Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం చిరంజీవి… టీవీక్షకులు పెదవి విరుస్తున్నారంటే ప్రమాద హెచ్చరికే…

November 2, 2023 by M S R

వాల్తేరు వీరయ్య… చిరంజీవికి మళ్లీ ప్రాణం పోసిన సినిమా… అంతకుముందు పాదఘట్టం ఆచార్య అనే ఓ డిజాస్టర్… వాల్తేరు వీరయ్య తరువాత భోళాశంకర్ అనబడే మరో సూపర్ డిజాస్టర్ చిరంజీవి సినిమాల ఖాతాలో పడ్డయ్… రిస్క్ లేకుండా వేరే భాషల్లో హిట్టయిన కథల్ని రీమేక్ హక్కులు కొనిపించి, తన ఇమేజీకి (సూపర్ హీరోయిక్ కేరక్టర్స్) అనుగుణంగా నానా మార్పులు చేయిస్తున్నాడు…

ఐనా సరే, తను మారడు… పోనీ, ఒరిజినల్స్ అలాగే ఉంచుతాడా..? ఉంచడు… చిరంజీవి నమ్ముకున్న సోకాల్డ్ మాస్ మసాలా కమర్షియల్ వాసనలకే కట్టుబడతాడు… నీ ఏజ్‌కు, నీ రేంజ్‌కు జనం ఎప్పుడూ గుర్తుంచుకునే ఓ మంచి సినిమా తీయవయ్యా అంటే వినడానికీ ఇష్టపడడు…  మరీ భోళాశంకర్ సినిమా తనను నిజానికి ఆత్మమథనంలో పడేయాలి… పడలేదు… పైగా నా ఫ్యాన్స్ నా నుంచి అవే ఫైట్స్, అవే డాన్సులు, అవే కేరక్టర్స్ కోరుకుంటున్నారని సమర్థించుకున్నాడు ఆమధ్య ఓచోట…

కానీ చిరంజీవిని అలా చూడటానికి ఇష్టపడుతున్నారా..? ఏమో… జవాబు సంక్లిష్టం… వాల్తేరు వీరయ్య రికార్డులు బద్ధలు అంటూ ఏవేవో లెక్కలు రాసుకొచ్చాయి సైట్లు, యూట్యూబ్ చానెళ్లు… తీరా టీవీలో ప్రీమియర్ ప్రసారం చేస్తే రేటింగ్ ఏమిటో తెలుసా..? 4.42 (హైదరాబాద్ బార్క్)… చిరంజీవి రేంజ్‌కు ఇది నిజంగా ఓ అవమానమే… అంత చిరంజీవిని తెర మీద చూడటానికి ఇళ్లల్లో ప్రేక్షకులు అంత అయిష్టత కనబరిచారా..? పైగా ఎక్కడో 200 రోజులు నడిచిందట కూడా… ఈరోజుల్లో 200 రోజులు అనేది మామూలు విషయం కాదు, ఐనాసరే టీవీక్షకులకు పట్టలేదు…

Ads

చిరంజీవి కోణంలో చూస్తే… సమర్థిస్తే… ‘‘అబ్బే, థియేటర్లలోనే జనం బాగా చూశారు, ఇక టీవీల్లో చూసేది తక్కువ మందే కదా, అందుకని తక్కువ రేటింగ్స్… దీన్ని జెమినీ టీవీలో వేశారు, జీతెలుగు గానీ, మాటీవీ గానీ ప్రసారం చేసి ఉంటే ఇంకాస్త బెటర్ రేటింగ్ వచ్చేది’’… ఇదీ ఓ సమర్థన… ఇమేజీ బిల్డప్పుల హీరోలే ఇద్దరూ… చిరంజీవి, రవితేజ… సూపర్ హీరోయిక్ కేరక్టర్లతో తెర నిండా యాక్షన్ సీన్లు గుప్పించారు… ప్చ్, టీవీక్షకులు పట్టించుకోలేదు…

ఐతే చిరంజీవిపై బాలయ్య వీరసింహారెడ్డి విజయం… వాల్తేరు వీరయ్యకన్నా వీరసింహారెడ్డి ఎక్కువ రేటింగ్స్ వచ్చాయని రాసుకొచ్చినవాళ్లూ ఉన్నారు… ఆ వాదన కరెక్టు కాదు… సినిమాల్ని ప్రసారం చేసిన ఛానెళ్ల రీచ్ కూడా రేటింగ్స్‌ను ప్రభావితం చేస్తుంది… ఐనా వాల్తేరు వీరయ్యను మించి వీరసింహారెడ్డిలో ఏముందని… దొందూ దొందే… టేస్ట్ లెస్ ప్రొడక్షన్స్… ఈ వాల్తేరు వీరయ్యే టీవీల్లో ఇంత చతికిలపడితే ఇక భోళాశంకర్ రేటింగ్స్ ఎలా ఉండనున్నాయో… పర్లేదు బాస్, నీ మసాలా, నీ బిల్డప్పుల తోవలోనే నువ్వు వెళ్లు… నీ ఇష్టం…

chiranjeevi

సరే, ఆ వీరయ్యను కాసేపు వదిలేస్తే అసలు ఈసారి రేటింగుల్లో నవ్వొచ్చింది దాస్‌కాధమ్కీ సినిమా… దాన్ని కొన్నది జీతెలుగు వాళ్లు… కానీ తమ మెయిన్ చానెల్‌లో ప్రసారం చేయడానికి కూడా ఇష్టపడనట్టుంది… జీ సినిమాలు చానెల్‌లో వేశారు… ఫాఫం… దాని రేటింగ్స్ ఎంతో తెలుసా..? 1.47 (హైదరాబాద్ బార్క్)… ఎన్నోసార్లు ప్రసారం చేసిన శతమానం భవతి, శివలింగలు దీనికన్నా ఎక్కువ రేటింగ్స్ దక్కించుకున్నాయి… ఈ పూర్ రేటింగ్స్‌ను చెప్పడానికి డిజాస్టర్ అనే పదం సరిపోదు…

nbk

సినిమా థియేటర్లలోనూ డిజాస్టరే… అప్పట్లో ముచ్చటలో మనమే రివ్యూ చేసుకున్నాం ఇలా… (ఒక పేరా…) ఏదో కొత్తగా తీస్తాను, ఇరగదీస్తాను అనుకుని… తండ్రి కరాటే రాజు పేరుతో డబ్బు పెట్టి, స్క్రీన్ ప్లే రాసుకుని, డైలాగులు రాసుకుని, దర్శకత్వం కూడా చేసి, తనే హీరోగా నటించాడుట విష్వక్సేన్… (బహుశా హైపర్ ఆది రాసి ఉంటాడు డైలాగులు…) ప్రేక్షకులకే ధమ్కీ ఇచ్చినట్టుగా ఉంది సినిమా… మనుషుల తత్వం వాళ్ల పనిలో కనిపిస్తుంది కదా… బూతులు, చెత్తా వివాదాలు, యాటిట్యూడ్ సమస్యతో బాధపడే విష్వక్సేన్ అన్నీ తానై తీసిన సినిమా కూడా అలాగే ఉంది… ఎవరికీ రుచించకుండా…

ఎవరికీ రుచించలేదు, థియేటర్లలో, టీవీల్లో… అంతేకదా, ఆ సినిమా ఏమిటో, దాని పోకడ ఏమిటో ఆ విష్వక్సేనుడికే తెలియాలి… అవునూ, టీవీల్లో సినిమా ప్రీమియర్లను పెద్దగా ప్రేక్షకులు చూడటం లేదు అనే వాదన కూడా ఉంది కదా… అది కొంతమేరకే నిజం… బలగం వంటివి ఎన్నిసార్లు వేసినా జనం చూస్తూనే ఉన్నారు… మరి దీనికి ఏమంటారు..? చిరంజీవి కూడా ఓసారి ఈ కోణంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి… కోవాలి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంద్రబాబు ప్రమోట్ చేశాడు… టేస్ట్ అట్లాస్ కూడా తప్పనిసరై గౌరవించింది…
  • ఇద్దరు వీరోయిన్లతో చిరంజీవి కిందామీదా పడి దొర్లినా… ప్చ్, పాపం..!!
  • 82వ ర్యాంకు కాదు…! 2, 3 ఏళ్లలో వరల్డ్ టాప్-20 లిస్టులోకి హైదరాబాద్..!!
  • ధర్మేంద్ర కుటుంబానికి బ్రిటిష్ రాజవంశంతో చుట్టరికం..! ఎలా..?!
  • సాంబ, మూర్తి, వెంకటకృష్ణ… వీళ్లే హైదరాబాద్ ప్రేక్షకులకు ఇష్టులు..!!
  • అడ్డగోలు దందా బీఆర్ఎస్ హయాంలో..! బురద జల్లేది ఈ ప్రభుత్వంపై..!!
  • మీడియా జీవితాలను, కుటుంబాలను నిలబెట్టగలదు… ఇవి అవే స్టోరీస్…
  • సర్‌ప్రయిజ్ అప్పియరెన్స్..! ఈ తెలంగాణ ‘బతుకమ్మ’ గుర్తుందా మీకు..?!
  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions