18.9 టీఆర్పీలు… ఈసారి బిగ్‌బాస్ 8 సీజన్ లాంచింగ్‌కు వచ్చిన ఈ టీఆర్పీలతో షో దుమ్మురేపింది… తుక్కురేగింది… అంటూ ఏవో పిచ్చి ప్రచారాలు చేసుకుంది కదా స్టార్ మాటీవీ… గత సీజన్ల లాంచింగ్ ఎపిసోడ్లతో పోలిస్తే హయ్యెస్ట్ అని ఏవో పిచ్చిలెక్కలు కూడా చెప్పుకుంది… నాగార్జున కూడా సంతోషంగా ఆ టీఆర్పీలను షేర్ చేసుకున్నాడు… భుజాలు చరుచుకున్నాడు…
కానీ హైదరాబాద్ బార్క్ రేటింగ్ జస్ట్ 8.54 మాత్రమే… మిగతావి కలుపుకొన్నా మరీ 18.9 దాకా ఎలా వచ్చాయో వాళ్లకే తెలియాలి… వోకే, ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్‌కు పెద్ద వ్యూయర్‌షిప్ లేదు… గత సీజన్ అయితే అట్టర్ ఫ్లాప్… పైగా టీవీ వీక్షణలు తగ్గుతున్నాయి… జనం ఓటీటీల వైపు వెళ్లిపోతున్నారు వేగంగా…
పెద్ద పెద్ద స్టార్ల సినిమాలకే సరైన టీఆర్పీలు లేవు… అనగా, దేకేవాడు లేడు అని అర్థం… ఈ స్థితిలో ప్రస్తుత రేటింగ్స్ ఓ మోస్తరుగా గుడ్ అనుకోవాలి… సరే, అంత ప్రచారం చేసుకున్నారు కదా, రెండో వారం దాని గతేమిటి అని చెక్ చేస్తే… ఆదివారం నాగార్జున ఎలిమినేషన్ల ఎపిసోడ్‌కు కూడా 4.79 టీఆర్పీలు దాటలేదు… (హైదరాబాద్)… శనివారం 4.7 మాత్రమే…
Ads
https://x.com/iamnagarjuna/status/1834212018926301478/photo/1
చాలా పూర్ రేటింగ్సే… శనివారం ఫన్‌వారంగా ఉండటం లేదు… క్లాసులు పీకే వారం… పోనీ, ఆదివారం ఏమైనా వినోదం ఉంటుందా అంటే అదీ లేదు… ఇక వీకెండ్ నాగార్జున షోకు రేటింగ్స్ ఎలా రావాలి…? పిచ్చి సినిమా పాటలు కనిపెట్టే టాస్కులు, గేమ్స్ ఇప్పుడెవరికి ఆసక్తికరం..?
బుధవారం 3.83, సోమవారం 3.5, శుక్రవారం 3.39, గురువారం 3.35, మంగళవారం 3.28… నిరాశాజనకమే… పైగా ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక అస్సలు బాగాలేదు… లవ్ ట్రాకులు పెద్దగా లేవు గానీ ఒకటే హగ్గులు… చిరాకు పుట్టిస్తున్నారు… రాబోయే రోజుల్లో ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ టీం గనుక కొత్తదనాన్ని ప్రవేశపెట్టలేకపోతే… డెఫినిట్‌గా గత సీజన్‌ను మించి చేతులు కాలే పరిస్థితి తప్పదు… అసలే మణికంఠ, పృథ్వి, విష్ణుప్రియ… యష్మి అరుపులు, కేకలు…
నెత్తిన చెత్తలు పోయడం, రంగు పోయడం… ఇదో పైత్యం నామినేషన్లలో… కాకపోతే ఇప్పుడు నడుస్తున్నవారం కొన్ని గేమ్స్, టాస్కులు పర్లేదు అనిపించాయి… ఏమో ఇక చూడాలి, వచ్చే టీఆర్పీల తీరు..!!
Share this Article