సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ ఫెమినిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ ఎట్సెట్రా చిన్మయి మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు… నోనో, ఆమె సీనియర్ నటి మీద ఏవేవో కించపరిచే కూతలు కూసినందుకు కాదు… దేశాన్ని తిట్టినందుకు..! అన్నపూర్ణ ఏదో రియాక్ట్ అవుతుందని అనుకున్నారు అందరూ, కానీ ఆమె లైట్ తీసుకుంది, కేసు మరో కోణం నుంచి వచ్చింది… అదీ తన కూతల్లో దేశాన్ని తిట్టిందని..!
ఎక్స్‌పోజింగు మీద అన్నపూర్ణ చేసిన వ్యాఖ్యల మీద చిన్మయి ఓవర్ రియాక్షన్ స్టోరీ ఇది
సరే, దేశాన్ని తిడితే మన దేశంలో పెద్దగా శిక్షలు ఏమీ పడవు గానీ ఈరోజుకు ఇది వార్త… తమిళనాడులో పలు వివక్షలకు వ్యతిరేకంగా గొంతెత్తే చిన్మయి పెద్దగా ఇలాంటి కేసులకు భయపడే కేరక్టర్ ఏమీ కాదు… కానీ అన్నపూర్ణను తిట్టబోయి దేశాన్ని తిట్టడం మాత్రం కరెక్టు కాదు…
Ads
అన్నపూర్ణ వ్యాఖ్యల పట్ల మొహమంతా అష్టవంకర్లు తిప్పుతూ, ఏదేదో మాట్లాడుతూ, నాకు బాగా తెలివి ఉంది చూశారా అన్నట్టుగా… అన్నపూర్ణను కించపరిచే మాటలు మాట్లాడటం తప్పు… సూటిగా పాయింట్ మీద మాట్లాడితే పర్లేదు… పైగా ఎక్స్‌పోజింగు వద్దని హితవు చెప్పిన ఓ వృద్ధ నటి మీద ఈ ప్రతాపం దేనికి..? పాపం, ఆమె ఎలాగూ ఈమె మీద సీరియస్‌గా స్పందించదు అనే ధీమాయా..? లేక కావాలనే ఓ వివాదాన్ని గెలుక్కోవడమా..?
ఓ మిత్రుడు ఓ పోస్టు కామెంట్స్‌లో రాశాడు… ‘‘ఇలాంటి కేరక్టర్లు ఏ అఫ్ఘనిస్థాన్‌లోనో పుట్టి ఉంటే ఈ దేశం విలువ, ఈ గడ్డపై పుట్టినందుకు అనుభవిస్తున్న స్వేచ్ఛ అర్థమయ్యేవి. స్టుపిడ్ కంట్రీ అనే పదం ఏమిటి నాన్సెన్స్, తీసుకుపోయి ఏ సిరియాలోనో పడేస్తే తెలుస్తది అమ్మడికి. ఈ దేశంలో పుట్టడం ఖర్మ, దుష్కర్మ లాంటి పదాలు ఆమె నెగెటివ్ ధోరణికి అద్దం. ఆమె మీద కేసు పెట్టిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి కుమార్ సాగర్ చర్య కరెక్టు’’….
అన్నట్టు రెండు ప్రశ్నలు… పోలీసులు ఆమెపై ఏ సెక్షన్లు పెట్టారు..? ఇంతకీ సదరు హెచ్‌సీయూ విద్యార్థి నటి అన్నపూర్ణకు ఏమైనా చుట్టమా..? అవునూ, ఈ పోలీస్ కేసు మీద కూడా చిన్మయి ఏమైనా పిచ్చి కూతలు కూసిందా..? తెలియదు..!!
Share this Article