కుండ కుక్కర్లు… మన ఊరు – మన చరిత్ర
******************
ఆదిలాబాదు దగ్గరున్న కేస్లాపురంలో
Ads
నాగోబా జాతర గొప్పగ నడుస్తున్నది గదా..!
దాదాపుగా దేశంలోన వున్న అన్ని రాష్ట్రాల
గోండులు లక్షలాదిగా హాజరయ్యే పెద్ద జాతర ఇది.
ఈ జాతరలో, కొద్దిగ శ్రద్ధ పెడితే గనుక–
మన పురావిజ్ఞానపు విశేషాలెన్నో తెలుసుకోవచ్చు.
ఇక్కడి ఫోటోల కనబడుతున్నవి…
నాగోబా దేవుని నైవేద్యపు కుండలు.
మూతల అమరికలోనే వీటి విశేషత్వం ఉన్నది.
ఆవిరి కూడా బయటికి పోకుండ మంచి బిగువైన
Fitting method వీటికున్న శాస్త్రీయమైన లక్షణం.
కుక్కర్ టెక్నాలజీకి తక్కువ గావు, ఇంకింత ఎక్కువనే.
చక్కగ ఉడికించుడే గానీ, పేలిపోయేంతటి ఒత్తిడి లేదు.
ప్రకృతికి సహచరుడై బతికే మానవుడే.. మహనీయుడు.
శాస్త్రీయమైన, ఆ సహచరత్వం.. ఇప్పటికే గోండులలో మెండు.
వందల యేండ్ల అనుభవంతో ఎంపిక చేసుకున్న మట్టిరకం.
ఆకారంలో ఇంత చక్కటి కుండలు, ఇంకెంతో చక్కటి మూతలు.
ప్రతి కట్టెకూ ఓ గుణం ఉంటది. ఏ కట్టెలు మంచిగ మండుతయో
ఏవి ఎక్కువ పొగ వొస్తయో, ఏ కట్టె మంట ఎంత వేడి వుంటదో
వేటితో చేసిన వంట ఎక్కువ రుచికరమో… తిన్నవారికే ఎఱుక..!
ఇదంతా ఈ కోటానుకోట్లమంది తెలుసుకోదగిన శాస్త్రవిజ్ఞానం..!!
రామాయణమంతా విన్నంక రామునికి సీతేమైతదన్నట్టు
ఈ కుండలలో వండిన వంటల రుచి గురించి, వేరే చెప్పాల్నా… ?
~ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article