Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిరుద్యోగులు పొలిటికల్ పార్టీల ట్రాపుల్లో చిక్కితే- వాళ్లకే నష్టం!!

July 5, 2026 by M S R

.

అంతిమంగా ఎవరు బలి అవుతారనేది బీఆర్ఎస్‌కు అక్కర్లేదు… ఈరోజుకు ప్రభుత్వాన్ని తిట్టామా, ఏదో ఒక అంశంపై గాయిగత్తర లేపామా లేదానేది మాత్రం దాని సూత్రం… ఒకరకంగా బాధ్యతారాహిత్యం… పోలీసు ఉద్యోగాల భర్తీపైనా ఆ పార్టీ చేస్తున్నది అదే…

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో 5 వేల పోస్టులను భర్తీ చేయడానికి పూనుకుంది… మొత్తం 7214 పోస్టుల్ని నింపుతారు ఇప్పుడు, ఈ 5 వేలకు నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది… నో, నో, అవి చాలవు, మొత్తం 20 వేల పోస్టులు భర్తి చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు.., డీజీపీ ఆఫీసు ముట్టడి, దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన, బీఆర్ఎస్ స్పందన, ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ, మీడియా- సోషల్ మీడియాలో ఆవేశపూరిత నినాదాలు గట్రా కనిపిస్తున్నాయి…

Ads

రెండుమూడేళ్లుగా ఎదురుచూస్తున్నాం, 19 వేల 20 వేల పోస్టుల్ని భర్తీ చేయబోతున్నాం అని ప్రభుత్వ ముఖ్యులే చెప్పారు, మరిప్పుడు 5 వేలే నింపడం మమ్మల్ని మోసం చేయడమే అనేది కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నవారి వాదన… నిరుద్యోగుల ఆశల్లో తప్పులేదు, సర్కారీ కొలువు కోసం వాళ్ల ఆరాటం, ఎదరుచూపు… కానీ..?

ఇక్కడ ఖచ్చితంగా యువత గమనించాల్సిన నిజం ఒకటుంది… ఎన్ని పోస్టుల్ని ఎలా నింపాలనేది పూర్తిగా ప్రభుత్వ విచక్షణ… దశలవారీ భర్తీ చేద్దామనేది ప్రభుత్వ విధాన నిర్ణయం… ఒకేసారి వేల పోస్టుల్ని నింపలేకపోవడానికి సాంకేతిక, పరిపాలనపరమైన అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయి… పైగా అంత భారీ సంఖ్యలో సరైన ట్రెయినింగ్ కూడా సాధ్యం కాదు… ఈసారి ‘మరింత నాణ్యమైన శిక్షణ’ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది…

మరో అంశం కూడా… కేసీయార్ పదేళ్లు పాలించి పే-ద్ద చిప్ప చేతికి ఇచ్చి పోయాడు… వట్టిపోయిన ఖజానా పరిస్థితిని కూడా ప్రభుత్వం చూసుకోవాలి… వస్తున్న ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, కేసీయార్ నెత్తి మీద పెట్టిపోయిన 8 లక్షల కోట్ల అప్పు, వడ్డీలు తీర్చడానికే సరిపోతోంది… అన్నీ సమస్యలే…

పోస్టులు

మిగతా ఉద్యోగాలు వేరు, పోలీసు ఉద్యోగాల భర్తీ వేరు… నియమించబడ్డాక ట్రెయినింగ్ తప్పనిసరి… అన్నింటికీ మించి నిరుద్యోగులు రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడొద్దు… బీఆర్ఎస్ నేతలది ఏముంది? ఉసిగొల్పుతారు… వాళ్లు బాగానే ఉంటారు… కానీ..?

ప్రభుత్వంపైకి రెచ్చగొట్టే రాజకీయ వ్యూహాత్మక ఆందోళనలకు సంబంధించి, ఏమైనా తప్పులు దొర్లితే, వాళ్ల మీద కేసులు బుక్ అయితే, ఇక ఆ పోలీసు ఉద్యోగాలకు అర్హత కోల్పోతారు… అంతేకాదు, ఏ ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హత ఉండదు… ఒకసారి క్రిమినల్ రికార్డు నమోదైతే క్యారెక్టర్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థుల కలలన్నీ కల్లలైపోతాయి…

నిజానికి 20 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయా, ప్రస్తుత అవసరాలను బట్టి 50 వేల మంది పోలీసులు అవసరమా అనేది వేరే చర్చ… ప్రభుత్వం ఫేజింగ్ మ్యానర్‌లో ప్రస్తుతానికి 5 వేల పోస్టులే భర్తీ చేస్తానంటోంది… తరువాత దశ సంగతి తరువాత… ఈ పోస్టుల పోటీలో ఎలా విజయం సాధించి, అర్హత సాధించాలనేదే నిరుద్యోగులు ఆలోచించుకోవాలి ప్రస్తుతానికి… ఇది రియాలిటీ…

తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఏమంటాడంటే..? ‘‘రాష్ట్రంలో ఉన్న పోలీస్ ట్రెయినింగ్ కాలేజీల సామర్థ్యానికి మించి ఒకేసారి వేల సంఖ్యలో అభ్యర్థులు వస్తే, వారికి సరైన వసతులు, ప్రయోగాత్మక శిక్షణ అందించడం అసాధ్యం…

ఒకేసారి పెద్ద బ్యాచ్‌గా ఉద్యోగాలలో చేరిన తర్వాత, భవిష్యత్తులో వారికి ఇచ్చే పదోన్నతుల విషయంలో తీవ్రమైన సీనియారిటీ వివాదాలు, చిక్కులు ఎదురవుతాయి. అందరికీ ఒకేసారి పదోన్నతులు కల్పించడం శాఖాపరంగా సాధ్యం కాకపోవడంతో సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంటుంది..’’

సో, నిరుద్యోగ యువత ఈ పోస్టులకు పోటీపడాలి, విఫలమైనవాళ్లు తదుపరి దశల్లో రాబోయే నోటిఫికేషన్లకు నిరీక్షించడమే శరణ్యం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions