కాంతార సినిమాకు బలమే వరాహరూపం పాట… అసలు ఆ పాట లేకపోతే సినిమాయే లేదు… కానీ ఓ ప్రైవేటు మలయాళ మ్యూజిక్ కంపెనీ కేసు వేసింది… తమ ప్రైవేటు వీడియో నవరసం పాటకు వరాహరూపం కాపీ అని..! సినిమాలో ఆ పాట తీసేయాలనీ, అన్ని ప్లాట్‌ఫామ్స్ మీద ఆ పాట నిలిపివేయాలనీ తీర్పు పొందింది… నిజానికి ఆ రెండు పాటల నడుమ పెద్ద పోలికలు లేవు… పాటల కంటెంటు వేరు, వాటిల్లో చూపించిన కళారూపాలు వేరు…
సరే, దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాతలు హొంబెళి ఫిలిమ్స్ బహుశా హైకోర్టును ఆశ్రయిస్తారేమో దిగువ కోర్టు తీర్పు మీద స్టే కోసం..? అదంతా స్పాట్ న్యూస్… ప్రస్తుతానికి కాంతార టీంకు పెద్ద ఎదురుదెబ్బే… అయితే రిషబ్ శెట్టి వీలైనంతవరకూ ఇలాంటి వివాదాలు వస్తే, సంబంధిత కక్షిదారులతో కాంప్రమైజ్ అయిపోయి, సినిమా ప్రదర్శనకు ఇబ్బందులు క్రియేట్ కానివ్వడని ఓ సమాచారం… ఎందుకంటే… గతంలోనూ ఓ ఇలాంటిదే ఓ కేసు ఉంది…
కాంతార అనుకోకుండా భారీ వసూళ్లతో పెద్ద సినిమా అయిపోయింది… కానీ నిజానికి టెక్నికల్‌గా, పెట్టుబడిపరంగా చూస్తే చిన్న సినిమాయే… లీగల్ ఇష్యూస్‌తో సినిమా ప్రదర్శన ఆగిపోతే.., మీదపడే పెట్టుబడులు, వడ్డీలను దృష్టిలో పెట్టుకుని రిషబ్ శెట్టి, తన ఆస్థాన సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తదితరులు వీలైనంతవరకూ ఎంతోకొంతకు సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తారు… గతంలో ఓ ఉదాహరణ ఉంది… అది కిరాక్ పార్టీ సినిమా…
Ads
ఆరేళ్ల క్రితం తీసిన ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి కేవలం 4 కోట్లలోపే… ఇది రిషబ్ శెట్టి సొంత సినిమా… పరమవాహ్ స్టూడియోస్… ఇందులో రక్షిత్ శెట్టి హీరో కాగా, తన బ్రేకప్ వుమన్ రష్మిక మంథన హీరోయిన్… సినిమా సూపర్ హిట్ అయింది… అందులోనూ హేయ్, హూ ఆర్ యూ అనే పాట సినిమాకు ప్రాణం… దీనిపై లహరి మ్యూజిక్ అనే ఓ ప్రైవేటు కంపెనీ కేసు పెట్టింది… ఏమనీ అంటే..? ‘‘1991లో శాంతి క్రాంతి అనే సినిమా వచ్చింది… అందులో మధ్యరాత్రిలి అనే పాటను కాపీ కొట్టి ఇప్పుడు కిరాక్ పార్టీలో పెట్టారు..’’
అప్పటికే సినిమా సూపర్ హిట్… దాదాపు 50 కోట్ల దాకా వసూలు చేసింది… కానీ ఆ పాటే సినిమాకు బలం… సో, ఒకవైపు లీగల్‌గా కొట్లాడుతూనే మధ్యేమార్గంగా ఏవో రాజీ ప్రయత్నాలు చేసి, గత సంవత్సరం ఎట్టకేలకు ఆ పంచాయితీకి తెరవేశారు… సినిమా కథ మధ్యలో వచ్చిపోయే అప్రధాన పాట అయితే కట్ చేసి, మిగతాది ప్రదర్శించుకునేందుకు చాన్స్ ఉంటుంది… కానీ కిరాక్ పార్టీ పాట గానీ, కాంతార పాట గానీ సినిమాలకు ఆక్సిజెన్… అందుకని ఈ తిప్పలన్నమాట…
సో, మేధోచౌర్యం వివాదాలు రిషబ్ శెట్టి టీంకు కొత్తేమీ కాదు… ఇప్పుడు కూడా కన్సర్న్‌డ్ నవరసం పాట ఓనర్లతో రాజీపడకతప్పదేమో… కానీ ఎటొచ్చీ అసలు ప్రశ్న… ఎంతకు అనేది..! వివాదం తెగకపోతే ఇక కేసు హైకోర్టుకు చేరుతుందేమో… సినిమా ప్రదర్శన సాఫీగా జరగాలంటే తప్పదు కదా మరి…!!
Share this Article