స్టార్ హీరోలన్నాక ఫీల్డ్‌లో పోటీపడతారు… ఎవరి సినిమా బాగుంటే వాడి గల్లాపెట్టె నిండుతుంది… ఇందులో ఆశ్చర్యం, అసహజం ఏమీ లేదు కదా… మరి షారూక్ ఆత్మ మీద ప్రభాస్ దెబ్బ కొట్టడం ఏముంది..? ఎస్, ఒకటి మాత్రం నిజం… నార్త్ ఇండియా సినీమాఫియాను, కొందరి లాంగ్ స్టాండింగ్ స్టార్‌డమ్‌ను ప్రభాస్ బ్రేక్ చేశాడు…
పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాల మెడలు వంచి, చేతులు మెలితిప్పి సలార్‌కు థియేటర్లు లేకుండా చేయడం, షారూక్ సినిమా డన్కీకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం, సలార్ సినిమా నిర్మాతలు ఈ సవాల్‌కూ సై అంటూ అసలు ఆ మల్టీప్లెక్సులకు మొత్తానికే తమ సినిమా ఇవ్వబోమని ప్రకటించడం… ఆ వివాదం చదివాం కదా… చివరకు డన్కీకన్నా సలార్‌కు బాగా పాజిటివ్ బజ్, టాక్ రావడంతో డన్కీకి ధమ్కీ ఇచ్చినట్టయింది… సరే, అదంతా వేరే కథ…
Ads
మరి షారూక్ ఆత్మ మీద దెబ్బ ఏమిటీ అంటారా..? ముంబైలో ఓ థియేటర్ ఉంది… పేరు మరాఠా మందిర్… చాలా పాత థియేటర్… కానీ మన సంధ్య, సుదర్శన్ తరహాలో అదొక పాపులర్ సినిమా అడ్డా… దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలీ అంటే… దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా గుర్తుంది కదా… 1995 నాటి సినిమా… షారూక్‌ను ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా… కాజోల్ హీరోయిన్… అప్పట్లోనే 40 కోట్లు ఖర్చు చేస్తే 200 కోట్లు వచ్చి పడ్డయ్… అంత బంపర్ హిట్… 10 ఫిలిమ్ ఫేర్ అవార్డులు…
ఆ సినిమా ఇప్పటికీ ఆడుతోంది మరాఠా మందిర్‌లో… నిరంతరాయంగా… అంటే 28 ఏళ్లుగా… ఏ హిందీ సినిమాకు లేని రికార్డు అది… ఈరోజుకూ మార్నింగ్ షో అదే సినిమా… ఇదంతా ఒక ఎత్తు అయితే షారూక్ హీరోగా వచ్చిన ఏ సినిమా అయినా ఈ థియేటర్‌లో రిలీజ్ కావల్సిందే… అందుకే ఈ థియేటర్‌ను షారూక్ ఆత్మ అని ప్రస్తావించింది… అంతగా షారూక్‌తో ఆ థియేటర్ అనుబంధం కొనసాగుతోంది…
కానీ ఇప్పుడు ఏం జరిగింది..? మొన్నమొన్నటిదాకా యానిమల్ నడుస్తుండేది… డన్కీ తీసుకొచ్చారు… కానీ వెంటనే దాన్ని తీసేసి ప్రభాస్ సలార్‌ను ఆడిస్తున్నారు… ఎస్, నిజమే… మార్నింగ్ షో దిల్‌వాలే… మిగతా మూడు షోలు సలార్… అసలు సలార్‌కు థియేటర్లే దొరకనివ్వని షారూక్ టీం ఆటలో ఇదొక అనూహ్యమైన రివర్స్ పంచ్…
మరాఠా మందిర్ షోల నుంచి డన్కీని తప్పించడం… అందులోనూ బలమైన పోటీగా వచ్చిన సలార్‌ను వేయడం బాలీవుడ్ సర్కిళ్లలో పెద్ద టాపిక్ అయిపోయింది ఇప్పుడు… ‘‘అబ్బే, ప్రేక్షకుల నుంచి డన్కీకి పెద్ద ఎంకరేజింగ్ రెస్పాన్స్ లేదు’’ అని ఏదో సాకు చెబుతున్నా సరే, షారూక్ టీం డీల్ చేసే విధానం పట్ల థియేటర్లు కంఫర్ట్‌గా లేవు… మరాఠా మందిరే కాదు, ఐనాక్స్ దాదర్, ప్లాజా దాదర్, ముక్తా ఏ2 న్యూ ఎక్సెల్సియర్, మిరాజ్ ఠాకూర్ కండివలి, మూవీ టైమ్ దహిసర్, గోల్డ్ థానే, ఆనంద్ థానే, సినిపలిస్ రీజెంట్ పాట్నా, పీవీఆర్ రివోలి ఢిల్లీ… ఇవన్నీ డన్కీని తీసేసి సలార్ వేశాయి… ఇంకా ఉన్నయ్… గురువారం డన్కీ ప్రదర్శించాయి, శుక్రవారం తీసేశాయి…
సరే, పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లతో సలార్ నిర్మాతల వివాదం మాటెలా ఉన్నా… ఈ మరాఠీ మందిర్ నుంచి డన్కీని తీసిపడేయడం మాత్రం షారూక్ ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు… ఇందులో ప్రభాస్, సలార్ నిర్మాతల పాత్ర ఏమీ లేకపోవచ్చు… కానీ అలా జరిగిపోయింది… నిన్నటిదాకా ఒక టాక్, సలార్‌కు నార్త్‌లో థియేటర్లు ఇవ్వడం లేదు అని… కానీ ఇప్పుడు, పూర్తి రివర్స్… డన్కీని తీసేసి మరీ నార్త్‌లో సలార్ ఆడించడం…! ఎస్, చలనచిత్రం అంటేనే సంచలనచిత్రం, చంచలచిత్రం…!!
Share this Article