.
Suresh Dharur ….. కళ్ళకు కట్టిన గంతలు ఒక్కసారిగా విప్పగానే కళ్ళు బైర్లు కమ్మినట్లయింది. ఏదో మణిరత్నం సినిమాలో సీన్ లా సన్నటి పొర, దూరంగా ఎల్లో లైట్. చెల్లాచెదురుగా పడి ఉన్న ప్యాకింగ్ బాక్సులు, తుప్పు పట్టిన మెషీన్ల వాసన. ఇదేదో తెలుగు సినిమాల్లో క్లైమ్యాక్స్ ఫైటింగ్లు తీసే గోడౌన్ లా ఉంది.
“అయితే ఖాళీ ఆయిల్ డ్రమ్ములేవి?” అని అనుకుంటుండగానే నిశ్శబ్దాన్ని చేధిస్తూ ఓ baritone voice వినిపించింది. తల అటూ ఇటూ ఊపుతూ దగ్గరకు వచ్చాడు త్యాగరాజు.
ఓ menacing expression ఇస్తూ, “ఇప్పుడు చెప్పు ఎక్కడ దాచావు? కమాన్ క్విక్” అన్నాడు.
Ads
“నేను అనుకున్నంత effective గా లేదు మీ expression. మేము చూసిన సినిమాల్లో మీరు చాలా intimidating గా ఉంటారు కదా. Retake చేస్తారా?,” అన్నాడు కంచెర్ల విరించి. తను బందీ గా ఉన్నాననే విషయం మరచిపోయి జోకులేస్తూ మాట్లాడుతుండడంతో కిడ్నాపర్లు ఇరకాటంలో పడ్డారు.
“ఏం తమాషాగా ఉందా? మర్యాదగా చెప్పు ఎక్కద దాచి పెట్టావు? నీతో ఎలా కక్కించాలో మాకు తెలుసు,” అన్నాడు త్యాగరాజు. ఇంకా కొన్ని retake లు అవసరమయ్యేట్టుంది అతనికి.
ఈ లోపు త్యాగరాజు పక్కనే body-hugging red t-shirt వేసుకున్న ఓ side-kick అప్పటివరకు తన bulging biceps ను నిమురుతూ నిల్చున్నవాడల్లా ఒక్కసారిగా ముందుకు వచ్చి, ‘ఏంట్రా నీల్గుతున్నవ్? నువ్వు కవి అనే విషయం మాకు తెలుసు. షాయిరీలు రాస్తావని తెలుసు. ఈ ఉగాది కి కూడా ఏదో రాసే ఉంటావు. ఆ కాగితాలు ఎక్కడ పెట్టావో చెప్పు. లేకపోతే ఏమవుతుందో గటు వైపు చూడు,” అని గదిరించాడు.
వీడు మాత్రం తెచ్చి పెట్టుకున్న తెలంగాణ యాస లో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు కవి (కంచెర్ల విరించి) కి.
Bulging Biceps గాడి చూపుడు వేలుని ఫాలో అయ్యాడు కవి. ఎదురుగా ఓ యాభై అడుగుల దూరంలో అంజలి దేవి దీనంగా చూస్తోంది. ఆమె రెండు చేతుల్ని తాళ్ళతో కట్టేసారు.
“ఇప్పుడేమంటావ్? ఇప్పుడేమంటావ్? ఇప్పుడేమంటావ్?,” అన్నాడు త్యాగరాజు.
“ఎందుకలా తెలుగు టీవీ సీరియల్స్ పాత్రల్లా అన్నదే మూడు సార్లు అంటారు?,” విసుక్కున్నాడు కవి.
ఇదంతా దూరం నుంచి చూస్తున్న అంజలి దేవి ఒక్కసారిగా గొంతు పెంచి, “బాబూ, ఆ దుర్మార్గుల బెదిరింపులకు లొంగొద్దు. కవితలు నీ కష్టార్జితం. ఎక్కడ దాచావో వాళ్ళకు చెప్పొద్దు. మీ నాన్నగారు నీకు మిగిల్చిన ఆస్తి ఈ కవిత్వమే. అది వదులుకోవద్దు,” అన్నది.
ఈలోపు Bulging Biceps దృష్టి కవి మెడలో వేలాడుతున్న భారీ సైజు లాకెట్ పై పడింది. అప్పుడే gravitation ని discover చేసిన Isaac Newton లా అతని మొహం వెలిగిపోయింది. ఇక boss దగ్గర మార్కులు కొట్టేయొచ్చనుకున్నాడు. “Boss, వీడి లాకెట్ Tamil Tigers మెడలో cyanide pill లా వుంది. ఆందులో ఏదో ఉంది,” అన్నాడు.
******** ********
హైదరాబాద్ లోని టీవి ఆఫీస్. ఎడిటోరియల్ ఫ్లోర్.
తన మానాన తాను మొబైల్ ఫోన్లో Instagram Reels ని aimless గా scroll down చేస్తూ existential angst కు గురవుతున్న Output Editor చికాగ్గా తల పైకెత్తాడు. ఎదురుగా అప్పుడే కరెంట్ షాక్ తగిలి బయటపడ్డ వాడిలా కనిపించాడు crime reporter.
Breaking News అని రాసి ఉన్న స్లిప్ ను టేబుల్ మీద పెట్టాడు. “ఏంటది?,” అని చికాగ్గా చూసాడు ఎడిటర్. Insta Reels లో ఎంత మిస్ అయ్యానో అన్నబెంగ అతనిలో ఉంది.
“సరే, డ్యూటీ లో ఎవరున్నారు?” అనడిగాడు అసహనంగా.
“శ్రీదేవి దుబాయి లో చనిపోయినప్పుడు bathtub setting వేసి news present చేసాడు కదా, సార్. అతనే ఉన్నాడు సార్,” చెప్పాడు రిపోర్టర్.
“సరే లైవ్ వెళ్తున్నాం ఇప్పుడు… చెప్పండి production లో” అంటూ మళ్ళీ మొబైల్ కి అంకితమయ్యాడు.
************
రవీంద్ర భారతిలో జరిగే అధికార కార్యక్రమానికి హాజరు కావల్సిన ప్రముఖ కవి కంచెర్ల విరించి కనిపించకుండా పోవడం తీవ్ర కలకలానికి దారి తీసింది. అప్పటివరకు రుద్రాక్ష మాలల విషిష్టత గురించి, గ్రహబలాలు, numerology ల మీద ప్రజల్ని చైతన్య పరచి మెరుగయిన సమాజం కోసం పాటు పడుతున్న channels ఒక్కసారిగా ఉలిక్కిపడి “కవి అదృశ్యం” పై విలక్షణమైన graphics సమకూర్చడంలో నిమగ్నమయ్యాయి.
ఇంతలో కవిని కిడ్నాప్ చేసింది తామేనని ఒప్పుకుంటూ Poets Eradication Gang (PEG) అనే పేరుతో విడుదలైన పత్రికా ప్రకటన సంచలనం రేపింది. కవుల్లేని సమ సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని, కవుల్ని కిడ్నాప్ చేసి వారి రాతల్ని ద్వంసం చేస్తామని, ఎవ్వరినీ వదిలి పెట్టేది లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. కవిత్వం ప్రజారోగ్యానికి హానికరమని కూడా ప్రకటన తెలిపింది.
ఇంకొద్ది క్షణాల్లో భూమి బద్దలై మానవాళి అంతరించిపోతుందేమొన్నంత ఆందోళన ఆ anchor గొంతులో ధ్వనించింది. Split-screen లో ఒక వైపు కిటికి చువ్వల వెనుక కవి బందీ అయి ఉన్నట్లు ఓ graphic. ‘కవులకు కళ్ళెమా?” అనే ఓ screaming headline తో స్టోరీ నడుస్తోంది.
Panel discussions, కవులతో ఇంటర్వ్యూలు, మధ్య మధ్య లో ‘సమాజం ఎటు వైపు వెళ్తోంది?” అని anchor ఆవేశపూరిత ప్రశ్నలు కొనసాగుతుండగా మరో breaking news.
ఈసారి తమ squad action team నిర్వహించిన field operation ను వివరిస్తూ PEG తన పత్రికా ప్రకటనను ఓ జాతీయ వార్తా సంస్థకు విడుదల చేసింది. Agency copy ని యధాతధంగా scrolling లో పెట్టారు:
A fringe outfit calling itself Poets Eradication Gang (PEG) has claimed in a statement that the commandos of its squad action team called the Poetry Prevention Force (PPF) have raided the residence of a prominent poet in Hyderabad and recovered “incriminating draft poetry compilations” ahead of the Telugu New Year ‘Ugadi’.
The name of the poet has not been disclosed. However, the anti-poet outfit has made public the excerpts of the yet-to-be-published work, apparently as a warning to the aspiring poets. Here are the leaked passages:
“వస్తోంది వస్తోంది వగలాడి నూతన వత్సరం
వయ్యరాలు మూట కట్టుకొని, హొయలు నింపుకొని
నిలదీస్తాను నేను ఈ వత్సరాన్ని
ఏమి తెచ్చావు నువ్వు నిరుపేదలకు అని
మార్పంటే కాదు క్యాలెండర్ లో తేదీలు తిరగేయడం
మార్పంటే కాలే కడుపులకు ఊరటనివ్వడం
అందుకే నేనంటాను..అందుకే నేనంటాను..
పేదల ముంగిట్లో వెలుగు నింపినప్పుడే నవోదయం
బడుగు బతుకులు పండినప్పుడే శుభోదయం”
*********** **************** ************* *********
“కిటికి చువ్వల వెనుక కవి” “కలానికి సంకెళ్ళు” లాంటి గ్రాఫిక్స్ తో, కొంత old footage ని రోజంతా రిపీట్ చేస్తూ ఈ రోజు గడిపేస్తే చాలు అనుకుంటున్న సమయంలో editor కి మరో షాక్ తగిలినట్లయింది. హడావిడిగా తన cubicle లోకి వచ్చి, “సార్, కవి కథ సుఖాంతమయింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నాడంట” అన్నాడు రిపోర్టర్.
“ఇంకేం, హెడ్లయిన్ దొరికింది. కవి కథ సుఖాంతం. ఎలా జరిగిందంట?”
********** ************* ************ ************
గంట క్రితం…..
కవి మెడలోని లాకెట్ వైపు తదేకంగా చూశాడు త్యాగరాజు. “ఏమిటి వీడి మొండితనం? కొంచెం కూడా భయం లేకుండా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు?” అనుకున్నాడు.
కిడ్నాపర్లిద్దరూ కలిసి కవి మెడలోంచి లాకెట్ ను బయటకు లాగారు. Bulging Biceps గాడి అనుమానం నిజమైంది.
క్లిప్ తీయగానే లోపల జాగ్రత్తగా మడతపెట్టిన ఓ A4 సైజు కాగితం కనిపించింది.
విప్పి చూస్తే…. Cyanide pills లాంటి కవితా పంక్తులు.. అవి చదవడం మొదలుపెట్టడం వరకే వారికి గుర్తుంది…. (సరదా పోస్టు… కవులెవరూ మనోభావాలు దెబ్బతీసుకుని, కవిత్వరచనను మానేయాల్సిన పనిలేదు…)
Share this Article