Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…

September 9, 2025 by M S R

.

కేసీయార్ ఎప్పుడైతే తన పార్టీకి, రాష్ట్ర రాజకీయాలకు, ప్రజాజీవన స్రవంతికీ దూరంగా ఉంటున్నాడో… బీఆర్ఎస్ పార్టీలో ఓ సైద్దాంతిక గందరగోళం అలుముకుంటోంది… తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికపైన పార్టీ పాలసీ, కేటీయార్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నదీ అదే…

కేసీయార్ యాక్టివ్ పాలిటిక్సులో ఉన్నప్పుడు… తప్పు పాలసీ అయినా సరే దబాయించి మరీ సమర్థించుకునేవాడు… పార్టీ జంపింగులను రాజకీయ శక్తుల పునరేకీకరణ అన్నా, మాదేమీ ఉద్యమపార్టీ కాదు ఇక, అహోబిలం మఠం అసలే కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పుకున్నా తనకే చెల్లింది… ఎవరు తన పార్టీని వ్యతిరేకించినా సరే వారి మీద యాంటీ- తెలంగాణ ముద్ర వేసేసేవాడు…

Ads

పార్టీలోని తెలంగాణ ఆత్మను, పేరును చంపేసుకుని… జాతీయ పార్టీగా రూపొంతరం చెంది… నేనెందుకు ప్రధానిని కావొద్దనే భ్రమల్లో విహరించి, భంగపడి, నేలకు దిగి, చివరకు తెలంగాణలో కూడా దెబ్బతిన్న కేసీయార్ పార్టీలో నైరాశ్యమే కాదు, జాతీయ రాజకీయ వ్యవహారాలపై ఆలోచనారాహిత్యం కనిపిస్తోంది… అఫ్‌కోర్స్, బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ దశలో కూడా కీలక జాతీయ విధానాలపైనా సైద్ధాంతిక శూన్యతే కనిపించేది…

ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయానికే వద్దాం… కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండాలనేది నిర్ణయం, అంతకుమించి గత్యంతరమూ లేదు… కారణాలు ఏవైనా సరే… కానీ తన గైర్హాజరీని ఎలా సమర్థించుకోవాలో తెలియనితనం కనిపిస్తోంది…

కేటీయార్ ఓసారేమో రేవంత్ సపోర్ట్ చేసిన అభ్యర్థికి మద్దతు ఇవ్వం అన్నాడు… అదేం ప్రాతిపదికో… జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రేవంత్ రెడ్డి కేండిడేట్ కాదు, కాంగ్రెస్ కేండిడేట్ కూడా కాదు… తనకు ఇండియా కూటమి సపోర్ట్ చేస్తోంది.,.. కాదు, దేశంలోని యాంటీ బీజేపీ పార్టీలు ఓ ఆర్ఎస్ఎస్- బీజేపీ అభ్యర్థి ఉపరాష్ట్రపతి కాకూడదనే సూత్రంతో సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నాయి…

తెలంగాణకు 2 లక్షల టన్నుల యూరియా ఎవరిస్తే వాళ్లకే మద్దతు అన్నాడు మరోసారి… అధికారంలో లేని ఇండియా కూటమి యూరియా ఎలా ఇస్తుంది..? ఐనా, ఇదేం ప్రాతిపదిక..? ఇప్పుడు ఏమంటున్నాడు..? జైరాం రమేష్ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్టుగా ఓ ప్రకటన జారీ చేశాడు కేటీయార్…

‘‘కాంగ్రెస్ అహంకారపు వైఖరి తనను జాతీయ స్థాయిలో విఫల పార్టీగా మార్చింది… మేం బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కు గానీ బీ-టీమ్ కాదు, మేం తెలంగాణ ప్రజలకు ఏ-టీమ్… దేశ రాజకీయాలను కేవలం రెండు పార్టీల మధ్యనే జరిగే పోరాటంగా చూడటం తప్పు… ప్రాంతీయ పార్టీలకూ స్వతంత్ర స్థానం ఉంది..’’

ఎస్, నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో తన పొలిటికల్ వైఖరి ఏమిటో, రాష్ట్రంలో తన ప్రబల ప్రత్యర్థి ఎవరో తేల్చుకోలేని దురవస్థ… తెలంగాణ ప్రజల ఏ-టీమ్ అన్నప్పుడు… సుదర్శన్‌రెడ్డిది తెలంగాణ, తను తెలంగాణవాది, మాజీ న్యాయమూర్తి, రాజకీయాలతో అఫిలియేషన్ లేదు… మరి తనకు మద్దతు దక్కాలి కదా… పార్టీ ఒరిజినల్ పేరు నుంచి తెలంగాణను కత్తిరించుకున్నాక ఈ ధోరణి కూడా కనిపించకుండా పోయిందా..?

సుదర్శన్‌రెడ్డికి ఆప్ మద్దతు, అదేమీ కాంగ్రెస్ కూటమి కాదు… తృణమూల్ కాంగ్రెస్ మద్దతు, అదీ కాంగ్రెస్ కూటమి కాదు… కానీ వాటికి యాంటీ బీజేపీ స్టాండ్ అవసరం… వాటికి బీజేపీయే ప్రబల ప్రత్యర్థి కాబట్టి… వాళ్లకు క్లియర్‌కట్ పొలిటికల్ స్టాండ్ ఉంది… నవీన్ పట్నాయక్ మొన్నమొన్నటిదాకా బీజేపీ బిల్లులకు మద్దతునిచ్చాడు, ఎప్పుడూ కాంగ్రెస్ పట్ల సదభిప్రాయం లేదు తనకు… ప్రస్తుతం బీజేపీ ప్రబలప్రత్యర్థి, సో, ఈ ఎన్నికకు దూరం…

జాతీయ రాజకీయాలు ఇప్పుడు యాంటీ -బీజేపీ, ప్రొ-బీజేపీ వర్గాలుగా చీలిపోయాయి… నిజంగానే రెండు ధ్రువాల్లో ఎటో ఒకవైపు సరైన రాజకీయ స్పష్టతతో నిలబడాల్సిన అనివార్యత, ప్రాంతీయ పార్టీలకు కూడా..! వైసీపీకి కాంగ్రెస్ అంటే ఏవగింపు, బీజేపీ కరుణ కావాలి, సో, ఎన్డీయే వైపు నిలబడుతోంది…

టీడీపీ ఎలాగూ ఎన్డీయే భాగస్వామి, సో రాధాకృష్ణన్‌కే వోటు… క్లియర్‌కట్ మార్గం… ఎటొచ్చీ… సరిగ్గా తన పొలిటికల్ స్టాండ్‌‌ను సమర్థించుకోలేని అయోమయం, గందరగోళం బీఆర్ఎస్ పార్టీలోనే కనిపిస్తోంది..!!

  1. చివరగా… కేటీయార్, నీకు ఓ సూటి ప్రశ్న… మొన్న రాజీనామా చేసిన ధన్‌ఖడ్ పోస్టుకే కదా ఈ తాజా ఎన్నిక… మరి తను పోటీచేసినప్పుడు… అంటే 2022లో… యాంటీ- బీజేపీ అభ్యర్థి మార్గరెట్ అల్వా… మరి మీరెవరికి సపోర్ట్ చేశారు..? మార్గరెట్ కు… ఎందుకు..? గుర్తుందా..? ఫాఫం, ఓ పార్టీకి సైద్దాంతిక నిబద్ధత ఉండాలనే విషయం మరిస్తే ఎలా..? మీరు చాలా బిజీ, మీ టీమ్‌కైనా సోయి ఉండాలి కదా..!!
  2. ప్చ్… కవితకు ఉన్న క్లారిటీ కూడా లేకపాయె, ఆమెకు ఓటు లేదు, కానీ సుదర్శనరెడ్డికి మద్దతు ఎందుకో క్లారిటీ ఉంది, ప్రకటించింది… అదే ఉండాల్సిన పొలిటికల్ క్లారిటీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…
  • అల్పపీడనాలు… అవి ప్రకృతి జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు…
  • జగన్ మానసిక వైకల్యం సరేగానీ… నార్సిసిస్ట్ కానివారెవ్వరు ఇప్పుడు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions