరగాలి .

ఆ పోటీ దేశమంతా సంచలనం కలిగిస్తుంది . పోటీలో ఆమె కావాలనే ఓడిపోతుంది . కానీ , శాస్త్రి గారు ఆమెను బానిసగా తీసుకోలేక నగరం విడిచి వెళ్ళిపోతారు . ఆమె శాస్త్రి గారింట్లోనో తదుపరి జన్మలోనయినా ఆయనను చేరాలని అక్కడే ఉండిపోతుంది .

బేక్ గ్రౌండ్ మ్యూజిక్ , నృత్యాలు , సెట్టింగులు అద్భుతం . సినిమా రంగంతో సంబంధం ఉన్న ప్రతీ నిపుణుడు , నటులు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడని సినిమా . మీ సినీ రంగ మిత్రులను కూడా చూడమని చెప్పండి . #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!
  • బేరసారాల్లో మానవత్వం ఉండదు… మానవత్వంలో బేరసారాలు ఉండొద్దు…
  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?
  • ఈ గుడికి వెళ్లొచ్చిన కొన్నాళ్లకే ఇందిర హత్య… మరి మోడీ సందర్శన…?!
  • Run Away… విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి..?
  • మైక్రోబరస్ట్..! కుండపోత కాదు, ఇది పైనుంచి కమ్మేసే ఓ సునామీ..!!
  • జీతెలుగు టీవీ సీరియల్ తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
  • సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
  • 70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
  • ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions