నర్సపల్లే… ఈ ఫోక్ సాంగ్ ఎంత పాపులరో తెలుసు కదా… యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్… పాట పాడిన కనకవ్వ అకస్మాత్తుగా స్టార్ అయిపోయింది… పలు టీవీ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొంది… మంగ్లితో కూడా కలిసి పాడింది… ఇప్పుడు తెలంగాణ పాట మీద కదా ఇండస్ట్రీ కన్ను… సరే, దాన్ని అలాగే తీసుకుని వాడుకుంటే పర్లేదు… కానీ తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ పాటను అలా ఎందుకు స్వచ్ఛంగా ఎందుకు ఉంచుతుంది..?
చిరంజీవి భోళాశంకర్ సినిమా వస్తోంది కదా… అందులో ఈ పాట వాడుకోవాలని అనుకున్నారు… అనుకున్నప్పుడు ఆమెను పిలిచి అదే ట్యూన్‌లో రికార్డింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా… కానీ అలా చేస్తే చిరంజీవి సినిమాకు ఎంత నామర్దా… సినిమా కథ రీమేక్ హక్కులు తీసుకున్నా చిరంజీవికి అనుగుణంగా మారిపోవాల్సిందే… పాటలు, డాన్సులు మారిపోవాల్సిందే… కొత్త కొత్త కమర్షియల్ వాసనలు అద్దాల్సిందే…
సో, కనకవ్వ పాట యథాతథంగా సినిమాకు తీసుకోలేదు… ఈమధ్య రవితేజ పాట జింతాక హిట్ కదా, ఆ స్టయిల్‌లో జామ్ జామ్ జజ్జనక అని ఓ పాట రాయించారు శ్యామ్‌తో… నిజానికి శ్యామ్‌కు లిబర్టీ ఇస్తే తను అద్భుతంగా రాయగలడు… కానీ చిరంజీవి సినిమా అంటే అలాంటి చాన్సులు ఉండవు కదా… సంగీతం సమకూర్చిన మహతి స్వరసాగర్‌కూ అంతే… డప్పేస్కో దరువేస్కో అని స్టార్టవుతుంది పాట… దరువు అనే పదమే తెలంగాణలో ఎవరూ వాడరు…
Ads
ఈలేస్కో, ఇరగేస్కో, చిందేస్కో… అవి నాన్ తెలంగాణ పదాల్ని ఏస్కున్న పాటలో చిరంజీవి మధ్యలోనే ట్విస్ట్ ఇచ్చి… ‘తమ్ముళ్లూ, మనకు కాస్త చేంజ్ కావాలమ్మా దరువు మార్చి కొత్త సౌండేస్కోండి అంటాడు… అప్పటిదాకా వినిపించిన ఏదో ట్యూన్ హఠాత్తుగా మాటమారుస్తుంది, సారీ, పాటమారుస్తుంది… అన్నట్టు ఈ దరువు అనే పదం తెలంగాణలో ఎవరూ వాడరు… ట్యూన్ మారిపోయి ‘నర్సపల్లే గండిలోన గంగధారి’ అని సింగర్ పాటెత్తుకుంటాడు…
నాటుపిల్ల మాటలకు పోటుగాడు రెచ్చిపోయే గంగధారి అంటూ చిరంజీవి తేలిక స్టెప్పులతో రెచ్చిపోయాడు… ఆ తరువాత అత్తర్లు, థ్రిళ్లు, తుళ్లు వంటి ఏవేవో చిరంజీవి మార్క్ పాట సాగిపోతుంది… ఒక పాట కోసం మంచి పాపులర్ తెలంగాణ పాటను ఇంత ఖూనీ చేయాలా అని ప్రేక్షకుడు కంగుతింటాడు… అవసరమా అధ్యక్షా… ఐనా చిరంజీవి సినిమా అంటేనే స్టెప్పులు, సాంగులు కదా… ఆయనేమైనా కళాఖండాలు చేస్తాడా..? సో, ఈ తెలంగాణ కళను కూడా ఖండించాడని అనుకుని నిట్టూర్చడమే…
అసలు అది కాదు, మిస్టర్ ప్రెగ్నెంట్ అని బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ఓ సినిమా వస్తోంది… అందులో కూడా ఈ నర్సపల్లె సాంగ్ ఉందట… సో, ఒకే పాట ఇద్దరు వేర్వేరు సింగర్స్ వేర్వేరు సినిమాల్లో వాడుకున్నారన్నమాట… ఎక్కడి చిరంజీవి, ఎక్కడి సోహెల్… ఫాఫం చిరంజీవి… పుష్ప వంటి సినిమా పాటలు అంత బంపర్ హిట్ కదా… మరి అలా రాయించుకోవచ్చు కదా, ట్యూన్ చేయించుకోవచ్చు కదా… ఈ కాపీలు దేనికి..? ఈ ఖూనీలు దేనికి మాస్టారూ..?!
Share this Article