Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజకీయ విమర్శకు వ్యంగ్యం జోడించి కొడితే… అదే రోశయ్య దెబ్బ..!!

December 4, 2024 by M S R

.

కొణిజేటి రోశయ్య… తను క్రౌడ్ పుల్లర్ కాదు… వ్యక్తిగత చరిష్మాతో రాజకీయాల్లోకి నెగ్గుకొచ్చినవాడు కాదు… కొన్ని పద్ధతులు, విలువల్ని తనే నిర్దేశించుకుని… ప్రస్తుత రాజకీయ అవలక్షణాల్ని దగ్గరకు రానివ్వకుండా… తెలుగు రాష్ట్రాల పాలనపై తనదైన ముద్ర వేసిన వాడు…

ఒక ముఖ్యమంత్రిగా జస్ట్, ఓ టెంపరరీ, టైమ్ బీయింగ్ అడ్జస్ట్‌మెంట్ కావచ్చుగాక… కానీ ఓ ఆర్థికమంత్రిగా ఓ సుదీర్ఘ అనుభవం… ప్రావీణ్యం… ఇప్పుడంతా పంచుడు రాజకీయం కదా… అదే బటన్ డిస్ట్రిబ్యూషన్ కదా… కానీ రోశయ్య పదే పదే చెప్పేవాడు ఓ మాట… ‘ఏట్లో వేసినా ఎంచి వేయాలి’…

Ads

అంటే… దానికి లెక్క ఉండాలి, లెక్క ప్రకారం పంచాలి, దానికి ఓ సార్థకత ఉండాలి అని భావం… తెలుగు రాజకీయాల్లో తనకు ఓ ప్రశంసాపూర్వక గుర్తింపు ఉంది… అది వ్యంగ్యం కలిపిన రాజకీయ విమర్శ… వర్తమానంలో గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో గతంలో గానీ ఎవరికీ ఈ లక్షణం లేదు, అదంత సులభమూ కాదు… ఐనా ఇప్పుడంతా రండ, బోసిడికె, నాకొడకా, బట్టెబాజ్, బాడ్‌కావ్, తాటతీస్తా తరహా బూతుల భాషే కదా… సంస్కారం మత్తళ్లు దూకే భాష…

నిజానికి వ్యంగ్యం రంగరించి కొడతే ఆ రాజకీయ విమర్శలో ఉండే పదును వేరు, పంచ్ వేరు… తను మరణించినప్పుడు, అంత్యక్రియల్ని తనను ఓన్ చేసుకున్నట్టు నటించే వైశ్య సంఘాలు గానీ, ప్రభుత్వం గానీ ఏమీ పట్టించుకోకపోయినా సరే… ఇప్పుడు హఠాత్తుగా వైశ్య సంఘాలకు రోశయ్య గుర్తొచ్చాడు… సంతోషం… ప్రభుత్వమూ ప్రాధాన్యమిస్తున్నది… గుడ్…

rosaiah

విమర్శకు ప్రతి విమర్శ పదునుగా ఉంటే… తనను ఎదుర్కోలేక నాటి ముఖ్యమంత్రి ఏకంగా మండలినే రద్దు చేశాడని చెప్పుకుంటారు… ఒకటీ రెండు ఉదాహరణలు చెప్పుకుంటే చాలు…


ఓసారి అసెంబ్లీలో సీరియస్ చర్చ… ఎప్పట్లాగే టీడీపీ సభ్యులు రోశయ్య మీద దాడి స్టార్ట్ చేశారు… రోశయ్యకు తెలివితేటలు మరీ ఎక్కువయ్యాయంటూ వెటకారాలు మొదలెట్టారు…
.
దానికి ఆయన సమాధానం ఇస్తూ ఇలా అన్నాడు… ‘‘నాకు అన్ని తెలివితేటలే ఉంటే ఇలా ఎందుకు ఉండిపోతాను..? అంత తెలివే ఉంటే నన్ను నమ్మిన వైఎస్‌ను వెనుక నుంచి ఒక్క పోటు పొడిచి సీఎం కుర్చీ ఎక్కేవాడిని… అంతకుముందు చెన్నారెడ్డిని పొడిచేవాడిని… విజయభాస్కర్‌రెడ్డిని పొడిచేవాడిని…’’
.
టీడీపీ వైపు నుంచి ఒక్కరైనా కిక్కుమంటే ఒట్టు…


రోశయ్య 2004-09 కాలంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన అల్లుడు వైజాగ్ లో ఓ క్లబ్ లో పేకాడుతూ… క్యాబరే చూస్తూ పోలీసులకు దొరికిపోయాడట… దీని మీద అసెంబ్లీలో చంద్రబాబు & టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు రచ్చ రచ్చ చేశారు… ఆ తర్వాత మెల్లగా లేచిన రోశయ్య స్పీకర్ తో ఇలా అన్నారు…
‘ అధ్యక్షా, ఏం చేస్తాం… ఆ భగవంతుడు ఎన్టీ రామారావుకు నాకు మంచి అల్లుళ్లను ఇవ్వ లేదు.. అన్నారు… అంతే దెబ్బకు టీడీపీ సైలెంట్…


కుటుంబ నియంత్రణ గురించి జరిగే చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ గంపెడు పిల్లలున్న మీరేం మాట్లాడతారు కుటుంబ నియంత్రణ గురించి అంటూ వ్యంగ్యంగా అనడంతో రోశయ్య ఇచ్చిన సమాధానం దిమ్మదిరిగేలా చేసింది… ఒక్క సంతానం ఉన్న బాబుకు కుటుంబ నియంత్రణ ఆవశ్యకత తెలియకపోవచ్చు కానీ అధిక సంతానం ఉన్న కుటుంబ యజమానిగా ఆ బాధలు నాకు తెలుసు అంటూ తిప్పికొట్టడంతో అందరూ బల్లలు చరిచారు…


మీకు రెండో ఫ్యామిలీ ఉందట కదా అని ఒక విలేకరి అడిగితే ‘ బాబ్బాబు కొంచెం అడ్రెస్ చెప్పవా ‘ అని ఆయన రిటార్ట్.


నేనెప్పుడూ డ్రామాలు వెయ్యలేదు.. కనీసం డ్రామాలో కత్తి పట్టుకొని వెనుక నిల్చుని వేషం కూడా వేయలేదు అని ఆన్సర్ ఇచ్చాడు…


రోశయ్య ఇంకో సూపర్ డైలాగ్… అసెంబ్లీలో టీడీపీ వ్యక్తి ఏదో విషయమై సవాలు చేస్తే, “బాబూ! మీ అంత శక్తి లేదు. మీలాగా నేను తొడ కొట్టి మెరుపులు సృష్టించలేను. నా తొడ వాచిపోతుంది.” ఆది (సినిమాలో jr ntr తొడగొడితే ఆకాశంలో మెరుపులు వస్తాయి. అది చాలా పాపులర్ & ఫన్నీ కూడా..) అవి దృష్టిలో పెట్టుకొని రోశయ్య కౌంటర్ అది…) చెబుతూ పోతే ఇలాంటివి ఎన్నో… అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
  • నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….
  • అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!
  • జాతికే పిత..! కానీ ‘మంచి పిత’ కాదు…! మిరుమిట్ల వెనుక చీకటి చారికలు..!!
  • ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!
  • ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions