ఒక హిందీ జాకీష్రాఫ్, ఒక కన్నడ శివరాజకుమార్, ఒక మలయాళ మోహన్‌లాల్… వీళ్లకు తోడుగా తమిళ సునీల్… హీరో రజినీకాంత్… కథంతా తన చుట్టే గిరగిరా… రా రా రావాలయ్యా కావాలయ్యా అంటూ నడుమూపుళ్ల తమన్నా… పాన్ ఇండియా లుక్కు… సో కాల్డ్ మాస్ కమర్షియల్ వాసనలు… అదే… జైలర్ సినిమా… వందల కోట్లు వసూలు చేసినట్టు తెల్లారి లేస్తే బోలెడు అంకెలు… రికార్డుల ప్రకటనలు… కానీ ఏం జరిగింది..?
టీవీల్లో ప్రసారం చేస్తే వచ్చిన రేటింగ్స్ ముష్టి 5.40 … (హైదరాబాద్ బార్క్ కేటగిరీ)… అదీ ప్రసారమైంది జెమిని టీవీలో… జనమేమో ఆ టీవీని చూడటమే మానేశారు… తమిళంలో, ఇండియాలో గొప్ప కావచ్చు సన్ టీవీ… తెలుగు రాష్ట్రాల్లో అది నథింగ్… దాంతో అంతటి రజినీకాంత్ సినిమాకూ రేటింగ్స్ కరువయ్యాయి ఫాఫం…
నిజానికి రజినీకాంత్‌కు తోడుగా నిలబడిన ఇతర భాషల హీరోలు తమ భాషల్లో స్టార్లు కావచ్చు… కానీ ఈ సినిమాకు వచ్చేసరికి పెద్ద ప్రాధాన్యమున్న పాత్రలు కావు… (ఐనా ఇప్పుడు ఎంత స్టార్ హీరో అయినా ఒక్కడే జనాన్ని రప్పించలేడు, మెప్పించలేడు కదా… తోడుగా మరో హీరో రావల్సిందే… తెలుగులో సైతం అదే అదనపు పోషకాహారం… ఐనా సరే ఫ్లాపులు అంటే అది వేరే సంగతి…)
Ads
మళ్లీ నర్సింహ కాంబో అంటూ రమ్యకృష్ణ, రజినీకాంత్ జంట గురించి తెగ ఊదరగొట్టారు… కానీ ఆమె పాత్రకూ అంత సీన్ లేదు… అంతెందుకు… ఆ హిప్ మూమెంట్ల తమన్నా కూడా రెండు పాటలు, రెండు సీన్లకు పరిమితం… పర్టిక్యులర్‌గా ఆ రావాలయ్యా కావాలయ్యా పాట ట్యూన్, మూమెంట్స్ అదిరాయి…
ట్యూన్ అంటే గుర్తొచ్చింది… ఈ సినిమాలో మరో హీరో ఎవరంటే… అనిరుధ్… సంగీత దర్శకుడు… ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సంగీత దర్శకులెవరికీ లేనంత డిమాండ్, అట్రాక్షన్ అనిరుధ్‌కు ఉన్నాయంటే చాలామంది నమ్మరు… డీఎస్పీ, థమన్ సహా… ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది… దేశవిదేశాల్లో అనిరుధ్ కచేరీ పెడితే ఆ ఊపే వేరు ఇప్పుడు… రజినీకాంత్ హీరోయిజాన్ని అనిరుధ్ బీజీఎం భలే ఎలివేట్ చేసింది… అందుకే సినిమాకు మరో హీరో అనిరుధ్…
ఇన్ని ప్లస్సులున్నా సరే తెలుగు జనం టీవీల్లో ఈ సినిమా చూడటానికి పెద్ద ఆసక్తి చూపలేదు… రజినీకాంత్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ ఉన్నా సరే, ఈ సినిమా విడుదల సమయంలో రజినీ చంద్రబాబుకు అనుకూలంగా, మెచ్చుకోలుగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ బ్యాచ్‌కు నచ్చలేదు… ఆ బ్యాచ్ కడిగి పారేసింది… అలవాటే కదా… ఈ సినిమా ఫంక్షన్‌లోనూ తనను విమర్శించేవారి మీద అన్యాపదేశంగా సెటైర్లు వేశాడు రజినీకాంత్… ‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతానే ఉండాలి.. అర్ధమైందా రాజా!’’ అంటూ… కానీ కాలం మారుతోంది రజినీ… నువ్వు కనిపిస్తే చాలు ఈలలు వేసి చప్పట్లు కొట్టే రోజులు కావు… ఈ రేటింగ్సే రుజువు, అర్థమైందా రాజా…?!
Share this Article