Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సింగిల్ సమంతపై విజయ్ కన్ను… ఫాఫం, రష్మికకు మళ్లీ శోకాలేనా..?!

October 28, 2022 by M S R

అతనికన్నా ఆమే రెండుమూడేళ్లు పెద్ద… ఫాఫం, విజయ్ దేవరకొండ కాలేజీలో చదువుతున్నప్పుడే సమంత వెండితెరకు ఎక్కింది… ఆమెను చూసి తనకు పిచ్చెక్కింది… అప్పటి నుంచీ ఆరాధిస్తూనే ఉన్నాడు… మొదట్లో ఆమె సిద్ధార్థ్ మాయలో పీకల్లోతు పడిపోయింది, మునిగిపోయింది…

విజయ్ కాలేజీ నుంచి బయటికి వచ్చి, సినిమాల్లో చిన్నాచితకా వేషాలు వేస్తున్నాడు కానీ తనను దేకేవారు ఎవరు..? సమంత ఓ ప్రేమ దేవత… వెండితెరపై వెలిగిపోతున్న దేవత… విజయ్‌ను చూసేంత సీన్ ఉందా..? కానీ మెల్లిమెల్లిగా తనూ హీరో అయ్యాడు… అర్జున్‌రెడ్డితో పాపులర్ అయిపోయాడు… ఈలోపు సమంత కాస్తా నాగార్జున కొడుకు చైతూ వశమైపోయింది…

ప్చ్, విజయ్‌కు ఎప్పుడూ నిరాశే… తన ఆరాధన వృథా అయిపోతోంది… మధ్యలో మహానటిలో ఇద్దరూ కలిసి నటించారు… ఆరాధన మరింత చిక్కబడింది… కానీ చేసేదేముంది..? ఈలోపు రష్మికతో బంధం పెరిగింది… ఫాఫం, అప్పటికే ఓ బ్రేకప్… రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగి, భగ్నమైంది… విజయ్‌ను చూసి మనసు పారేసుకుంది…

Ads

మెల్లిమెల్లిగా ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది… సంపాదించిందంతా విజయ్ కోసం ఖర్చు పెడుతోంది… తన మాయలో పడిపోయింది… చివరకు ఇల్లు కొంటానంటే కూడా డబ్బులిచ్చింది… తీరా చూస్తే ఇప్పుడు ఆ ఇల్లు ఏమైందో, ఒక దశలో ఫోర్బ్స్ జాబితాల్లో కనిపించిన విజయ్ డబ్బంతా ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు… రష్మిక విజయ్‌ను అలాగే అతుక్కుపోయింది…

samantha

చివరకు లైగర్ అనే ఓ పిచ్చి సినిమాతో కొంత డబ్బును వాపస్ ఇచ్చాడు విజయ్… ఆ పంచాయితీ ఇంకా అలాగే ఉంది… దర్శకుడికీ బయ్యర్లకూ నడుమ లైగర్ స్థాయిలో ఫైటింగ్… విజయ్ బయటపడ్డాడు… ఈలోపు రష్మికకు కొత్త సినిమాలతో డబ్బు వస్తోంది… ఇంకేముంది..? విజయ్‌తో కలిసి మాల్దీవులు గట్రా టూర్లు చేస్తూ ఆ ప్రేమలోనే గింగరాలు తిరుగుతోంది…

నిజానికి మంచి జంట… ఆమె ఎలాగూ సింగిల్… సొత్తులన్నీ ధారబోస్తోంది… విజయ్ కూడా ఒంటరి పక్షే కదా… పెళ్లి దాకా వెళ్తే మంచిదే… కానీ సమంత అనే పురుగు మళ్లీ మెసులుతోంది విజయ్ బుర్రలో… ఎందుకంటే..? ఆమె ఇప్పుడు సింగిల్ కదా… చైతూతో పెళ్లి పెటాకులైంది కదా… సమంత నటించిన యశోద సినిమా టీజరో ట్రెయిలరో ఆవిష్కరించినప్పుడు తన ప్రేమను బహిరంగంగానే వ్యక్తం చేశాడు విజయ్… ఇప్పుడు అన్నివిధాలుగా ఆమెను ఆరాధిస్తున్నాడు అట… మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉన్నట్టుంది…

rashmika

సమంత, తను కలిసి కొత్తగా ఏదో సినిమా చేయబోతున్నారు కూడా… మరి ఇప్పుడు రష్మిక ఏం చేయాలి..? ఉన్న డబ్బంతా ఖర్చుపెట్టిన తను చార్మిలాగే లబోదిబో శోకాలు పెట్టాలా..? నన్ను అన్యాయం చేయకురా విజయ్ అని రోదించాలా..? మధ్యలో ఈ సమంత వచ్చి యవ్వారం అంతా చెడగొట్టేట్టుగా ఉందని ఆందోళనకు గురికావాలా..? అన్నట్టు విజయ్ సార్, తమరు కాలేజీ చదివేటప్పుడు ఒక్క సమంతేనా..? ఇంకెవరినైనా బాగా ప్రేమించి, ఆరాధించేవాళ్లా..? వాళ్లిప్పుడు సింగిల్‌గానే ఉన్నారా..? కాస్త చెబితే రష్మికకు కూడా క్లారిటీ వస్తుంది… ఫాఫం, ఆల్‌రెడీ ఓసారి లైఫులో దెబ్బతిని ఉంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…
  • సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!
  • ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…
  • సారీ-గమలు… మళ్లీ అదే పోకడ… అసలు తప్పేమిటో తెలియడాయె…!!
  • కాకులూ పగబడతాయ్… గుంపుకట్టి దాడిచేస్తయ్… ప్రతీకారం తీర్చుకుంటయ్…
  • ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!
  • విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions