ఫాఫం, నాగార్జున… అంతకన్నా ఫాఫం బిగ్‌బాస్… మరీ మొన్నటి సీజన్ పూర్తిగా చంకనాకిపోయింది… (ఈ పదాన్ని వాడినందుకు క్షమించండి… ఫ్లోలో వచ్చేసింది… ఐనా ఆ సీజన్ అలాగే ఏడ్చింది, ఈ పదమూ సరిపోదు… దరిద్రపు కంటెస్టెంట్లు, వాళ్ల ప్రవర్తన, బోరింగ్ టాస్కులు, పరమ వికారపు ఎలిమినేషన్ ఎపిసోడ్లు ఎట్సెట్రా… షన్నూ, సిరి వెగటు ప్రేమాయణం సరేసరి… ఒక్క శ్రీరాంచంద్ర మినహా…) నాగార్జున హోస్టింగ్ అంత బాగా నచ్చిందా..? లేక నా హోస్టింగ్ లేకపోతే నా స్టూడియో నుంచి ఆ సెట్టు పీకేసుకుని వెళ్లిపొండి అన్నాడా తెలియదు గానీ… మరో సీజన్‌కు కూడా నాగార్జునే హోస్టింగ్ అట… వీలైతే ఓటీటీ షోకు కూడా తనేనట… ఫాఫం, బిగ్‌బాస్… ఇదంతా ఎందుకు చెప్పడం అంటే…
మొన్నామధ్య బిగ్‌బాస్ ఫినాలే జరిగింది కదా… టీవీ టైమింగ్స్‌లో అత్యంత విలువైనదిగా పరిగణించే ఆదివారం… అదీ సాయంత్రం ఆరు గంటల నుంచి 11 గంటల దాకా… అయిదు గంటల మారథాన్… నాగార్జున మస్తు కష్టపడ్డాడు… ఒక్కసారి గుర్తుతెచ్చుకొండి… ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం రాజమౌళి, ఆలియా భట్, అదేదో బ్రహ్మాస్త్ర సినిమా కోసం రణబీర్, శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్ కోసం నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, పరంపర ప్రమోషన్ కోసం నవీన్ చంద్ర, జగపతి, పుష్ప ప్రమోషన్ కోసం సుకుమార్, రష్మిక, డీఎస్పీ… మధ్యలో శ్రియ డాన్స్… స్టారాధిస్టార్లు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు… అన్నట్టు మధ్యలో చైతూ కూడా వచ్చివెళ్లాడు… vivo PRO కబడ్డీ ప్రమోషన్ కోసం… అలాగే నాగ్, చైతన్య నటించిన బంగార్రాజు ఫ్లేవర్ కోసం ఫరియాను కూడా రప్పించారు…
ఇంత హంగామా, అట్టహాసం, ఇంతమంది అతిథులు, పైగా గ్రాండ్ ఫినాలే… మస్తు రీచ్ ఉన్న మాటీవీ… అలాంటప్పుడు రేటింగ్స్ అదిరిపోవాలి కదా… తుస్… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో వచ్చింది ఎంతో తెలుసా..? జస్ట్, 10.89… అంటే రెగ్యులర్ షోలు మాత్రమే కాదు, ఆ బిగ్‌బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలేను కూడా ప్రేక్షకుడు పెద్దగా దేకలేదని అర్థం… స్థూలంగా రేటింగ్స్ కలిపితే 15, 16 దాకా ఉండవచ్చు… కానీ అవి మరీ దేవత, గుప్పెడంత మనసు సీరియళ్ల స్థాయి రేటింగ్స్… ఇంత కష్టపడినా ఇంటింటి గృహలక్ష్మి, కార్తీకదీపాలకు చాలా దూరం ఉండిపోయింది… ఈ చెల్లెలి కాపురం రేంజ్ రేటింగ్స్ ఒకరకంగా మాటీవీ, బిగ్‌బాస్, నాగార్జున పట్ల సగటు టీవీ ప్రేక్షకుడి అభిశంసన… తిరస్కరణ…
Ads
వాడికి ఇన్ని లక్షలు ఇచ్చారు, వీడికి ఇన్ని లక్షలు ఇచ్చారు, కోట్లు ఖర్చుపెట్టారు అంటూ బోలెడు వెబ్‌సైట్ల వార్తలు చదివి ఉంటారుగా… తెలుగు టీవీల్లో అత్యంత ఖరీదైన షో ఇది… చివరకు ఇలా ఏడ్చింది… ఇప్పుడు ఓంకార్ టీం ఆ ఓటీటీ షోకు ఏం మార్పులు చేస్తారో చూడాలి… ఆరో సీజన్ కూడా అదే నాగార్జున, అదే టీం కాబట్టి పెద్దగా ఆశలేమీ అక్కర్లేదు… చూశాం కదా, మొన్నటి సీజన్‌లో మొదటి నుంచీ నాగార్జున షణ్ముఖ్ అనే ఓ సబ్‌స్టాండర్డ్ కంటెస్టెంట్‌ను ఎలా నెత్తిన పెట్టుకుని మోశాడో… ఆ సిరిని చివరి దాకా ఎలా లాక్కొచ్చారో… రవిని, కాజల్‌ను ఎలా తరిమేశారో… చివరకు ఆ షో పట్ల ప్రేక్షకుడి తీర్పు చూశారుగా… అవీ రేటింగ్స్…!!
Share this Article