.
Mohammed Rafee …… ఫిష్ వెంకట్ కు ప్రభాస్ సాయం? నిజమా? అబద్ధమా?
గత రెండు రోజులుగా మీడియాలో హీరో ప్రభాస్ వితరణ గురించి చెబుతున్నారు! నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ మార్పిడికి సిద్ధం చేసుకోండి, ఖర్చు తానే భరిస్తా అని ఆయన సతీమణికి ప్రభాస్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి! చాలా మంది అభినందనలు కూడా తెలిపారు…
Ads
నిజానికి ఫిష్ వెంకట్ భార్య ఇది వాస్తవం కాదని చెబుతున్నారు… “ప్రభాస్ అసిస్టెంట్ ను మాట్లాడుతున్న అని ఫోన్ చేసింది వాస్తవం… కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్ కు సంబంధించి రెడీ చేసుకోండి.., ప్రభాస్ సార్ ఖర్చు భరిస్తారు” అని చెప్పింది వాస్తవం…
కానీ, రెండు రోజుల తరువాత అదే నంబర్ కు ఫోన్ చేస్తుంటే, స్విచ్ ఆఫ్ వస్తోంది అట! ఒకవేళ రింగ్ అయి ఫోన్ లిఫ్ట్ చేస్తే రాంగ్ నంబర్ అని చెబుతున్నారట! ఇంతకీ ప్రభాస్ చెప్పింది నిజమేనా? అతను అసలు ప్రభాస్ అసిస్టెంటేనా? లేదా ప్రభాస్ పేరుతో ఎవరైనా బ్లఫ్ చేసారా అనేది తెలియాల్సి ఉంది!
ఫిష్ వెంకట్ కొంత కాలం క్రితం షుగర్ఎక్కువై కాలు సెప్టిక్ అవడంతో యాంకర్ రోషన్ ఆర్ధిక సహకారం అందించి చికిత్స చేయించారు. కోలుకుంటున్న సమయంలో కిడ్నీ లు పాడై చివరకు డయాలసిస్ చేయిస్తూ వచ్చారు!
పది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరితే, కిడ్నీ మార్పిడి తప్పని పరిస్థితి అని వైద్యులు నిర్ధారించారు. అంత ఆర్ధిక స్థోమత లేదని, సినీ పరిశ్రమ ఆదుకోవాలని వెంకట్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
ఆ వీడియోకు స్పందించి ప్రభాస్ అసిస్టెంట్ అంటూ ఎవరో భరోసా ఇచ్చారు. మీడియా కూడా ప్రభాస్ వితరణకు దయార్డ్ర హృదయానికి విశేషంగా స్పందించింది! కానీ, ఆ తరువాత ఆ అసిస్టెంట్ నుంచి స్పందన లేదు! తనకు సంబంధం లేదని ప్రభాస్ కూడా ఖండించనూలేదు! అసలు వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది!
ఫిష్ వెంకట్ భార్య ఆశగా ఎదురు చూస్తోంది! గతంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించి కొంత ఆర్ధిక సహకారం అందించారు. ఆమె పవన్ కళ్యాణ్‌పై ఆశలు పెట్టుకుని ఉంది! ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో చేశారని, ఆయనకు విషయం తెలిసేలా చేయండి అంటూ ఫిష్ వెంకట్ భార్య విజ్ఞప్తి చేశారు…
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్ధిక సహకారం అందేలా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రయత్నిస్తే బావుంటుంది! మా సంస్థ అధ్యక్షులు కన్నప్ప మంచు విష్ణు స్పందించాలి…
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్. తెలంగాణ మాండలికంలో డైలాగులు చెబుతూ విలన్ అసిస్టెంట్ పాత్రలు పోషించారు. ఆది సినిమాతో గుర్తింపు పొందారు. 90 సినిమాల్లో నటించారు. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ లో చేపలు అమ్మేవారు…
అలా ఫిష్ వెంకట్ గా సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యం విషమించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పాడైపోయాయి! కిడ్నీ మార్పిడి చేస్తే మినహా మరో మార్గం లేదని వైద్యులు వెల్లడించారు….. - డా.మహ్మద్ రఫీ
Share this Article