.
ఒకప్పుడు తెలంగాణ విముక్తి ఉద్యమానికి ఊపిరిలూదిన పత్రిక నమస్తే తెలంగాణ… మొదట్లో ఏ కంట్రాక్టర్ డబ్బులు పెట్టాడనేది వదిలేస్తే, తరువాత కేసీయార్ సొంతం చేసుకున్నాడు… ఇప్పుడు ఆ పార్టీలాగే అదీ అపాత్రికేయంతో భ్రష్టుపట్టిపోయింది… సర్లెండి, ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రిక బాగుంది అంటారా..? అవును… అన్నీ అంతే… కాకపోతే…
ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహాన్యూస్ సొంతదారులు వేరు… పచ్చ మీడియాయే డౌట్ లేదు, చంద్రబాబే ఆదిగురువు వాటికి… కానీ కనీసం తటస్థం అనే ముసుగులు వేసుకోవడానికి వీలుంది వాటికి… కానీ సాక్షి, నమస్తే తెలంగాణ డిఫరెంట్… వాటి ఓనర్లు రెండు రాజకీయ పార్టీల ఓనర్లు… అవి వ్యక్తి కేంద్రిత పార్టీలు… ఆ వ్యక్తి , ఆ పార్టీ జెండాను, ఎజెండాను మోయడం తప్ప తనకుమాలిన ధర్మం వేరే ఉండదు ఇక… తటస్థత అనేది నిషిద్ధపదం…
Ads
తెలంగాణ ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ, అంతకుముందే టీన్యూస్… ఎందుకు తెలంగాణ జనం ఆదరణ పొందాయంటే… మిగతా మీడియా మొత్తం తెలంగాణ వ్యతిరేకం… పక్కా ఆంధ్రా గొంతుకలు… అప్పుడు తెలంగాణవాణి అవసరమైంది… ఆ బాధ్యతను కేసీయార్ సొంత మీడియా నెరవేర్చింది… తరువాత అధికారం వచ్చింది… ఎనలేని దోపిడీ స్టార్టయింది…
ప్రాజెక్టులు, దందాలు, కమీషన్లు, ఫామ్హౌజులు, భూములు, స్టార్ హోటళ్లు… వాట్ నాట్..? ఆకాశమే హద్దు… వశపడని సొమ్ములొచ్చి పడ్డయ్… ఆ చీకటి పర్వం నుంచి తెలంగాణ పాలన బయటపడేసరికి… నాటి ఉద్యమవాణి నమస్తే తెలంగాణ కూడా మసకబారింది… పాత్రికేయం అనే పదం, ప్రమాణాలు అక్కడ నిషిద్దం అయిపోయాయి… బీఆర్ఎస్ పార్టీలాగే ఆ మీడియా కూడా తెలంగాణ సమాజం ఛీత్కరణకు లోనైంది…
ఇక్కడ ఐరనీ ఏమిటంటే..? అది చివరకు దాని సొంతదారు కూడా పట్టించుకోవడం లేదు… గాలికి వదిలేశాడు… మొదటి నుంచీ కేటీయార్కు దానిపై సదభిప్రాయం లేదు, దాన్ని అమితంగా సొంత బిడ్డలా ప్రేమించిన కేసీయార్ కూడా వదిలేయడమే పాపం, ఆ పత్రికలో పనిచేసేవాళ్ల విషాదం…
జనం దానికి ఎలాగూ విలువనివ్వడం లేదు… ఏవేవో గాలికథనాలు, బురద క్యాంపెయిన్లు రాస్తున్నారు గానీ, ఎవరూ చదవడం లేదు… కనీసం జీవితచందాలు కట్టించబడిన పార్టీ నేతల్లో కూడా చాలామంది మడత విప్పి దాని మొహం చూడరు… రియాలిటీ… ఇప్పుడు ఎన్ని కాపీలకు పడిపోయిందో తెలియదు… అధికారంలో ఉన్నప్పుడు ఏబీసీ రిపోర్టు సంపాదనకు అడ్డురాకూడదని, ఏబీసీ నుంచి బయటికి వచ్చి, ఇష్టారాజ్యంగా యాడ్ టారిఫ్ ఖరారు చేయించుకున్నారు…
ఇప్పుడు ఆ ఆదాయమూ లేదు… యాడ్స్ ఘోరంగా పడిపోయాయి… సింపుల్గా చెప్పాలంటే దాన్నెవడూ దేకడం లేదు… అదీ దాని దురవస్థ… ఇంకా ఉంది చెప్పుకోవడానికి… ఆరు నెలలుగా ఇంక్రిమెంట్లు లేవు, జీతాల పెంపు లేదు… బోనస్లు ఎట్సెట్రా మరిచిపొండి… సంస్థాగత అవకతవకలు, ఆశ్రిత పక్షపాతాలు వదిలేస్తే…
అంత అపారంగా సంపాదించి, అలవిమాలిన సాధనసంపత్తి సమకూర్చుకున్న పార్టీకి ఈ పత్రిక ఖర్చులు ఓ లెక్కా..? అడ్డగోలుగా పెరుగుతున్న జీవనవ్యయాల్లో నాలుగు రూపాయల జీతం పెంపు ఆశిస్తే తప్పా..? ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియదు… ఎవరికీ పట్టదు… ఒక్కొక్కరే వదిలేసి వెళ్తున్నారు… అదీ కీలక బాధ్యతల్లో ఉన్నవాళ్లు… ఇది ఇక ఆగేట్టు లేదు…
మొదటి నుంచీ వెన్నెముకగా ఉన్న ప్రొడక్షన్ బాధ్యుడు వెళ్లిపోయాడు… సర్క్యులేషన్ బాధ్యుడు వెళ్లిపోయాడు… యాడ్స్ బాధ్యుడు ఊగిసలాటలో ఉన్నాడు… ఇంకా ఎవరెవరు కాడికింద పడేస్తారో తెలియదు… సీఈవో/ ఎండీ ఆఫీసు మొహం చూడటం లేదు… చాలామంది జర్నలిస్టులూ ఎగ్జిట్… అసలు దాని మనుగడ ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది చాలామందిలో…
బయట మార్కెట్ బాగాలేదు, లేకపోతే సగం ఖాళీ అయిపోయేది… ఇప్పటికీ సొంత ప్రింటింగ్ యూనిట్లు, బిల్డింగులు, ఆస్తులు ఉన్నాయి కాబట్టి… తోడుగా చానెల్, ఇంగ్లిష్ పత్రిక, సోషల్ మీడియా- డిజిటల్ మీడియా విభాగాలు గట్రా ఉన్నాయి కాబట్టి మూతపడకపోవచ్చు… అడ్డికిపావుశేరు అమ్ముదామని అనుకున్నా కొత్తగా ప్రింట్ మీడియాలో పెట్టుబడులు ఎవరూ పెట్టే సీన్ లేదు ఇప్పుడు… సో, చావకుండా బతకకుండా అలా నడిపించేస్తారా దాన్ని..?!
యూట్యూబ్ చానెళ్లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా విభాగాలు… అబద్ధాల బురద క్యాంపెయిన్లు నడపటానికి దేశంలో ఏ పార్టీకి చేతకానంతగా… కోట్లకుకోట్లు ఖర్చు చేస్తున్న బీఆర్ఎస్ తన సొంత, పాత సంప్రదాయ మీడియాను గాలికి వదిలేయడం ఏమిటనేది పాపం, అందులో పనిచేసే వాళ్ల ప్రశ్న… దీనికి జవాబు చెప్పగలవాడు కేసీయార్ ఒక్కడే… కానీ పాపం, తను ఇప్పుడు ధృతరాష్ట్రుడు..!!
Share this Article