మూడు వార్తలు… వేర్వేరు నటీమణులు… మణులో మాణిక్యాలో గానీ… రెండూ మంగుళూరు బేస్డ్ తారలే… ఇద్దరూ భీకరంగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు… మీరిద్దరూ అసలు కన్నడ తారలే కాదు, మిమ్మల్ని సహించాల్సిన పనిలేదు… మీకు కన్నడ ఇండస్ట్రీ అన్నా, కర్నాటక అన్నా, కన్నడతనం అన్నా లెక్కలేదు… మీ దుంపతెగ… మిమ్మల్ని మావాళ్లు అని చెప్పుకోవడమే మాకు సిగ్గుచేటు అని తిట్టిపోస్తున్నారు…
వీరిలో ఫస్ట్ రష్మిక… కన్నడ జనం ఆమెకు తెలుగు బలుపు, తమిళ బలుపు, హిందీ బలుపు అని తీర్మానించేశారు… కాంతార సినిమా వివాదం, రిషబ్ శెట్టి పట్ల వెటకారం, దానికి సదరు రిషబ్ కౌంటర్ అన్నీ చదివాం… తాజాగా ఏమైందో ఏమో గానీ… సోయి మేలుకొన్నట్టుంది… అబ్బే, నేను కాంతార చూడగానే ఆ సినిమా యూనిట్‌కు అభినందనలు చెబుతూ మెసేజ్ చేశాను, అవన్నీ నేను మీడియాకు చెప్పాలా అని ఓ కొత్త అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది ఆమె… నో, నో, కన్నడ ఇండస్ట్రీ నామీద బ్యాన్ పెట్టలేదు అని చెబుతూ, ఫుల్లు తగ్గిపోయింది… మెదడులో ఓ విండో తెరుచుకున్నట్టుంది…
ఐనాసరే, కన్నడ నెటిజనం ఆమెను క్షమిస్తారా అనేది డౌటే… ఆమె మీద కోపం అలా ఉంది… తను నటించిన వారసుడు, గుడ్ బై సినిమాలకు కర్నాటకలో ఇబ్బందులు క్రియేట్ గాకుండా… నిర్మాతలకు తలనొప్పి లేకుండా… ఏదో నటిస్తోంది… నిర్మాతలు లెఫ్ట్ రైట్ తీసుకున్నట్టున్నారు… ఎలాగూ ప్రమోషన్ మీటింగులు చేతకావు, ఇదేం దిక్కుమాలిన వివాదాలు అని ఝలక్కులు ఇచ్చినట్టున్నారు… ఇంకా చేతిలో యానిమల్, పుష్ప-2, మిషన్ మజ్ను సినిమాలు కూడా ఉన్నాయి… మొత్తానికే ఏదో ఎసరు పెట్టేట్టుంది ఈ వ్యతిరేకత అనే ఆత్మచింతన ఆమెను మార్చినట్టుంది…
Ads
అసలే విజయ్ దేవరకొండకు అన్నీ అర్పించేసి, దివాలా తీసినట్టుగా ఉంది ఆమె ఆర్థిక స్థితి కూడా…! ఇక పూజా హెగ్డే దగ్గరకు వద్దాం… నేను ట్రూ కన్నడిగ తెలుసా అని కొత్త పాట అందుకుంది… రణవీర్‌సింగ్ లీడ్ రోల్‌లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న సర్కస్ సినిమాలో చేస్తోంది… సల్మాన్ ఖాన్‌తో కిసీకా భాయ్, కిసీకా జాన్ సినిమా చేస్తోంది… పాన్ ఇండియా సినిమాలు అంటే కన్నడ మార్కెట్ కూడా ముఖ్యమే కదా… అందుకే నేనూ కన్నడ కస్తూరినే అని పాట అందుకుంది…
‘‘అసలు రిషబ్ శెట్టి తీసిన కాంతారను వర్ణించడానికి మాటల్లేవ్… నేనూ మంగుళూరు మూలవాసినే అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది… భూత కోల వంటి గ్రామీణ కల్చరల్ ఫామ్స్ చూస్తూ పెరిగిన దాన్ని కదా… ఆ సినిమా చూస్తుంటే నా పాత జ్ఞాపకాల్లోని జారిపోయాను… ఆ సంప్రదాయపు మ్యాజిక్ పెద్ద తెరపై చూస్తుంటే అబ్బురంగా ఉంది’’ అని గలాటా ప్లస్ మెగా రౌండ్ టేబుల్ భేటీలో చెబుతూ పోయింది… వామ్మో, నువ్వు కూడా రష్మికు దీటైన నటివే పూజా అని నెటిజనం ఇప్పుడు ఆమెపై పడ్డారు…
‘‘నీ మొహానికి నీకు కన్నడం మాట్లాడటమే రాదు, కన్నడ ఇండస్ట్రీని ఎప్పుడూ ఓన్ చేసుకోలేదు… ఈరోజు నీ అవసరం కాబట్టి కథలు చెబుతున్నావు… మూసుకో కాస్త… నీకు తెలుగు కావాలి, నీకు తమిళం కావాలి, నీకు హిందీ కావాలి… ఎప్పుడైనా ఓ కన్నడ మూలవాసిగా వ్యవహరించావా..?’’ అంటూ ట్రోలింగ్ మొదలైంది… నిజమే, గోక్కోవడం దేనికి..? గతంలో ఎప్పుడూ లేనంతగా కన్నడ ఇండస్ట్రీ, కన్నడ జనం తమ సినిమాల పట్ల మెగా అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు… ఆ సెంటిమెంట్‌తో ఆడుకునే ఆలోచనే కరెక్టు కాదు… నిజానికి అది కాదు… పూజా హెగ్డే అకస్మాత్తుగా సల్మాన్ ఖాన్‌కు కొత్త బకరీ అయిపోయి మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది…
సల్మాన్‌ఖాన్ ప్రేమలో పడిందట అమ్మడు… దాంతో అందరూ ఆమె మూర్ఖత్వానికి జాలిపడుతున్నారు… ఏవగింపు… తెలుగు భాషలో ఎలపరం… అసలు అరవై ఏళ్లకొచ్చిన సల్మానుడి మీద దేశవ్యాప్తంగా ఓ వ్యతిరేకత ఉంది… బిష్ణోయ్ సమాజం ఎప్పుడు చంపుదామా అని ఎదురుచూస్తోంది… కృష్ణజింకల వేట, దారిపక్కన పడుకున్న వాళ్లపై నుంచి కారు… ఇవేకాదు, సల్మాన్ జీవితమంతా ఓ మూర్ఖపు పోకడే… ఆడది అంటే తనకు ఓ ఆటబొమ్మ, కొన్నాళ్లు ఆడుకుని, వాడుకుని పడేస్తాడు…
అంతటి ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫులో తన మాయలో పడి, మోసపోయారు… అలా ఎందరో… పైగా ఏడెనిమిదేళ్లుగా మొహానికి ఓ రోగం ఉంది… అలాంటి సల్మానుడి ప్రేమలో పూజా హెగ్డే పడిపోవడం నిజంగా ఓ వార్తే… సినిమా తారలంటే అంతే… ఎవడిని ఎందుకు నమ్ముతారో, ఎందుకు పడిపోతారో, ఎందుకు సర్వం అర్పించుకుంటారో వాళ్లకే తెలియాలి… పూజా హెగ్డే భిన్నమేమీ కాదు… తనూ ఓ అందమైన బుర్రలేని బొమ్మే కదా…!!
Share this Article