Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెరపకురా పాకీ… నువ్వే చెడేవు! అటు బెలూచ్- ఇటు పీఓకే..!!

July 30, 2026 by M S R

.

Srini Journalist …. చెరపకురా చెడేవు” అనే సామెత ఈరోజున మన పొరుగుదేశమైన పాకిస్తాన్‌కు సరిగ్గా అతుకుతుంది,
ఎందుకంటే భారత్‌లో Gen Z యువత స్టార్ట్ చేసిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలపై పాక్ మీడియా…
అక్కడి సోషల్ మీడియా హ్యాండిల్స్ మన దేశంలో ఏదో అంతర్యుద్ధం జరుగుతోందంటూ ఇండియాను బద్నాం చేయడానికి విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశాయి…

కానీ ఇక్కడ ఢిల్లీ పోలీసులు కేవలం లాఠీచార్జ్, బాష్పవాయువు మాత్రమే వాడి ఒక్క లైవ్ బుల్లెట్ కూడా కాల్చకుండా, ఎవరి ప్రాణాలు పోకుండా నిరసనలను కంట్రోల్ చేయడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించి స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేశారు.

Ads

అయితే సరిగ్గా ఇదే టైమ్‌లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ (PoK) లో ఎలక్షన్స్ టైమ్‌లో స్థానిక ప్రజలు తమ హక్కుల కోసం నిరసనలు చేస్తుంటే పాక్ మిలిటరీ రేంజర్స్ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేయడంతో తాజా కాల్పుల్లోనే దాదాపు 20 మంది, గత మూడు నాలుగు నెలల్లో దాదాపు 80 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం… ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ కూడా బంద్ చేశారు.

పాకిస్తాన్ తమ లాభం కోసం ప్రమోట్ చేసిన CJP ఉద్యమమే ఇప్పుడు ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారింది, ఎందుకంటే భారత్‌లో యువత అంత పెద్ద ఎత్తున నిరసనలు చేసినా ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ముగిసాయో చూశారు..,

తమ దేశంలో మాత్రం చిన్న హక్కుల కోసమే ఆర్మీ క్రూరంగా కాల్పులు జరుపుతోందని పాక్ యువత తీవ్రంగా చర్చిస్తున్నారు, ఇలా పాకిస్తాన్ గవర్నమెంట్ అనవసరంగా CJP ని విపరీతంగా హైలైట్ చేయడంతో ఇప్పుడు అక్కడి జెన్-జీ (Gen Z) యువతలో భారతదేశం పట్ల విపరీతమైన పాజిటివ్ ఇంప్రెషన్ పెరిగిపోయింది,

ఇండియా డెమోక్రసీని చూసి పాక్ యువకులు ఫిదా అవుతూ తమ సొంత వ్యవస్థపై, భారత్‌ను బద్నాం చేయాలనుకుని ఘోరంగా బోర్లా పడ్డ తమ ప్రభుత్వ కుట్రలపై తీవ్ర అసహ్యం పెంచుకుంటున్నారు… అటు బెలూచ్ విముక్తిపోరాటం తీవ్రతరం అయిపోయింది, ఇటు పీఓకే ఉడుకుతోంది… పాకిస్థాన్ కథ ఎటెటో వెళ్లిపోబోతోంది!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?
  • AMR … ఈడీ భారీ దాడులపై తెలుగు మీడియా సైలెన్స్ దేనికి..?
  • కొన్ని పుస్తకాలు బయటికి రావు ! ఏ పార్టీ ప్రభుత్వమూ మినహాయింపు కాదు !!
  • AIలో ఫోటో అప్‌లోడ్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు పోతాయా? నిజమేంటి?
  • ‘‘ఆ రీసెర్చ్ కోసం- బ్లడ్ క్యాన్సర్ సోకిన నీ కూతుర్ని ఇస్తావా?”
  • 40 స్క్రీన్లకు పడిపోయిన సినిమా… 2,500 స్క్రీన్లకు ఎలా వెళ్లింది?
  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions