.
స్ట్రాటజిస్ట్ లేకుండా ఏ పార్టీ గెలవలేదా.. వీళ్లు ఏమి చెబుతున్నారో వినండి ..
ఋషి రాజ్ మరియు రాబిన్ శర్మ … 2024 ఆంధ్ర ఎన్నికల్లో మారుమోగిన పేర్లు .. వాళ్ళ కంపెనీలకన్నా వారి పేర్లే ఎక్కువ పాపులర్. ఋషి రాజ్ I-PAC వైసీపీ కోసం . రాబిన్ శర్మ – Show Time టీడీపీ కోసం పనిచేశారు.
Ads
ఇండియా టుడే సెప్టెంబర్ 25 & 26 తేదీల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లతో కాంక్లేవ్ నిర్వహించింది. ఇందులో I-PAC ఋషి రాజ్, Show Time – రాబిన్ శర్మ, Design Box- నరేష్ అరోరా పాల్గొన్నారు.
మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో రాబిన్ శర్మ -ఏకనాథ్ షిండే కోసం, నరేష్ అరోరా – అజిత్ పవార్ కోసం పనిచేశారు. మహారాష్టలో వీరి అద్భుత విజయంతో ఆ వీడియో మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం సునీల్ కనుగోలు – Inclusive Minds పనిచేసింది.
సునీల్ కనుగోలు – Inclusive Minds మహారాష్ట్ర & హర్యానాలో విఫలం అయ్యింది కానీ కర్ణాటక & తెలంగాణాలో విజయం సాధించింది. ఆంధ్ర ఎన్నికల్లో Design Box- నరేష్ అరోరా టీమ్ నెల్లూరు ఎంపీగా పోటీచేసిన విజయసాయిరెడ్డి కోసం పనిచేశారు.
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ల మీద అనుకూల ప్రతికూల వాదనలు ఎన్ని ఉన్నా నరేష్ అరోరా అన్నట్లు పొలిటికల్ స్ట్రాటజిస్ట్/కన్సల్టెంట్ లేకుండా ఏ పార్టీ కూడా ఎన్నికలు గెలవలేదు, అదే నరేష్ అన్నట్లు పొలిటికల్ స్ట్రాటజిస్ట్/కన్సల్టెంట్లు ఎన్నికలను గెలిపించలేరు. వినటానికి ఈ స్టేట్మెంట్లో ద్వైదీభావం ఉన్నా కన్సల్టెంట్ లేదా స్ట్రాటజిస్ట్ లు ఎన్నికల గెలుపులో కీలకమే కానీ వాళ్ళు మాత్రమే గెలిపించలేరు.
ఋషి రాజ్ అన్నట్లు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అద్దం లాంటి వారు. సీనియర్ నాయకులకు ఎన్నికలు ఎలా గెలవాలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ చెప్పాలా?. మీ గడ్డం మీరు చేసుకోవాటనికి అద్దం అవసరమే . మీరు ఎంత సీనియర్ అయినా అద్దం లేకుండా క్లీన్ షేవ్ చేసుకోలేరు.
రాబిన్ శర్మ చెప్పినట్లు strategist is the not story politician is the story .. ఎన్నిక రాజకీయ పార్టీ కోసమే కానీ స్ట్రాటజిస్ట్ కోసం కాదు, రాజకీయ పార్టీనే ముఖ్యం. ప్రశాంత్ కిషోర్ “మత్ బనావ్”.. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎక్కువగా మీడియాలోకి వచ్చినా వాళ్ళ అభిప్రాయాలు బహిరంగంగా చెప్పినా ఓకే, వీళ్లు కూడా ప్రశాంత్ కిశోర్ మాదిరి రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారేమో అనే అభిప్రాయం ఏర్పడుతుంది, పని మీద దాని ప్రభావం చూపుతుంది.
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లు గెలిచే పార్టీ పక్కన చేరుతారా?.
ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పకుండా ఈ ప్రశ్న ఇండియా టుడే మోడరేటర్ రాహుల్ అడిగారు .. దానికి రాబిన్ శర్మ సమాధానము చెప్పారు. 2020లో వారి Show Time టీడీపీతో పనిచేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నపుడు తనను అందరు డిస్కరేజ్ చేశారు.. టీడీపీ చంద్రబాబు మళ్ళీ ఎన్నికలు గెలవలేరు అని చెప్పారు కానీ నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి మేము టీడీపీ కాంట్రాక్ట్ తీసుకున్నాం.. విజయం సాధించాము అని రాబిన్ శర్మ సమాధానం చెప్పారు.
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లో డబ్బులు వస్తాయా?.
ముగ్గురు దీనికి చాలా జాగర్తగా సమాధానం చెప్పారు కానీ మొదట్లో వందల కోట్లు ఫీజ్ దక్కింది. ప్రభుత్వాల్లో డిజిటల్ మీడియాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అంత భారీ ఫీజులు లేవు, ఎన్నికల ఫలితాన్ని బట్టి కొంత భాగం ఫీజు చెల్లించేలా ఒప్పందాలు ఉంటున్నాయి.
వీరు ముగ్గురు అభిప్రాయపడ్డట్లు రాబోయే రోజుల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వ్యాపారం అనేది వేల కోట్ల ఇండస్ట్రీగా ఎదుగుతుంది. వేలమంది పనిచేసే సెక్టార్ గా రూపొందుతుంది. గెలుపు ఓటములను బట్టి సంస్థలు మారిపోవచ్చు కానీ ఇండస్ట్రీ మాత్రం ప్రతి ఎన్నికకు నెక్ట్స్ లెవల్ కు వెళుతుంది. ఇప్పటికే పెద్ద మీడియా సంస్థలు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లోకి క్రమంగా వస్తున్నాయి. భవిషత్తులో పూర్తిస్థాయిలో పొలిటికల్ స్ట్రాటజి కంపెనీలను నడుపుతాయి.
దేశంలో ఉన్న ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లలో దాదాపు అందరూ ప్రశాంత్ కిషోర్ స్కూల్ నుంచి వచ్చినవాళ్లే, (Design Box నరేష్ అరోరా మాత్రం ప్రశాంత్ కిషోర్ తో ఎప్పుడూ పనిచేయలేదు.). గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని ప్రధానిగా ప్రమోట్ చేయటం కోసం ప్రశాంత్ కిషోర్ స్థాపించిన Citizens for Accountable Governance (CAG) లో దాదాపు అందరూ పనిచేశారు. బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎలాంటి ఫలితాలు సాధించినా ఆయన ముద్ర మాత్రం ఇండస్ట్రీ మీద ఎప్పటికీ ఉంటుంది.
2014 ఎన్నికల నాటికి సోషల్ మీడియా / డిజిటల్ మీడియా ప్రభావం పెరిగింది దాన్ని బీజేపీకి మోడీకి అనుకూలంగా మార్చటంలో Citizens for Accountable Governance (CAG) పాత్ర ముఖ్యం.. “ఛాయ్ పే చర్చ” ఏ విధముగా మోడీని దేశంలో అందరికి పరిచయం చేసిందో తెలిసిందే.
మీరు ప్రత్యర్థి పార్టీలకు కూడా పనిచేస్తారా ?.
ఈ ప్రశ్నకు ఋషి రాజ్ చెప్పిన సమాధానం IPAC is not YSRCP .. మా లాయలిటీ క్లయింట్ కు ఉంటుంది కానీ రాజకీయ పార్టీలకు కాదు.
ఇండియా టుడే మంచి డిబేట్ నిర్వహించింది. హైలైట్స్ తో 35 నిమిషాల షార్ట్ వీడియోను విడుదల చేసింది.. అందరూ తప్పకుండా చూడండి. https://www.youtube.com/watch?v=6OfnvcYycko
ఈ ఇండస్ట్రీలో గెలుపే కొలమానం .. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా జగన్ లాగా అదే సంస్థను కొనసాగించేవారు చాలా చాలా తక్కువ. కానీ సబ్జెక్టు విలువ మారదు .. ఋషి రాజ్ IPAC ఎన్నిల ముందు జగన్ కు ఏమి రిపోర్ట్ ఇచ్చిందో తెలియదు కానీ వాళ్ళు ఓడిపోతాం అని చెప్పివుంటే వాళ్ళ మీద జగన్ కు ఫలితాల తరువాత నమ్మకం కలిగివుండొచ్చు..
టీడీపీ కూటమి విజయం తరువాత రాబిన్ శర్మకు రాజ్యసభ ఆఫర్లు వచ్చాయంట.. ఐదు పార్టీలు ఆయన్ను రాజ్యసభకు పంపటానికి సిద్ధంగా ఉన్నాయని నరేష్ అరోరా చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్ర విజయం తరువాత రాబిన్ శర్మకు రాజ్యసభ అవకాశాలు మెరుగయ్యాయి. ఒకవేళ రాబిన్ శర్మ రాజ్యసభకు వెళితే ప్రశాంత్ కిషోర్ నుంచి IPAC ఋషి రాజ్ కు వచ్చినట్లు ShowTime Consulting కు Shantanu Singh బాస్ కావొచ్చు.
IPAC టీంలో ఋషి రాజ్ తరువాత సెకండ్ ప్లేస్ లో ఉన్న శంతను సింగ్ లోకేష్ పాదయాత్ర మొదలైన సమయంలో ShowTime లో చేరి పాదయాత్ర బాధ్యతలు చూశారు .
రాజకీయాలు రాసే ఫేస్ బుక్ మిత్రులకు ఒక సలహా .. నిర్మాణాత్మక పోస్టులు రాయండి.. bits and pieces కాకుండా ఫుల్ లెంగ్త్ రాయండి. పోస్ట్ పెద్దదైతే ఎక్కువ మంది చదవరు అనే ఆలోచన వద్దు.. పోస్ట్ లో కంటెంట్ పెరిగితే సీరియస్ పీపుల్ చదువుతారు. భవిషత్తులో స్వయంగా స్ట్రాటజిస్టులుగానో లేక స్టాటజీ కంపినీలతో పనిచేసే key resources గానో అవ్వాలనే టార్గెట్ పెట్టుకొండి…… ( రచయిత :: శివ రాచర్ల )
Share this Article