Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరి మా బతుకుల గోస ఎవరు వినాలె కేటీయార్ సార్..?

April 25, 2023 by M S R

మా గోస వినుర్రి సర్..
గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారూ..
• తెలంగాణ విద్యుత్ శాఖలో ఆర్టిజన్లుగా పనిచేస్తున్న మా బతుకు గోసను జర వినుర్రి సర్.
• ఉద్యమాలతో పోరాడి సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రంలో.. మాలాంటి కింది స్థాయి కార్మికులు పడుతున్న కష్టాలను పెద్ద మనసుతో అర్థం చేసుకోర్రి సర్.

• తెలంగాణ రాంగనే ముఖ్యమంత్రి సారు మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెబితే నమ్మినం సర్. కానీ రూల్స్ అడ్డుపడుతున్నయని మమ్మల్ని ఆర్టిజన్లుగా మార్చిండ్రు సర్.
• ప్రభుత్వమేమో మమ్మల్ని పర్మనెంట్ చేసినమని చెప్తుంటే.. మేమిప్పటికీ తాత్కాలిక ఉద్యోగులమేనని విద్యుత్ సంస్థలు అంటున్నయి సర్.
• ఈ గోసను మేమెవరికి చెప్పుకోవాలి సర్.

• ప్రాణాలకు తెగించి ఇరవై నాలుగ్గంటలు విధులు నిర్వహిస్తున్న మాపై ఎందుకు సర్ ఇంత చిన్నచూపు.
• తోటి కార్మికులు కరెంట్ స్తంభాలపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోతుంటే, కొన్నిరోజుల వరకు మా గుండెలు ఎట్లా కొట్టుకుంటున్నయో తెలుసా సర్.

Ads

• పొద్దున ఆఫీసుకు పోతే, సాయంత్రం ఇంటికి క్షేమంగా వస్తామన్న గ్యారెంటీ లేని బతుకులు సర్ మావి.
• అలాంటి మాపై చిన్నచూపు ఎందుకు సర్.

• పెరుగుతున్న ఖర్చులకు మాకొచ్చే జీతాలు సరిపోక అవస్థలు పడుతున్నం సర్.
• ‘మీకేంది.. కరెంటోళ్లువయా.. మస్తు జీతాలు వస్తయ్’ అని అందరు అంటుంటే మా కష్టాలను ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం అయితలేదు సర్.
• మా బతుకుల్లో వెలుగునింపమని ఎవర్ని అడగాలి సర్.

• ఉద్యమాల గడ్డపై పుట్టిన మాకు ఉద్యమం చేసే అవకాశం, హక్కులు లేవా సర్.
• సమ్మె చేస్తామంటే ఉద్యోగాలే ఉండవని బెదిరిస్తున్నరు. ఇదెక్కడి అన్యాయం సర్.
• విద్యుత్ సంస్థల సీఎండీలతో కాకుండా.. ఒక్కసారి మా బతుకుల్లోకి తొంగిచూడుర్రి సర్. మాతో మాట్లాడుర్రి సర్. మా కష్టాన్ని కళ్లారా ఒక్కసారి చూడుర్రి సర్.

• ప్రాణాలకు తెగించి మేము చేస్తున్న పనికి.. మాకొచ్చే జీతాలను ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూడుర్రి సర్. మా జీవితాల్లో వెలుగులు నింపుర్రి సర్.
ఇట్లు,
— ఆవేదనతో ఆర్టిజన్ కార్మికుడు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions