ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ గురించి…. దేశానికి స్వరాజ్యం తెచ్చి, సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన పార్టీ ప్రస్తుత దుర్గతి గురించే… ఆర్ణబ్ గోస్వామి భాషలో చెప్పుకోవాలంటే వాద్రాల పరాజయం… అంటే సోనియా కుటుంబం ఘోర పరాజయం… భవిష్యత్తు కనిపించని ఓ పెద్ద జాతీయ పార్టీ… కాంగ్రెస్ ముక్త భారత్ అనే మోడీ లక్ష్యాన్ని రాహుల్ నిజం చేస్తున్నాడా అనే సెటైర్ నిజం అవుతున్న చేదు దృశ్యం…
ఇందిర పోలికలున్నంత మాత్రాన… గంగలో నాలుగుసార్లు అవసరార్థం మునకలు వేసి, శివపూజ చేసినంత మాత్రాన… వోటర్లు నమ్ముతారనేది ఓ భ్రమ అని యూపీ ప్రజలు తేల్చిపడేశారు… అధికారంలో ఉన్న పంజాబ్‌లో వర్గాల తన్నులాటలో పార్టీ నిండా మునిగిపోయింది… పోటాపోటీ అనుకున్న ఉత్తరాఖండ్‌లో జనం ఈడ్చిపడేశారు… మణిపూర్, గోవా వదిలేయండి, అవి బేరసారాల రాజకీయాల అడ్డాలు… కొనుగోలు శక్తి ఎవరికి ఎక్కువ ఉంటే వాడే తోపు…
కావచ్చు, పూర్తిగా విధ్వంసం జరిగాక… సీనియర్ నాయకుల భూతాలు పార్టీని వదిలేస్తే… ఆ శిథిలాల మీద కొత్త పార్టీని నిర్మించుకుంటాను అనేది రాహుల్ నమ్మకం…. సారీ, రాహుల్ విఫల కోటరీ వ్యూహం కావచ్చుగాక… కానీ చేదునిజం ఏమిటంటే… వోటర్లు మీకు వోట్లేస్తాంరా బాబూ అంటే కూడా ఆ పాజిటివిటీని వాడుకోలేని దురవస్థ కాంగ్రెస్‌ది… ఇక ఇప్పట్లో కోలుకునే సీన్ కనిపించడం లేదు… ఎందుకు..?
Ads
ప్రధానమైన పాయింట్… రాహుల్…!! రాజకీయ జ్ఞానరాహిత్యం, అనుభవరాహిత్యం, పరిపక్వతారాహిత్యం… వారసత్వం ఉన్నా సరే, అట్టర్ ఫ్లాప్ అయిన హీరోల్లాగే…!! పంజాబ్ రాజకీయాల్ని సరిగ్గా టాకిల్ చేయలేక పూర్తిగా దెబ్బతిని బేర్‌మంటున్న ఏడుపు… మణిపూర్, గోవాల్ని వదిలేస్తే… కాస్తో కూస్తో మంచి పోటీ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నా సరే ఉత్తరాఖండ్ చేజార్చుకోవడం… అమరీందర్, సిద్ధూ పంచాయితీని రాహుల్ తన ఇగోతో కంపు కంపు చేసిన ఫలితం కనిపిస్తోంది…
ఇదంతా ఎందుకు చెప్పుకోవాలంటే…. ఏపీని వదిలేయండి, ఇక్కడ కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేదు… ఇక్కడ కాంగ్రెస్‌కు ఓ దశ లేదు, ఓ దిశ లేదు… పోనీ, కాస్తోకూస్తో బలమున్న తెలంగాణలో…. ఇక్కడా పనిచేసేవాడి కాళ్లల్లో కట్టెలు పెట్టడమే కదా… సీనియర్లే కదా అసలు శాపం… ఇప్పటికిప్పుడు తెలంగాణలో కేసీయార్ ముందస్తుకు సై అన్నా సరే, కాంగ్రెస్ రెడీగా ఉందా..? లేదు… ఆ సీన్ లేదు… ఎవరు కోవర్టులో రాహుల్‌కు తెలియదు, అర్థం చేసుకోలేడు, దూరం పెట్టలేడు… అందుకే కేసీయార్ కాంగ్రెస్‌ను ఇక లైట్ తీసుకుంటున్నాడు… బీజేపీని టార్గెట్ చేశాడు… తిట్టిపోస్తున్నాడు…
తను నిజానికి బీజేపీ బీ-టీం అనే విమర్శ మాటెలా ఉన్నా సరే… తెలంగాణకు సంబంధించి టీఆర్ఎస్ ప్రథమ, ప్రబల శత్రువు బీజేపీయే… అఫ్‌కోర్స్, బీజేపీలో బయటికి చెప్పుకోలేని రోగాలు చాలా ఉన్నయ్… హైకమాండ్‌కే రోగనిర్ధారణ చేతకావడం లేదు… చికిత్స ఏమిటో అంతుపట్టడం లేదు… ఐనా కేసీయార్‌లో ఓ ఉలిక్కిపాటు ఉంది… ఇక అమిత్ షా ఏం చేస్తాడో చూడాల్సి ఉంది… కేసీయార్ మీద జనంలో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటాడా ఆ చతుర్ బనియా..? వేచి చూడాలి…!!
Share this Article