.
ఫాఫం నమస్తే తెలంగాణ అనిపించింది ఈరోజు పత్రిక చూస్తే… కరపత్రికగా ఎవడైనా ఉండొచ్చు, అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు సర్క్యులేషన్ ఫిగర్లతో కోట్లకుకోట్ల యాడ్స్ దంచుకోవచ్చు, కానీ ఒక ప్రొఫెషనల్ పత్రికగా ఉండటం దానికి అస్సలు చేతకాదని మరోసారి స్పష్టమైంది…
బీఆర్ఎస్ సొంత డప్పు కాబట్టి ఏదో ఒకటి రాస్తుంది, అది వదిలేద్దాం… నిన్న రాజ్యసభలో వక్ఫ్ బిల్లు మీద వోటింగు జరిగింది కదా… దేశం మొత్తం దానివైపు చూసింది… రాత్రి 2.30 గంటల దాకా సాగింది అదే చర్చ… అది చూస్తుంటే, రేపు తెలుగు పత్రికలు దీన్ని కవర్ చేయగలవా ఓసారి పరిశీలనగా చూడాలని అనిపించింది…
Ads
ఎందుకంటే, ఆ బిల్లుకు ఓ ప్రాముఖ్యత ఉంది, తరువాత చెప్పుకుందాం… తీరా తెల్లవారి పత్రిక చూస్తే మొన్నటి లోకసభ బిజినెస్ వార్త కనిపించింది… ఇలా…
.
రెండు రోజులనాటి చద్ది వార్త… రాజ్యసభలో చర్చ జరుగుతుందని ఓ ప్రస్తావన అంతే… ఫాఫం అనిపించింది దాని దురవస్థ చూస్తే…! ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి… అన్నీ ఆంధ్రా పత్రికలే… రాజ్యసభ వోట్ల వివరాలతో సహా మంచి ప్రయారిటీ ఇచ్చి ప్రచురించాయి… అవి ఎంతగా తమ అనుకూల పార్టీల, సొంత పార్టీల డప్పులే ఐనా చాలా సందర్భాల్లో ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ చూపిస్తాయి…
ఈ నమస్తే తెలంగాణను చూసి కేసీయార్ గర్వపడుతుంటాడు… పిటీ పింకీ… మన తెలంగాణ అనే పత్రిక ఉంది ఒకటి… దానికి సొంతంగా ప్రింటింగ్ లేదు, లేటుగా పేపర్ ప్రింటింగ్‌కు పంపిస్తే, దాన్ని ప్రింటే చేసే సాక్షివాడు అంగీకరించడు… సో, వాడు డెడ్‌లైన్ పెంచుకోవడానికి కష్టం అంటే అర్థముంది… మరి నమస్తే తెలంగాణకు ఏం రోగం..?
తెలివిలేనితనం, రెయిజ్ టు అకేషన్ అనే సోయి లేకపోవడం… ఏవో నాలుగు బీఆర్ఎస్ వార్తలు, ఆ డప్పు వ్యాసాలే పబ్లిష్ చేసేస్తే సరి అనుకునే ఓ పక్కా అన్‌ప్రొఫెషనల్ పోకడ… వెలుగు అనే మరో పత్రిక ఉంది… అదీ నమస్తే తెలంగాణ స్థాయిలోనే కనిపించింది… డెడ్‌లైన్ మేనేజ్‌మెంట్ అనే కనీసజ్ఞానం కనిపించలేదు…
సరే, ఆ బిల్లు ఇంపార్టెన్స్ ఏమిటంటే..? ప్రతిపక్షాలు దాన్ని బీజేపీ మార్క్ యాంటీ ముస్లిం బిల్లు అని ముద్రలు వేశాయి… జేపీసీ వేసి బిల్లుకు కొన్ని సవరణలు చేసి ప్రవేశపెట్టింది ఎన్డీయే… తెలుగుదేశం, జెడియు పక్కచూపులు చూడలేదు, లోకసభలో మెజారిటీ ఉంది, పాసైంది… అదీ సుదీర్ఘ చర్చ తరువాత…
రాజ్యసభలో ఎన్డీయేకు 2 వోట్లు మెజారిటీ మాత్రమే ఉంది… టీడీపీ మా చంద్రబాబు ముస్లింలకు అది చేశాడు, ఇది చేశాడు అని బీద మస్తాన్‌రావుతో ఏదేదో చెప్పించి, ముస్లింలు వ్యతిరేకులు గాకుండా ఏదో మసిబూసి మారేడుకాయ చేసి, చివరకు బిల్లుకు సమర్థన తెలిపింది… కానీ టఫ్ ఫైట్… ఓటింగ్ పెడితే బిల్లు వీగిపోయే ప్రమాదం కూడా ఉంది, చిన్న తేడా దొర్లినా…
కానీ చివరలో బీజేడీ తన సభ్యులకు జారీ చేసిన విప్ వెనక్కి తీసుకుని, మీ వ్యక్తిగత అభిప్రాయాల (ఆత్మప్రభోదం) మేరకు వోట్లు వేసుకొండి అని చెప్పింది… వైసీపీ కూడా అంతే… మేం బిల్లుకు వ్యతిరేకం అని చెప్పుకుని కూడా నో విప్… స్టిల్, ఆ పార్టీ బీజేపీ చేతుల్లో ఉందా, జగన్ ఇంకా వణికిపోతూనే ఉన్నాడా..? కూటమి ప్రభుత్వం వచ్చినా సరే జగన్ ఓ ప్రతిపక్షంగా కేంద్రంలో వ్యవహరించలేకపోతున్నాడా..?
చివరకు అమిత్ షా చాణక్యం సక్సెసయి బిల్లుకు అనుకూలంగా 128 వోట్లు వచ్చాయి… ఇండి కూటమి 95 వోట్లతో ఉసూరుమంది… ఆప్, డీఎంకే, టీఎంసీ ఎట్సెట్రా నాన్ బీజేపీ పార్టీలన్నీ కలిసినా సరే ఎన్డీయే కూటమికి చెమటలు పట్టించలేకపోయింది ఇండి కూటమి… టఫ్ ఫైట్ ఇవ్వగలిగిన ఈక్వేషన్లు ఉన్నా సరే… 13 మంది అసలు సభకే రాలేదు… వాళ్లెవరో…!!
శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) గ్రూపును చూస్తే మరోసారి ఆశ్చర్యం… ఒకప్పుడు బీజేపీని మించిన మతవాదం దానిది… ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ తరహా శుష్క సెక్యులరిజం బాటలో పడి, గంగ చంద్రముఖిగా మారిపోయింది… ఈసారి చర్చలో ఎన్డీయే సభ్యులు ధాటి వాదనలతో ఇండికూటమికి కౌంటర్లు ఇచ్చారు… అదీ విశేషం… అవునూ, వక్ఫ్ బిల్లు మీద బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటబ్బా..!?
Share this Article