భాండ పురాండం
~~~~~~~~~~~~
పుట్టిన్నాడు- మాయిముంత.
పెండ్లినాడు- గరిగబుడ్డి.
చచ్చిన్నాడు- నిప్పుకుండ.
లెక్కకైతే మనిషి పుట్టిపెరిగిన
మాతృగర్భమే.. ఒక బ్రహ్మాండ భాండం.
మాఘమాసం వచ్చిందంటే చాలు
పెండ్లిల్లు, జాతరలు, శివరాత్రి, బోనాలు
అన్నిటికీ ఆద్య కళ-ఆధ్యాత్మిక కళ.. వట్టి మట్టికుండ.
తెలంగాణ పెండ్లిళ్లలో కుండది తిరుగులేని స్థానం
పెండ్లి పనులు మొదలయ్యేదే కూరాళ్లు పట్టే పనితోటి
కూరాళ్లంటే నీటి కుండలు కొత్త నీటిని ఎదుర్కొనే పద్ధతిది.
కూరాళ్లు (5)
అయిరేణి కుండలు (2)
గడుగుడుకలు (2)
గరిగ బుడ్డి (1)
పోలు ముంతలు (4)
పోచమ్మ బోనాలు (2)
వీటన్నిటికి అవసరమైన చిప్పలు
ఇంకా వంతన తీరుగ.. మరిన్ని అవసరాలు
ఈ నవీన సంస్కృతిలోనూ కుండ అండ లేనిది పెండ్లే లేదు.
~•~•~•~•~
ఫోటోల కనబడే అయిరేణి కుండల రంగుల అద్దకం
కరీంనగర్ పాతమార్కెటు వెంకటేశ్వర్ల గుడి ముందట.
వెనుకటి అలంకరణ.. సున్నం& జాజులతో ఒక అనాది కళ
ఇప్పటిదంతా.. కార్పోరేటు స్థాయికి సరిసమానమైన వన్నెలవల.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article
Ads