.
నిన్న సోషల్ మీడియాలో ఓ పోస్టు (Va Sam) కనిపించింది… అది ఇలా…
‘‘ఈనాడు ఎంత అమానవీయంగా ఉంటుందో చూడండి… గాయపడిన వ్యక్తి ఈనాడు విలేకరి… పోనీ వాళ్ళ భాషలో న్యూస్ టుడే అనుకుందాం… ఇప్పుడిప్పుడే కాదు.. ఓ 15 ఏళ్లుగా…
Ads
వార్తలు రాసి వెళ్తుండగా దాడి జరిగితే ఈనాడు రాతలు చూడండి… ఏపీలో విలేకరులకు రక్షణ లేదనుకుంటారని భయమా… ఈనాడు అని రాస్తే నష్టమా..?
వాడుకున్నంత వాడుకుని ఇలా చేతులు దులుపుకోవడం తగునా ఈనాడుకి..? వీళ్ళు మళ్ళీ అందరికీ నీతులు చెబుతారు…’’
ఇదుగో ఆ వార్త…
నిజమే కదా… ఈనాడు విలేఖరి అని రాసుకుంటే వెంటనే ఏమైనా కొంపలు మునుగుతాయా..? ఈనాడు నుంచి రెగ్యులర్ జీతాలు, భత్యాలు క్లెయిమ్ చేసుకుంటాడా..? సరే, ఏనాటి నుంచో ఏదో ఓ న్యూస్ ఏజెన్సీ పేరిట శ్రమ దోపిడీ అలవాటే కాబట్టి… ఈనాడు అని రాయలేదు సరే…
కనీసం న్యూస్‌టుడే విలేకరి అనైనా ఓన్ చేసుకోవాలి కదా… ఈ ధోరణి ఇలా ఉంటే విలేకరులు పత్రికను ఎందుకు ఓన్ చేసుకోవాలి..? నిబద్ధత ఎందుకు ప్రదర్శించాలి..? ఇదంతా పోనీ, మొత్తం వార్తలో కనీసం ఏ పత్రికో, ఏ న్యూస్ ఏజెన్సీయో రాయకపోయారు సరే… కనీసం ఓ విలేకరి అనైనా రాసి ఉండాలిగా…
ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడని రాసుకోవడం మాత్రం దారుణం… మొదటి వాక్యంలోనైతే మరీ దారిన వెళ్తున్న వ్యక్తి అని రాశారు… ఎవరో దారినపోయే దానయ్య అన్నట్టుగా… మరీ దారుణం…
పైగా దాడికెి పాల్పడింది మైనర్లు… అదీ మద్యం మత్తులో… వాళ్లకు మద్యం ఎవరు సప్లయ్ చేశారు..? అర్ధరాత్రి దాకా మద్యం మత్తులో బజార్లలో తిరుగుతూ మరో వ్యక్తితో కూడా గొడవ పడినట్లు వార్తలో ఉంది కదా… ఇంత మొక్కుబడిగా, నిర్లిప్తంగా, ముక్తసరిగా రాయడం ఏమిటి అసలు..? ఫాఫం ఈనాడు… రోజురోజుకూ ఇంతగా ప్రమాణాల పతనమా..?
Share this Article