.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు “దీదీ” అంటే అపారమైన ప్రజాభిమానానికి ప్రతీక… కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది… తాజాగా Mamata Banerjee కోల్కతా హైకోర్టుకు అడ్వకేట్ గౌన్లో రావడం కంటే, ఆమెను చూసి కోర్టు ప్రాంగణంలో వినిపించిన నినాదాలే పెద్ద చర్చగా మారాయి… “Pisi Chor… Bhaipo Chor…” అంటూ కొందరు న్యాయవాదులు, ప్రత్యర్థి వర్గాలు చేసిన నినాదాలు ఇప్పుడు బెంగాల్ రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి…
ఇప్పటికే ఎన్నికల తర్వాత హింస, అవినీతి ఆరోపణలు, సందేశ్ఖాలి వివాదం, టీచర్ నియామకాల స్కామ్ వంటి అంశాలతో All India Trinamool Congress ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి… అలాంటి సమయంలో హైకోర్టులో మమతా ప్రత్యక్షం కావడం రాజకీయంగా పెద్ద విశేషంగా మారింది.
Ads
అయితే అసలు చర్చ మాత్రం మరోదానిపై మొదలైంది — “ఆమెకు ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే Certificate of Practice (CoP) ఉందా?” అన్న ప్రశ్న… ఈ వివాదం అంత తీవ్రంగా మారడంతో Bar Council of India నేరుగా వెస్ట్ బెంగాల్ బార్ కౌన్సిల్ను సంప్రదించి, మమతా బెనర్జీ enrolment వివరాలు, practice status, suspension/resumption రికార్డులు రెండు రోజుల్లో పంపాలని ఆదేశించింది…
ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశం మళ్లీ వైరల్ అవుతోంది… గతంలో Suvendu Adhikari సంబంధిత విచారణ సమయంలో కూడా మమతా బెనర్జీ కోర్టుకు లాయర్గా హాజరయ్యారనే విషయాన్ని సోషల్ మీడియాలో చాలామంది ప్రస్తావిస్తున్నారు… “అప్పుడు ఎలా వచ్చారు? అప్పుడే enrolment లేకపోతే కోర్టు అనుమతించేదా?” అన్న ప్రశ్నలు వస్తున్నాయి… సర్ ప్రక్రియ మీద కోర్టులో విచారణకు కూడా ఆమె హాజరైంది…
అసలు విషయం ఏమిటంటే — భారతదేశంలో ఎవరు అయినా LLB చదివిన వెంటనే కోర్టులో వాదించే హక్కు పొందరు… ముందుగా సంబంధిత State Bar Councilలో enrolment కావాలి… తర్వాతే advocateగా practice చేయడానికి Certificate of Practice (CoP) అవసరం అవుతుంది… అయితే చాలామంది రాజకీయ నాయకులు లేదా ప్రముఖులు గతంలో enrolment అయ్యి, తర్వాత active practice చేయకపోయినా, వారి పేరు బార్ కౌన్సిల్ రికార్డుల్లో ఉండొచ్చు… అందుకే ఇప్పుడు BCI అసలు రికార్డులు అడుగుతోంది…
అంటే ఇప్పటివరకు “మమతా enrolment కాలేదు” అని ఎక్కడా అధికారికంగా తేలలేదు… అదే సమయంలో “అన్నీ సక్రమంగానే ఉన్నాయి” అని కూడా ఇంకా స్పష్టత రాలేదు… రికార్డులు బయటకు వచ్చిన తర్వాతే పూర్తి చిత్రం తెలుస్తుంది…
కానీ రాజకీయంగా మాత్రం ఈ ఘటన Mamata Banerjeeకు ఇబ్బందికరంగానే మారింది… ఒకప్పుడు బెంగాల్ వీధుల్లో ప్రజల మధ్య తిరిగినప్పుడు జైజైకారాలు వినిపించేవి… ఇప్పుడు కోర్టు ప్రాంగణంలోనే “మేనత్త డౌన్… మేనల్లుడు డౌన్…” అంటూ నినాదాలు రావడం, బెంగాల్ రాజకీయ వాతావరణంలో ఆమె పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతంగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు…
ప్రత్యేకంగా “Pisi-Bhaipo” అనే విమర్శ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒక స్థిరమైన నినాదంగా మారిపోయింది… “Pisi” అంటే మేనత్త — మమతా. “Bhaipo” అంటే మేనల్లుడు — Abhishek Banerjee… కుటుంబాధిపత్యం, అవినీతి ఆరోపణలు, అధికార కేంద్రీకరణ వంటి అంశాలపై BJP సహా ప్రతిపక్షాలు ఈ నినాదాన్ని చాలా కాలంగా వాడుతున్నాయి…!!
Share this Article