Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈనాడుకన్నా ప్రజారాజ్యం బెటర్… అది సీరియస్, ఇది కమర్షియల్ లైన్…

April 20, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. కృష్ణ- పరుచూరి బ్రదర్స్ మరో ప్రభంజనం ఈ ప్రజారాజ్యం సినిమా . మరో ఈనాడు సినిమా అని చెప్పవచ్చు . దాని కన్నా బాగుంటుందేమో ! అందులో హీరోయిన్ , డ్యూయెట్లు లేవు . ఇందులో పుష్కలం .

ఈనాడు ప్రజాస్వామ్యం , పార్టీ ఫిరాయింపులు వంటి అంశాల మీదయితే ఈ ప్రజారాజ్యం గ్రామీణ నేపధ్యంలో రైతు సమస్యలు , గిట్టుబాటు ధరలు , సమిష్టి వ్యవసాయం , రైతు కూలీల ఇక్కట్లు , బూర్జువాలు వ్యాపారస్తుల కుమ్మక్కులు వంటి సమస్యలతో ఉమ్మడి కుటుంబాల అపార్ధాలు అనర్ధాలను మిళితం చేసి కృష్ణ కోసమే కధను నేసారు పరుచూరి బ్రదర్స్ . కధకు , కృష్ణకు తగ్గట్టుగా డైలాగ్సుని సానబెట్టారు .

Ads

కృష్ణ అమ్మ గారి పేరు మీద తీసిన ఈ సినిమా ఘన విజయానికి ముఖ్య కారణం పరుచూరి బ్రదర్సే . కృష్ణ సోదరుడు హనుమంతరావు స్క్రీన్ ప్లేని తయారు చేసారు . యం మల్లిఖార్జునరావు దర్శకుడు . జె రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్ .

పాటల కన్నా గొప్పగా చెప్పుకోవలసింది నృత్య దర్శకుడు శ్రీనివాస్ గురించి . కృష్ణ , జయప్రదల డ్యూయెట్లలో వాళ్ళిద్దరి డాన్సుల్ని కృష్ణ అభిమానులు కేరింతలు కొట్టేలా కంపోజ్ చేసాడు .

జయప్రద , కృష్ణల డ్యూయెట్లు చూస్తుంటే యన్టీఆర్, జయప్రదల యమగోల గుర్తుకొస్తుంది . జయప్రదకు యన్టీఆర్ సినిమా రంగంలో లేని లోటును కృష్ణ భర్తీ చేసాడు . డ్యూయెట్ల షూటింగ్ అయిపోయాక ఇంటికెళ్ళి కాపు పెట్టించుకుని ఉంటుంది బిడ్డ .

వేటూరి పాటలు కదా ! అలాగే ఉంటుంది . ఒంటరి తుంటరి కుర్రదానా , అమ్మాయీ అమ్మాయీ కోకంతా గొడవాయె రెయికంతా బిగువాయె పాటల్లో ఇద్దరు విజృంభించారు .

ప్రత్యేకంగా చెప్పుకోవలసిన గ్రూప్ డాన్స్ ఒకటుంది . గోపాలుడొస్తే గోపమ్మె నవ్వె రేపల్లె వీధుల్లో పాట . రాఘవేంద్రరావు తీసాడా అనే అనుమానం వస్తుంది . డా నెల్లుట్ల వ్రాసిన ఎర్ర పాట కదలండి కదలండి క్లైమాక్సులో బాగుంటుంది .

ఈ సినిమాలో దొంగల దోపిడి అని ఒక సన్నివేశం ఉంటుంది . చాలామందికి తెలియదు . దేవాలయాల్లో ఉత్సవాలప్పుడు అర్చక స్వాములు , తిరుణాళ్ళల్లో గ్రామాల్లో వరసయిన వాళ్ళు ఆడుతుంటారు . దాన్ని ఈ సినిమాలో పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు పరుచూరి బ్రదర్సుని అభినందించాలి .

ఇదే కాదు . చాలా మౌలికమైన ఆర్ధిక రంగ అంశాలను కూడా లేవనెత్తారు . Mechanisation vs Manpower . ఇండియాను అమెరికా , రష్యాల జనాభా విస్తీర్ణాలతో పోలుస్తూ కృష్ణ డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి . ఆ రోజులకు సూటయ్యే డైలాగులు .

ఉమ్మడి కుటుంబాల అపార్ధాల మీద ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు . ఈ సినిమాలో మనసుకు హత్తుకు పోయేలా చూపించారు . రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ములుగా సత్యనారాయణ , ప్రభాకరరెడ్డిలు , వాళ్ళ సంతానంగా శ్రీధర్ , కృష్ణ , సత్యకళ , గిరిబాబు , రాజ్యలక్ష్మిలు నటించారు . సత్యనారాయణ నటనను మెచ్చుకోవాలి . ప్రభాకరరెడ్డి భార్యగా అన్నపూర్ణ నటించింది .

వీళ్ళకు బావగా , ఫ్యూడలిస్టుగా , విలనాసురుడిగా రావు గోపాలరావు నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు . ఆయన భార్యగా కాకినాడ శ్యామల , సంతానంగా నూతన్ ప్రసాద్ , ప్రతాప్ పోతన్ , జయప్రదలు నటించారు . కోడలిగా కె విజయి నటించింది . ఊరికి శకునిగా అల్లు రామలింగయ్య , ఇతర పాత్రల్లో రమణమూర్తి , చలపతిరావు , రాజా ప్రభృతులు నటించారు .

విజయలలిత , జయమాలినిల డాన్సులు బాగుంటాయి . చాలా గేప్ తర్వాత విజయలలిత కనిపిస్తుంది ఈ సినిమాలో అప్పట్లో కూడా . ఫుల్ గరం మసాలా ఎర్ర సినిమా 1983 సెప్టెంబర్లో వచ్చిన ఈ ప్రజారాజ్యం సినిమా యూట్యూబులో ఉంది .

ఇంతకుముందు చూసి ఉన్నా మళ్ళా చూడొచ్చు . అస్సలు బోరించదు . జయప్రద , కృష్ణల జోడీ చాలా అందంగా ఉంటుంది . పాటల్ని అస్సలు మిస్ కాకండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …
  • హరిహరా… ఓ వీరమల్లూ… నీ కథెప్పటిది..? ఆ చార్మినార్ ఎప్పటిది..?!
  • ఒకే గది… ఒకే రోజు… కథ అక్కడక్కడే తిరిగే ‘షో టైమ్’… రక్తికట్టింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions