సీరియస్‌గానే… నటుడు ప్రకాష్ రాజ్‌కు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది… విపరీతమైన కాషాయ ద్వేషంతో ఎప్పుడూ రగిలిపోతుంటాడు… సోషల్ మీడియాలో ఏవేవో వ్యాఖ్యలు పెడుతూనే ఉంటాడు… తనేం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు, లోతుల్లోకి వెళ్లలేడు, బీజేపీని తిట్టామా..? మోడీని ఆడిపోసుకున్నామా..? అంతే…
నటుడిగా బాగా మొనాటనీ వచ్చేసింది… అదేదో సినిమాలో బ్రహ్మానందం ఈడ్చి కొట్టి ‘నువ్వొక చెత్త నటుడివిరా’ అంటాడు చూడండి… అది గుర్తొస్తుంది ఈమధ్య తన సినిమాలు, తన నటన చూస్తుంటే… మూస..! సరే, ఇప్పుడు విషయం ఏమిటంటే..?
ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడిగా జై షా ఎన్నికయ్యాడు… అదేనండీ, అమిత్ షా కొడుకు… మొన్నటిదాకా బీసీసీఐ కార్యదర్శి తను… ఐసీసీ చైర్మన్ కాగానే సహజంగానే మన క్రికెటర్లు అభినందిస్తూ పోస్టులు పెట్టారు… తప్పదు, మర్యాద… అంతేతప్ప, ఠాట్, జై షా ఐసీసీ చైర్మన్ ఏమిటి, నాన్సెన్స్ అని పోస్టులు పెట్టరు కదా… వాళ్లు ప్రకాష్ రాజ్‌లు కారు కదా…
Ads
విరాట్ కోహ్లి కూడా అలాగే ఓ అభినందన పోస్టు పెట్టాడు… తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్… దానిని తనూ షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఓ సెటైర్ వేశాడు… ఏమనీ అంటే… మనదేశపు బౌలర్, బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్, ఫీల్డర్, అల్టిమేట్ ఆల్‌రౌండర్ ఐసీసీకి ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల, ఈ గ్రేటెస్ట్ లెజెండ్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇద్దాం…
ఓహ్… ఐసీసీ చైర్మన్ కావాలంటే తప్పనిసరిగా క్రికెటర్ అయి ఉండాలా..? అదీ ప్రకాష్ రాజ్ జ్ఞానం..! క్రికెట్ ఆడటం రాని వాళ్లు గతంలో కూడా చైర్మన్లు అయ్యారనే విషయం తనకు తెలియదు… తెలుసుకుని, స్పందించాలనే సోయీ ఉండదు… జై షా అమిత్ షా కొడుకు కాబట్టి తిట్టేయాలి… వ్యంగ్యంగా స్పందించాలి, అంతే… పైగా విరాట్ కోహ్లీ పోస్ట్ షేర్ చేయడం దేనికి..? ఆ ద్వేషభాషను తనే సొంతంగా పోస్ట్ చేసి ఏడవొచ్చుగా…
ఐసీసీ గానీ, బీసీసీఐ గానీ… అదొక పెద్ద ఆట… వేల కోట్ల దందా అది… నిజమే, క్రికెట్ ఇప్పుడు ఆట ఏమాత్రం కాదు, అదొక వ్యాపారం, అదొక వినోదం… ఆ పోస్టులకు ఎంపిక విషయంలో చాలా రాజకీయాలు ఉంటయ్, ఎత్తుగడలుంటయ్… కీలకమైన పాలసీ డెసిషన్ల వెనుక డబ్బుల మూటలు దాగి ఉంటయ్… అంతర్జాతీయ క్రికెట్ మీద ఇండియా ఆధిపత్యం కొనసాగేందుకు కూడా కొన్ని వ్యూహాలుంటాయి… ఈ ఆటకు క్రికెట్ ఓనమాలు కూడా తెలియాల్సిన పనిలేదు… పైగా మంచి ఆటగాడు మంచి మేనేజర్ కావాలనేమీ లేదు… ఆ పోస్టులకు ఆటగాడే అర్హుడు అనే నిబంధన లేదు, ఆనవాయితీ కూడా లేదు…
మేనేజర్ పనికి బౌలింగుకు, బ్యాటింగుకు సంబంధం ఏముంది..? అందుకే నెటిజనం తమ కామెంట్లలో ప్రకాష్ రాజ్‌ను ఆడుకున్నారు… అవునూ, మొన్న లోకసభ ఎన్నికల్లో నీకు వచ్చిన వోట్లెన్ని..? డిపాజిట్ వచ్చిందా..? చివరకు నువ్వు కూడా మాట్లాడేవాడివేనా..? అంటూ..!! ఒక సినిమా తీసే నిర్మాతకు, కొనే బయ్యర్‌కు, ప్రదర్శించే ఎగ్జిబిటర్‌కు నటన వచ్చి ఉండాలా, ఏదో ఓ సినిమాలో నటించి ఉండాలా ప్రకాషుడూ..!!
Share this Article