.
మొన్న మనం T20 వరల్డ్ కప్ లో ఇటలీ టీం పెర్ఫామేన్స్ గురించి “ముచ్చటిం”చుకున్నాం కదా… ఇది ఇంకో సైడ్, ఇటలీ అంటేనే ఫుట్ బాల్… ప్రపంచంలోనే అత్యధిక పాపులరిటీ కల టోర్నమెంట్… ఎంతలా అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థని మార్చే అంత… ఫుట్ బాల్ అంటేనే బ్రెజిల్, అర్జెంటినా, ఇటలీ తర్వాతే ఏ దేశామైనా…
ఇప్పటి వరకు 22 ప్రపంచ కప్పులు జరిగితే పై మూడు దేశాలు కలిసి గెలిచిన కప్పులు 12… అంటే దాదాపు 60%…. అటువంటి ఇటలీ ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతుంది ఫుట్ బాల్ పరంగా… ఎందుకంటే, 48 జట్లు పాల్గొనే 2026 ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్ కి క్వాలిఫై కాకపోవడమే… Same క్రికెట్లో వెస్టిండీస్ లాగా….
Ads
ఫుట్ బాల్, ఇటలీ విడదీయారని సంబంధం… కళాత్మక ఆటకి, డిఫెన్సివ్ ఫుట్ బాల్ కి ఇటలీ పేరు, దాని అటకన్నా ఇటలీ బ్లూ కలర్ జెర్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు, పాపం అడిదాస్ కంపెనీ ఎలాగైనా వీళ్ళు క్వాలిఫై అయితారు అని లాస్ట్ వీక్ జెర్సీని కూడా మార్కెట్లో లాంచ్ చేసింది.. అంటే ఒక టీం క్వాలిఫై కాకుండానే దానికి జెర్సీని మార్కెట్లోకి లాంచ్ చేసారంటే దాని క్రేజ్ ఇప్పటిదో అర్ధం చేసుకోండి…
ఇంకోటి ప్లేయర్స్ స్టైల్ కానీ, లుక్స్ కానీ, మెజారిటీ ఇటలీయన్ ఫుట్ బాల్ ప్లేయర్స్ చాలా హ్యాండ్సమ్ గా, మాన్లీ గా డిఫ్రెంట్ హెయిర్ స్టయిల్స్ తో ఈ మోడల్ కి తీసిపోనివిదంగా ఉంటారు, వాళ్ల ఆట లాగే వాళ్ళ ఆటగాళ్లు..
పాపం కానీ రెండు దశబ్దాలుగా, సరియినా దీర్ఘ కాలిక వ్యూహం, లేక ఇంగ్లీష్ ఫుట్ బాల్ దెబ్బకి టీవీ సాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా రెవెన్యూ పడిపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూత్ మీద ఇన్వెస్ట్ చెయ్యలేకపోవడం, ఫెడరేషన్ అవినీతి… ఇలా చెప్పుకుంటే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలలాగా…
కానీ, ఒక్కటి మాత్రం నిజం… ఇటలీ లేని ప్రపంచ కప్ హీరో (లుక్స్ పరంగా ) లేని సినిమా లాంటిది… అన్నట్టు, వీళ్ళ టీం ముద్దు పేరు” అజురి “… అంటే ఇటలీలో బ్లూ కలర్ కూడా, వీళ్ళ జెర్సీ కలర్… నిన్నటి ప్రపంచ కప్ క్వాలిఫైర్స్ లో ఓటమి తర్వాత ప్రతి ఫుట్ బాల్ అభిమాని అనుకున్నది ఇక ఇటలీ పని అయిపోయిందనే…
ఎందుకంటే, అది ఇప్పుడు మళ్ళీ టాప్ 5 ఫుట్ బాల్ జట్టుగా ఎదగడం కష్టం, కానీ స్పోర్ట్స్ లో ఎప్పుడు ఏం ఎలా జరుగుతుందో చెప్పలేం కదా… బట్, వుయ్ మిస్ యు అజురీస్ ఇన్ థిస్ వరల్డ్ కప్ ఫుట్ బాల్….
క్రికెట్లో వెస్టిండీస్ ఫుట్ బాల్ లో ఇటలీ… ఇక లేవడం కష్టమే… ప్రస్తుతానికి..!!

Online లో ఒరిజినల్ 6000 రూపాయల ధర ఈ జెర్సీ... ఆఫీషియల్ జెర్సీ, అంత పాపులర్ ఇది... ప్రపంచవ్యాప్తంగా.... కానీ రేపు దీని పరిస్థితి..?
Share this Article