అందుకే ప్రభాస్ అంటే ప్రభాసే… చేతిలో వేల కోట్ల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులున్నాయి… ఐనాసరే, ఎక్కడా ఒత్తిడి ఫీల్ కావడం లేదు… కొన్ని అంశాల్లో స్థిరంగా వ్యవహరిస్తున్నాడు… తనకు నచ్చని అంశమైతే నిర్మొహమాటంగా తోసిపుచ్చుతున్నాడు… తనతో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సాలార్ అని ఓ సినిమా తీస్తున్నాడు తెలుసు కదా…
దాన్ని నిర్మించేది కాంతార, కేజీఎఫ్ నిర్మాతలు హొంబలె ఫిలిమ్స్ వాళ్లు… కాంతార, కేజీఎఫ్ సృష్టించిన వసూళ్ల సునామీ తెలుసు కదా, ఆ జోష్‌తో హొంబలె ఫిలిమ్స్ ఓనర్ విజయ్ కిరంగదూర్ దక్షిణ భాషలన్నింటిలోనూ కలిపి 5 వేల కోట్ల ప్రాజెక్టులను చేపట్టడానికి రెడీ అయిపోయాడు… సదరు విజయ్ ప్లస్ ప్రశాంత్ నీల్ చెప్పినా సరే ప్రభాస్ నథింగ్ డూయింగ్ అనేశాడు…
విషయం ఏమిటంటే..? సాలార్ అసలు ఫస్ట్ పార్టే పూర్తి కాలేదు, బాగా ఆలస్యం అవుతోంది… అప్పుడే సాలార్ ఫ్రాంచైజీ, అంటే సీక్వెల్ ప్రతిపాదనను తీసుకొచ్చాడు ప్రశాంత్ నీల్… నిర్మాత విజయ్ కూడా కేజీఎఫ్-2 హ్యాంగోవర్‌లో ఉన్నాడు కదా, సై అన్నాడు… కానీ ప్రభాస్ నిర్మొహమాటంగా తిరస్కరించాడు…
Ads
ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ అడ్డగోలుగా ఫ్లాపయింది… ఫ్యాన్స్‌దేముందిలే గానీ, తనకు అర్జెంటుగా ఓ హిట్ అవసరం… అదీ పాన్ ఇండియా రేంజులో… ఎందుకంటే… నాగ్ అశ్విన్ తీస్తున్న ప్రాజెక్టు కె, వంగా సందీప్ తీసే స్పిరిట్ తన చేతుల్లో ఉన్నాయి… మరోవైపు ఆదిపురుష్ సంగతి ఎటూ తేలలేదు… దాని గ్రాఫిక్ వర్క్ నిర్మాతలతోపాటు ప్రభాస్ పరువు కూడా తీసింది… మరోవైపు మారుతి తీస్తున్న రాజా డీలక్స్ సినిమా దాదాపు పూర్తయింది…
సో, తనకు సాలార్, రాజా డీలక్స్ హిట్టయితేనే ప్రాజెక్టు కె, స్పిరిట్ బాగా క్లిక్కవుతాయి… ఆరేడు వందల కోట్లు పెడుతున్నా సరే, ఆ ఆదిపురుష్ మీద ఆశలేమీ లేకుండా పోయాయి… అందుకని సాలార్‌ను రెండు భాగాలు చేసి, రిస్క్ తీసుకోకుండా… మంచి గ్రిప్పింగ్ కథనంతో ఒకే పార్టుగా రిలీజ్ చేద్దామని ప్రభాస్ అంటున్నాడు… కాకపోతే సాలార్ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ చూశాక, వీలును బట్టి పార్ట్-2 చూద్దాంలే అంటున్నాడు…
అవును మరి, ప్రశాంత్ నీల్ చెప్పినట్టు వినడానికి ప్రభాస్ కన్నడ హీరో యశ్ కాడు కదా… ప్రశాంత్ నీల్ సాలార్ పూర్తవ్వగానే జూనియర్ ఎన్టీయార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది… ఇటు ప్రభాస్‌పైన ప్రెజర్ ఉంది, అటు ప్రశాంత్ పైన ప్రెజర్ ఉంది, ఆల్ రెడీ మలయాళంలో ఏదో మూవీ స్టార్ట్ చేసిన హొంబలె ఓనర్ విజయ్ పైన కూడా ప్రెజర్ ఉంది… ఈ స్థితిలో సాలార్ పార్ట్-2 మీద కాన్సంట్రేట్ చేయలేమని ప్రభాస్ వాదన…
ప్రశాంత్ అనేదేమిటంటే… ఈ సాలార్ పూర్తి కాగానే జూనియర్ సినిమాను చకచకా పూర్తిచేసి, సాలార్ రెండో పార్టు మీద కాన్సంట్రేట్ చేద్దాం, వచ్చే ఫిబ్రవరి, మార్చి ఆఖరులకల్లా సాలార్ రెండో భాగం రిలీజ్ చేయవచ్చు అని..! నిర్మాత విజయ్ ఆలోచన మరోరకంగా ఉంది… సాలార్ పార్ట్-2ను కేజీఎఫ్‌తో లింక్ చేద్దామని ప్లాన్… ఇవన్నీ అయ్యేవి కావులే అని ప్రభాస్ తోసిపుచ్చుతున్నాడు…
ఇప్పటికే 85 శాతం పూర్తయిన సాలార్‌ను త్వరగా రిలీజ్ చేయాలని ప్రభాస్ ఒత్తిడి… మనది హీరోస్వామ్యం కదా, అంతిమంగా ప్రభాస్ మాటే ప్రస్తుతానికి చెల్లుబాటైనట్టు సమాచారం… కానీ ఇండస్ట్రీని నడిపేది డబ్బు… సాలార్-2 చౌకగా పూర్తిచేయవచ్చునని, అది రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు అదనంగా వస్తాయని గనుక హొంబలె ఫిలిమ్స్ ప్రభాస్‌ను కన్విన్స్ చేస్తే… ప్రభాస్ అంగీకరించకతప్పదు…!
Share this Article