బిగ్‌బాస్ సీజన్ ముగింపుకొస్తోంది… హీట్ పెరుగుతోంది… తాజాగా ప్రియాంక అలియాస్ పింకీ ఎలిమినేట్ అయిపోయింది… బిగ్‌బాస్ టీం మరో జంటను విడదీసింది… టికెట్టుఫినాలె పోటీలో శ్రీరాంచంద్రతో ఓడిపోయిన మానస్‌కు ఇది ఇంకో షాక్… ఇప్పుడిక మిగిలింది ఆరుగురు… ఆ వెగటు రొమాన్స్ పండిస్తున్న సిరి, షన్ను జంటను వోట్లతో సంబంధం లేకుండా హౌజు బయటికి తన్ని తరిమేస్తే బాగుండునని ప్రేక్షకజనం కోరుకుంటున్నారేమో గానీ, షన్ను అంటే బిగ్‌బాస్ టీంకు మస్తు లవ్వు… ఆ షన్ను తోక సిరి మీద కూడా ప్రేమే… కనుక ఎప్పటికప్పుడు భలేగా బచాయింపబడుతూ ఉన్నారు…
ప్రియాంక ఇన్నాళ్లూ హౌజులో కంటిన్యూ కావడం ఒక విశేషమే… నిజానికి ట్రాన్స్‌జెండర్‌ను హౌజులోకి తీసుకురావడం ప్రియాంకతోనే కొత్తేమీ కాదు… గతంలో తమన్నా వచ్చింది… కానీ తన యాటిట్యూడ్ కారణంగా త్వరలోనే బయటికి వెళ్లిపోబడింది… ప్రేక్షకులకు నచ్చలేదు… కానీ ప్రియాంక కాస్త డిఫరెంట్, లుక్కుపరంగా గానీ, యాక్టివిటీపరంగా గానీ, యాటిట్యూడ్పరంగా గానీ… హౌజులో ఎక్కువ వర్క్ చేసేది, అందరితోనూ బాగుండేది, ఈగో లేదు పెద్దగా… టాస్కుల్లో కూడా యాక్టివే… దాంతో ఆడియెన్స్‌లో ఆమె పట్ల నెగెటివిటీ ఏమీ రాలేదు…
Ads
ఇప్పుడు కూడా తను మరీ అంత తీసికట్టు ఆటతో వెళ్లిపోలేదు… సిరి, కాజల్‌లకు కూడా వోట్లు తక్కువే వచ్చాయి… ఒక దశలో కాజల్ ఎలిమినేట్ అయిపోయినట్టేనని అనుకున్నారు అందరూ… కానీ తృటిలో తప్పించుకున్నారు సిరి, కాజల్… ప్రియాంక బుక్కయిపోయింది… ఏమో, ఆమెను బయటికి పంపించేయడం వెనుక బిగ్బాసోడి స్ట్రాటజీ, స్కీం ఏమిటో అర్థం కాదు… కానీ ఇక ఆడలేడీస్లో మిగిలింది హౌజులో సిరి, కాజల్… షన్ను, సన్నీ, మానస్, శ్రీరాంచంద్రలతో పోలిస్తే వీక్ కంటెస్టెంట్లే కానీ టాప్ ఫైవ్‌లో ఒకరిని అలాగే ఉంచేస్తారు…
సో, మొత్తానికి టాప్‌లో మిగలబోయే వాళ్లెవరో ప్రేక్షకులకు మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తోంది… ఎటొచ్చీ ప్రేక్షకులే ఈ సీజన్ ఆటను చీదరించుకుంటున్నారు… ప్రత్యేకించి షన్ను, సన్నీ, సరి గేమ్‌ను పూర్తిగా చెడగొట్టేశారు… రవిని బయటికి పంపించేసి బిగ్‌బాస్ పెద్ద తలకాయలు మిగతా ఆటను చెడగొట్టేశారు… ఊరికే కామెంట్స్ పాస్ చేయడం లేదు… ఈసారి బార్క్ రేటింగ్స్‌లో బిగ్‌బాస్ పర్ఫామెన్స్ దయనీయంగానే ఉంది… దానికి పెడుతున్న ఖర్చుతో పోలిస్తే చాలా పూర్ రేటింగ్సే… వీక్ డేస్‌లో దీని రేటింగ్స్ 6.10 (ఏపీ, తెలంగాణ మొత్తం కేటగిరీలు కలిపి…) వీకెండ్ కాస్త నయం 9.14… నిజానికి బిగ్‌బాస్ క్లైమాక్సుకు వస్తున్న దశలో ఈ రేటింగ్స్ ఎక్కువగా ఉండాలి… కానీ భ్రష్టుపట్టించాక జనానికి ఇంట్రస్టు ఏం ఉంటుంది..?!
.
నాగార్జున దివాలాకోరుతనం ఏంటి అంటే… షన్నుని నెగటివ్ చేయడానికే హౌజ్ లో ఉన్నావా అని గద్దించాడు… అక్కడికి షన్ను పెద్ద శుద్ధ పూస అయినట్టు..! తొలి రోజు నుంచే ఇదేం ప్రేమ నాగ్..?!
Share this Article