.
అవును బ్రహ్మాజీ… మీ ఆవేదన, మీ ఆందోళన నిజం… దిక్కుమాలిన ఎగ్జిబిటర్స్ సిండికేట్ జనాన్ని ఎన్నిరకాలుగానైనా దోపిడీ చేయగలదు… ఏకంగా ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను కూడా హస్తగతం చేసుకోగలదు…
Ads
3 పాప్ కార్న్, ఒక వాటర్ బాటిల్ 1300 రూపాయలు… నీలాంటోడికే అలా ఉంటే ఓ సగటు మధ్యతరగతి ప్రేక్షకుడికి ఎలా ఉండాలి..?
అక్కడికి ఓ దరిద్ర నిర్మాత పిచ్చికూతలు కూశాడు… ఆఫ్టరాల్ వినోదం కోసం ఒక్కో సినిమాకు ఓ 1500 ఖర్చు పెట్టలేరా అని..? బలుపు అని ఓ పదం ఉంది తెలుగులో…
థియేటర్లన్నీ సిండికేట్… ఎవడు ఏ రేటు చెబితే అంత… థియేటర్‌లో పార్కింగ్ దోపిడీ, క్యాంటీన్ దోపిడీ… పాప్ కార్న్ కొనమని ఎవడు చెప్పాడు అనే పిచ్చి కూతలు వద్దు ప్లీజ్…
పిల్లలతో, ఫ్యామిలీతో వస్తే తప్పదు… పిల్లల్ని తిట్టలేం… అదేనా..? సమోసా, కూల్ డ్రింక్స్ మరీ దోపిడీ… అంతెందుకు..? ఈ గలీజుగాళ్లు మంచి నీళ్ల సీసాను కూడా తీసుకుపోనివ్వరు… ఒరేయ్, ఒరేయ్, చంటి పిల్లలు ఉన్నార్రా గాడిదల్లారా అని తిట్టినా ఎవడూ పట్టించుకోడు… పాలు కూడా నాట్ అలోడ్…
ఈ ఎగ్జిబిటర్ల సిండికేట్ లీడర్లకు ప్రభుత్వ పదవులు వస్తాయి… వాళ్లు అడగ్గానే ముఖ్యమంత్రులు కూడా లొంగిపోయి, వంగిపోయి, సాగిలబడిపోయి… బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపులు… ఇదీ మన రెండు తెలుగు రాష్ట్రాల దరిద్రం…
అంతేనా..? డిప్యూటీ సీఎంలు ఏకంగా బంధుప్రీతితో ప్రిరిలీజు ఫంక్షన్లకూ హాజరై హైప్ ఇస్తారు… అదేలెండి దిల్ రాజు భాషలో వైబ్స్ అట… కాదంటే తెల్ల కల్లు, మటన్ ముక్కల పేర్లు చెప్పి కించపరుస్తారు ఓ సంస్కృతిని..?
ఒరేయ్, ఎందుకురా మీ దిక్కుమాలిన సినిమాలకు మేం వైబ్ ఇవ్వాలి అని అడిగేవాడు లేక… అడిగితే తను కాదు, సర్కారే సహించదు కనుక..!
ఒక నెటిజన్ బదులిచ్చాడు… మల్టీప్లెక్స్‌లో కాఫీ తాగితే 180 రూపాయలు… 250 గ్రాముల కాపీ పౌడర్ కొనుక్కోవచ్చు అని… అదీ సినిమా థియేటర్ల దోపిడీ… వైకుంఠదర్శనం కోసం వెళ్లి బాధపడిన భక్తుల్ని విమర్శించినట్టే… ఎవడు పొమ్మన్నాడు మరి మల్టీప్లెక్స్‌కు, ఎవడు ఖాళీ చేసుకోమన్నాడు మీ జేబుల్ని అంటున్నారు చాలామంది…
నిజం… అక్షరాలా నిజం… పోయేవాడిదే బలుపు… టీవీల్లో వస్తాయి సినిమాలు, ఓటీటీల్లో వస్తాయి… చేతనైేతే హెచ్‌డీ ప్రింట్లు కనిపిస్తాయి నెట్‌లో ఫ్రీగా… థియేటర్లలోనే చూడాలా..? విలువైన ప్రశ్నే… ఓ నెటిజన్ రాశాడు, అయిదేళ్లుగా థియేటర్ మొహం చూడలేదు, నేనేమైనా పిచ్చోడినా అని… కరెక్టు… అదే కరెక్టు..!!
దరిద్రపు సిండికేట్లు పగిలిపోవాలంటే… జనం థియేటర్‌కు వెళ్లడం మానేయాలి… అదే పరిష్కారం…! ఈ దిక్కుమాలిన హీరోల సినిమాలు చూడకపోతే ప్రపంచగమనం ఏమీ స్తంభించదు… అత్యంత ఖరీదైన వినోదాన్ని అవాయిడ్ చేయడమే తెలివైనవాడి లక్షణం..!!
Share this Article