.
ఈనాడు రోజురోజుకూ పాతాళంలోకి జారిపోతున్న తీరు నిజంగానే దయనీయం… ఓ పోస్టు చదవండి… ఫాఫం అనిపిస్తుంది…
.
Ads
ఇదేం పద్ధతి ..? వాస్తవాలను వార్తగా ఇవ్వడంలో వివక్ష అవసరమా..? హంతకులను కాపాడే ప్రయత్నమా ..?లేక హిందుత్వంపై వివక్ష కారణమా..? ఇలాంటి వరుస ఘటనలతో పాఠకులకు కన్ఫ్యూషన్ చేయడం అవసరమా..?
చంపింది ఎవరు..? చనిపోయింది ఎవరు.. ? అనే సమగ్రమైన వివరాలు అందించకపోవడం పాఠకులను మోసం చేసినట్టు కాదా..? ఒక సంఘటన గురించి సమక్రమమైన వివరాల అందజేయడం వార్త! కానీ, వాస్తవాలను తొక్కిపెట్టి, పాఠకులను అయోమయానికి గురి చేయడం కరెక్ట్ కాదు…
ముఖ్యంగా హంతకుల పేర్లు, నిందితుల పేర్లు దాచిపెట్టడం సరైనదేనా..? ఒక సంఘటనపై కేసు నమోదు అయిందంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలను కేసు నమోదు చేసిన సంబంధిత పోలీసు అధికారి చేత తీసుకుని పాఠకులకు అందజేయాలి. కానీ హంతకుల పేర్లు, నిందితుల పేర్లు దాచి పెట్టడం వల్ల అసలు విషయం తొక్కిపెట్టి, నిందితులను కాపాడేటందుకోసం ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతుంది…
కట్టెల దుకాణం విషయంలో గొడవ జరిగింది వాస్తవం. శ్రీనివాస్ అనే వ్యక్తిని సోహెల్, అతని అనుచరులు కలిసి కత్తితో పొడిచి, కట్టలతో కొట్టి చంపింది వాస్తవం. ఇది సంఘటన. దీనిని వార్తగా మలచాలి.
కానీ దోషుల పేరు రాయకుండా వార్త ఇవ్వడంతో హంతకులను, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. అసలు వార్తను వార్తలాగా ఇవ్వకుండా, వాస్తవాలను దాచి పెట్టి, దోషులను కాపాడే ప్రయత్నం ఎందుకోసం చేయవలసి వస్తుందో పాఠకులకు తెలియజేయాలి.
గతంలో కూడా కరోనా ప్రబలిన సమయంలో ఒక ముస్లిం వ్యక్తి పేరు రవిగా మార్చి హిందూపై ముద్ర వేసిన విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులు ఇంకా మరిచిపోనేలేదు. నేడు మళ్ళీ ఇలాంటి హంతకులను కాపాడే ప్రయత్నం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వాస్తవాలను తొక్కిపెట్టడం నేరం కూడా అవుతుంది.
సమగ్రమైన సమాచారం ఇవ్వడం విలేకరి బాధ్యత. ఒకవేళ అసమగ్రమైన సమాచారం ఇస్తే, పూర్తి సమాచారం సేకరించి.. ఎవరు ఎవరిని చంపారు..? ఎందుకోసం చంపారు..? ఆ వివరాలు కేసు నమోదు ఆధారంగా (పోలీసు అధికారుల వివరాల ప్రకారం ) సేకరించి వార్తను పబ్లిష్ చేయాల్సిన పని డస్క్ పై కూడా ఉంటుంది.
మరి ఎక్కడ లోపం జరుగుతుందో గానీ ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి. ప్రధానంగా హిందుత్వంపై పక్షపాతం ప్రదర్శిస్తున్నట్టే కనపడుతుంది. ఈ విషయంలో పాటకులకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత “ప్రధాన పత్రిక దే”
కనీసం ఈ రోజైనా పాఠకులకు సరైన సమాచారం అందజేయాలి. చంపిన వ్యక్తి పేరు రాయకుండా మైనర్ అని రాశారు. మైనర్ అంటే ఎవరు..? ఆ మైనర్ కు పేరు లేదా..? పోలీసు కేసులు నమోదు చేయలేదా ..? లేదా ఆ పేరును తారుమారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? చంపింది వాస్తవమైనప్పుడు హంతకుల వివరాలు అందించడంలో పక్షపాతం ఎందుకు..? పాఠకులను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు..?
కేసు నమోదు ఆధారంగా పోలీసు అధికారుల వివరాల ప్రకారం వార్తను వార్తగా రాసే అలవాటు చేసుకోవాలి. కనీసం ఈ రోజైనా చంపింది ఎవరు..? చనిపోయిన వారు ఎవరు..? పేర్లతో సహా పాఠకులకు అందజేస్తారని ఆశిస్తున్నాము.
పక్షపాత ధోరణి వీడి సాక్షాలను తారుమారు చేసే కుట్రకు తెర లేపకుండా వ్యవహరిస్తారని కోరుకుంటున్నాము.
గమనిక : ఈనాడులో హంతకుల పేరు రాయలేదు. కానీ కేసు నమోదు ఆధారంగా హంతకుడి పేరును సాక్షి, ఆంధ్రజ్యోతి ప్రచురించాయి…
.
ధన్యవాదాలు
పగుడాకుల బాలస్వామి
9912975753
9182674010
Share this Article