Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అగ్రవర్ణ దురహంకార మనువాద శుష్క బాష్యాలూ డౌన్ డౌన్ !!

September 8, 2026 by M S R

.

హేమిటో మరి, ఇంకా కొందరు సనాతనులు పాతతరం, అంటే భాష, పాత్రికేయం, ప్రమాణాలు, నైతికత, నిబద్ధత, ప్రజాసేవ, దేశభక్తి వంటి లక్షణాలతో ఉన్న జర్నలిజం మీద భ్రమల్లో బతుకున్నట్టు అనిపిస్తోంది…

అరె, కాలంతోపాటు ప్రమాణాలు మారతాయి, యూట్యూబ్ జర్నలిజం వచ్చింది… ఎవడికీ భాష రాదు, థంబ్ నెయిల్ కూడా తప్పుల్లేకుండా పెట్టలేరు, అందులో ఉన్నది కంటెంటులో ఉండదు, ఎవడికీ ఏ కమిట్మెంటూ ఉండదు, వ్యూస్ వచ్చాయా లేదా….

Ads

భాషా గీషా జాన్తానై… వీడియో వదిలామా, జనం చూశారా… అంతే, అదే జర్నలిజం ఇప్పుడు… ట్రాజెడీ ఏమిటంటే మన మెయిన్ స్ట్రీమ్ దరిద్రం కూడా అలాగే ఏడవడం..! పెద్ద పెద్ద సాధన సంపత్తి, సీనియారిటీ, బ్రాండ్ పాపులారిటీ, మన్నూమశానం ఉన్న మీడియా సంస్థలే యూట్యూబ్ జర్నలిజం బాటలో పరుగులు తీస్తుంటే…. మరి ఏమిటి ఈ సత్తెకాలపు మహిళా జర్నలిస్టు ఇలా అంటుందేమిటి..?

ప్రభాత ఉదయం

దేవికా రాణి పోస్టు ఇది… ఎంత అన్యాయమైన పోస్టు..? ఇంకా సనాతన సత్తెకాలంనాటి కలల్లో బతుకుతున్నది పాపం… కాదు, ఇది అగ్రవర్ణ దురహంకార పక్కా మనువాద ఆలోచనావిధానం… లేకపోతే ఏమిటిది..? పునరుక్తి కాదు, పునరుత్థానం అనే సోయి లేకపోతే ఎలా..?

ఎస్, జర్నలిజంలో విప్లవ సారథులం మేం, మాకే చెబుతావా నువ్వు..? నిజానికి సాయం ఉదయం టైటిల్ కోసం ట్రై చేశాం, దొరకలేదు… చీకటి ఉషోదయం కూడా దొరకలేదు… ఆ టైటిళ్లు దొరక్కపోవడానికి కూడా మనువాదుల కుట్రే కారణమని మాకు తెలుసు..?

అరచేతిని అడ్డుపెట్టి మీరెవరూ మా క్రియేటివిటీని ఆపలేరు… అసలే మా ఓనర్లకు అక్షరజ్ఞానం మరీ ఎక్కువ… అతివ‌ృష్టి, అజీర్తి… సో, పరిస్థితులు అర్థం చేసుకుని పోస్టండి, కామెంటండి, లేకపోతే మర్యాద దక్కదు…

అరె, కాషాయం కట్టుకున్న సనాతనులు కూడా మా అరుణ, మా పచ్చ కండువాల్ని, ఎజెండాల్ని, అడుగుల్ని తప్పుపట్టడం ఏమిటి అసలు..? నో, రేప్పొద్దున వచ్చే మా పత్రికలో ఇదుగో, ఇలాంటి సనాతనుల్ని ఎండగట్టి, ప్రభాత ఉదయం వంటి కొత్త వెలుగుల్ని వడగట్టి, కూడగట్టి, సమాజంపై ప్రయోగిస్తాం…

భరించగలిగితే అది సొసైటీ అదృష్టం, లేకపోతే దాని ఖర్మ… కానీ, భాష, ప్రమాణాలు, పాత్రికేయ విలువలు వంటి శుష్క, ఎమోషనల్, నాన్ ఎమోషనల్ కామెంట్లు వదిలితే మాత్రం వదిలేదు లేదు… జాగ్రత్త..! హమ్మా..!!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అగ్రవర్ణ దురహంకార మనువాద శుష్క బాష్యాలూ డౌన్ డౌన్ !!
  • హమారా హైదరాబాద్… ఓ కొత్త ముఖం! ఐటీ, ఫార్మా దాటేసి డిఫెన్స్ హబ్!!
  • బుల్లెట్ల భయాన్ని వదిలి- కాశ్మీరంలో సినిమా మళ్లీ ప్రాణం పోసుకుంది!
  • డామిట్, స్కెచ్ అడ్డం తిరిగింది ! బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ బొక్కబోల్తా !!
  • పుట్టపర్తి మిస్టరీ ! ఏకంగా సాయిబాబాపైనే ఎక్కుపెట్టిన ఓ సినిమా !!
  • కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి అంతే – అవి అనూహ్యం !!
  • ప్రకాశ్‌రాజ్ ఐతేనేం? కొన్ని రోల్స్ అస్సలు చేతకావు- కాలేదు !!
  • ఎవరీ తాతా మధు ? ఈ వికృత దూషణలు ఎక్కడ నేర్చాడు ?
  • యాంటీ దళిత్ ! ఒకరినే కాదు- ఆ ఇద్దరినీ బర్తరఫ్ చేస్తారా.?
  • ‘ తేరా సాయి’ వస్తున్నాడు ! ‘సనాతనం’ ఎలా స్పందించబోతోంది ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions