సుడిగాలి సుధీర్ ఈటీవీ తప్ప వేరే టీవీ ప్రోగ్రాములకు వెళ్లడు… ఈటీవీకి కమిటెడ్ కేరక్టర్, నో డబుల్ గేమ్స్, తన శక్తికి మించిన ఎఫర్ట్ పెడుతూ ఉంటాడు ఈటీవీ షోల కోసం… ఐనాసరే, ఈమధ్య కావాలని తనకు కత్తెర పెడుతున్నారు, అది వేరే కథ… అయితే తనను ఓ ప్లేబాయ్‌గా చిత్రించడం మరీ శృతిమించినట్టు అనిపిస్తోంది… ఒక పరిధిలో తనను కాటరాజు, రేయింబవళ్లూ అమ్మాయిలే తన ధ్యాస అన్నట్టుగా అని కాస్త సరదాగా ఆటపట్టిస్తే, ఏడిపిస్తే, తనూ అమాయకంగా మొహం పెడుతూనే కౌంటర్లు వేస్తుంటే బాగుండేది… కానీ అది పెరిగీ పెరిగీ ఇప్పుడు వెగటు పుడుతోంది… ఢీ, జబర్దస్త్, పోవేపోరా మాత్రమే కాదు, తను ఏ షోలోకి వచ్చినా సరే, అవే సెటైర్లు తనపై… కామెడీ స్కిట్లకు స్క్రిప్టులు కూడా అలాగే రాసేస్తున్నారు… అయితే..?
గతంలో ఈ ప్లేబాయ్ వ్యాఖ్యలు, చెణుకుల్లో కాస్త సున్నితమైన హాస్యం ఉండి బాగానే ఉండేది… కానీ ఈటీవీ, మల్లెమాల టీమ్స్‌కు అది నచ్చదు కదా… మోటు, బూతు వాళ్ల టేస్టు… సుధీర్ ప్లేబాయ్ ముద్ర విషయంలోనూ డోస్ పెంచుతూ పోయారు… మొదట్లో తనూ ఇతరులపై కౌంటర్లు వేసేవాడు… ఇప్పుడదంతా ఏమీలేదు… శేఖర్ మాస్టర్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రదీప్, రష్మి, హైపర్ ఆది దాకా… అందరికీ అదే అలుసు… చివరకు ఇప్పుడు తన టీం మెంబర్స్ గెటప్ సీను, ఆటో రాంప్రసాద్, జబర్దస్త్ జడ్జి రోజా కూడా స్టార్ట్ చేశారు… మధ్యలో ఓసారి జడ్జిగా వచ్చిన బాబా భాస్కర్, వెళ్లిపోయిన వర్షిణి… అయితే ఇదంతా నవ్వు పుట్టించడం లేదు సరికదా, చిరాకెత్తిస్తోంది ప్రేక్షకులకు కూడా… అందరూ తనపై పంచులు వేస్తూ ఆడుకునేవాళ్లే…
Ads
ఇక సుధీర్ ఫ్యాన్స్‌కు (తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ) కోపం కూడా వస్తోంది… నెట్లో దీనిపై బోలెడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు… సుధీర్‌ను హౌలాగాడిని చేస్తున్న తీరు తమను బాధిస్తోందనే ఆక్రోశం కనిపిస్తోంది… తాజాగా మరో షోలో కూడా ఇంతే… రాబోయే ఢీ షో ప్రోమో ప్రకారం… ఎర్రటి డ్రెస్సు వేసుకొచ్చిన సుధీర్ మీద హైపర్ ఆది పంచులు వేస్తున్నాడు… బహుశా తను ఎక్స్టెంపర్గా వదిలినవి కాకపోవచ్చు, స్క్రిప్టెడే కావచ్చు… ‘‘రాత్రయితే చాలు, ఎక్కడో తిని వచ్చేవాడు, మాకు అర్థం అయ్యేది కాదు’’ అంటూ ద్వంద్వార్థాలు వచ్చే ఓ వెకిలి చెణుకు… తరువాత తన డ్రెస్సును ఉద్దేశించి… సుధీర్ అంటే ఎరుపు, ఓ అరుపు, ఓ మెరుపు… ఓ పరుపు… అని మరో డైలాగు… పరమ చీపుగా ఉంది… హైపర్ ఆది పంచులపై సైట్లలో విమర్శలు ఓ రేంజ్లో కనిపిస్తున్నయ్… ఫ్యాన్స్ సరేసరి… నిజానికి హైపర్ ఆది ఒకప్పటి సొంత పంచులు ఎంత బాగా పేలేవి..? ఇప్పుడు మరీ నేలబారు రేంజికి దిగిపోయాడు… తన జబర్దస్త్ స్కిట్లూ పేలవంగా ఉంటున్నయ్… జాంబిరెడ్డి సినిమా ప్రమోషన్ కోసం తీసిన ఓ కమర్షియల్ జబర్దస్త్ స్కిట్లో కూడా ‘‘నేను ఎవరు కనిపించినా కొరికేస్తుంటాను, అయితే నేను జాంబీనా..?’’ వంటి డైలాగులు పలికించారు… ఫాఫం సుధీర్… ఈటీవీ వాళ్ల క్రియేటివిటీయేమో ట్రిపుల్ ఎక్స్ రేంజిని మించి ఎదగడం లేదు… సుధీర్ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు…!!
Share this Article