.
ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు … తెలంగాణ డిజిపి జితేందర్ మెట్రో MD ఎన్ వి ఎస్ రెడ్డి, సీఎస్ శాంత కుమారి, దాన కిషోర్, వికాస్ రాజ్ లపై ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశాడు అన్వేష్..
హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ల ప్రచారం పేరుతో 300 కోట్లు కొట్టేసారంటూ వీడియో విడుదల చేసిన అన్వేష్..
Ads
ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్ పై కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు..
డిజిపి జితేందర్ తో పాటు మరో ఏడుగురు అధికారులతో కలిసి 300 కోట్లు దోచేసారని డీజీపీ పైన అన్వేష్ ఆరోపణలు చేశాడు. 300 కోట్లు లంచం తీసుకొని మూడు బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించారని బిజెపితో పాటు సీనియర్ అధికారుల పేర్లు వెల్లడించిన అన్వేష్…
బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లు జనాలు అన్వేష్ కి మద్దతు ఇచ్చారు .. జనాన్ని బాగా బూతులు తిడితే తన యూట్యూబ్ ఛానెల్ కి బాగా వ్యూస్ వస్తున్నాయని కారణంతో ఇష్టమొచ్చినట్టు అందర్నీ తిట్టడం మొదలు పెట్టాడు ..
ఏకంగా అమ్మలతో వ్యభిచారం చేయించండి అనే స్థాయికి దిగజారిపోయాడు.. అమ్మలు , అక్కల మీద ఇష్టమొచ్చినట్టు కారు కూతలు కూసినప్పటికీ జనం అతన్ని ఏవగించుకోలేదు, కారణం అతను బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిని తిడుతున్నాడు కాబట్టి ..
ఇప్పుడు ఏకంగా .. ఒక రాష్ట్ర డీజీపీ , సీనియర్ ఐఏఎస్ ల పైనే తన బూతు పురాణం విప్పాడు.. ఇప్పుడు కేసుల్లో చిక్కుకున్నాడు .. అతని మీద నమోదైన సెక్షన్లు నాన్ బెయిలబుల్ .. ఈ కేసుని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కచ్చితంగా సీరియస్ గా తీసుకుంటుంది..
ఈ దెబ్బకి బహుశా .. క్షమించండి నా ఉద్దేశం అది కాదు అని మళ్లీ ఓ వీడియో రిలీజ్ చేస్తాడు .. ఏదైనా ఒక లిమిట్ లో ఉండాలి .. లిమిట్ దాటి వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది.. ఇప్పుడు కూడా ఆయన్ని సమర్ధించే వాళ్ళు ఉండొచ్చు … అశోక్ వేములపల్లి … (వీడియో ఉంది, దానికి బహుళ ప్రచారం అనవసరం అని ఇక్కడ పోస్ట్ చేయడం లేదు)…
ఇన్నాళ్లూ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా అన్వేష్‌ను ఎంకరేజ్ చేసిన సజ్జనార్ కూడా బాగా ఇరుకునపడ్డట్టే… అవునూ, ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారంటూ కొందరు సెలబ్రిటీలపై కేసులు పెట్టారు కదా… నోటీసులు కూడా ఇచ్చారు కదా… అవన్నీ ఎక్కడిదాకా వచ్చాయో… పెద్ద పెద్ద హీరోల పేర్లు కూడా బయటికి వచ్చాయి కదా… అంతా తూచ్ అన్నమాటేనా…
Share this Article