Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?

August 22, 2026 by M S R

.

నటుడు ప్రకాష్ రాజ్ కోట్లమంది హిందువుల దృష్టిలో దేడ్ దిమాగ్ నక్సల్ ! కావాలని  బహిరంగ వేదికల మీద హిందూ దేవుళ్లను, తద్వారా కోట్ల మంది హిందువుల మతవిశ్వాసాల్ని పదే పదే గాయపరచడం తన అలవాటు… మన దేశంలో హిందువుల్ని, హిందూమతాన్ని కించపరచడమే లౌకికవాదం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కదా మరి…

తల్లి నమ్మకాల్ని గౌరవించడానికి క్రిస్టియన్ పద్ధతుల్లో అంత్యక్రియల్ని జరిపించాను అని చెప్పుకునేవాడికి కోట్ల మంది తల్లుల నమ్మకాల్ని కూడా అవమానించకూడదనే ఇంగితం మాత్రం ఉండదు, సరే, అవన్నీ చెప్పుకోవాలంటే ఇక్కడ స్పేస్ సరిపోదు… కానీ చాన్నాళ్లుగా తన మీద హిందూ ద్వేషి, యాంటీ నేషన్ అనే ముద్ర బలంగా పడుతూనే ఉంది…

Ads

తన మీద వ్యతిరేకత పెరుగుతూనే ఉంది… ఇది తమ సినిమాల మీద నెగెటివిటీని పెంచి, తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తాయనే స్పృహ ఇంకా సినిమా వాళ్లకు పెద్దగా రావడం లేదు… మొదటిసారి డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డికి కలిగింది… తను తీస్తున్న స్పిరిట్ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్‌ను పీకిపారేశాడు… ఇదీ వార్త…

ప్రకాశ్ రాజ్

ఇంకా వివరాల్లోకి వెళ్తే…  రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘స్పిరిట్’. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విధంగా సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు అధికారికంగా వెల్లడైంది. స్పిరిట్ సినిమాలోని ఓ కీలక పాత్రలో ఆ న‌టుడు నటించనున్నాడని గతంలో వార్తలు రాగా, ఇప్పుడు అత‌ను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేశాడు…

గ‌త కొంతకాలంగా ప్రకాశ్ రాజ్ సినిమా నుంచి తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగింది. తాజాగా నిర్మాత ఇచ్చిన క్లారిటీతో ఆ వార్తలకు అధికారికంగా క్లారిటీ వ‌చ్చినట్టయింది. అయితే అసలు ప్రకాశ్ రాజ్ ఎందుకు ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నాడు? లేదా తప్పించబడ్డాడు? తన హిందూ మత ద్వేష స్వభావమే కారణమా..? యాంటీ నేషన్ పోకడలే కారణమా..? ఈ చర్చ జోరుగా సాగుతోంది…

varanasi

ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం… సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రకాశ్ రాజ్‌‌‌ను ఓ విషయంలో అభ్యర్థించినట్లు తెలుస్తోంది… ‘స్పిరిట్’ విడుదలయ్యే వరకు వివాదాస్పద వ్యాఖ్యలు, సమావేశాలకు, ఇంటర్వ్యూలకు కొంత దూరంగా ఉండాలని ప్రకాశ్ రాజ్‌ను సందీప్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది…

అసలే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’… దీనిపై ఎలాంటి వివాదాల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే దర్శకుడు ఈ సూచన చేసినట్లుంది… కానీ ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాలను మార్చుకోవడానికి సిద్ధంగా లేడట…

తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలకు, నటుడిగా తన వృత్తిపరమైన జీవితానికి సంబంధం లేదనీ పెడసరం సమాధానాల్ని ఇచ్చాడని తెలుస్తోంది… నిర్మాత- దర్శకుల భయసందేహాల్ని నటుడు పట్టించుకోనప్పుడు సినిమాలో పాత్ర కూడా అవసరం లేదని టీమ్ కటువుగానే చెప్పారు… అంటే, నీకు ఓ దండంరా బాబూ అని చెప్పినట్టు…

అసలు విషయం చెప్పుకోలేదు కదా… వేల కోట్ల వసూళ్లకు గురిపెట్టిన రాజమౌళి- మహేశ్ బాబు- పృథ్వీరాజ్ సినిమా వారణాసి మాటేమిటి..? అందులో నుంచి పీకేశారా..? లేదు… కుమ్రం భీమ్, అల్లూరి చరిత్రలనే భ్రష్టుపట్టించి, దాన్ని తన ఘనతగా చెప్పుకున్న రాజమౌళి, అవసరమైతే ప్రకాశ్ రాజ్‌ పాత్రకు మరింత ప్రాధాన్యం ఇస్తాడు తప్ప తనను వదులుకోడు, సేమ్ మెంటాలిటీ కదా…

నేను సినిమాకు పుణ్యక్షేత్రం కాశి పేరు పెట్టాను, ఆ శ్రీ రాముడిని చూపెడుతున్నాను అంటూ కాషాయవాదుల కళ్లకు, బుర్రలకు గంతలు కట్టగలడు రాజమౌళి… వీళ్లూ చప్పట్లు కొట్టగలరు-  అదీ తన స్పిరిట్!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!
  • చాపచుట్టేసిన శ్రీలంక- మూడు రనౌట్లు – ఆరు డకౌట్లు..!!
  • సిరిసిల్లలో నిలబడి, నిలదీసి… ఈ ‘అనుముల రుద్రారెడ్డి’ అసాధ్యుడే!
  • పిచ్‌తో ఆడకండి… ఆటలోని అసలు మజాయే మాయం!
  • టాకీస్ నుంచి బయటపడ్డాక కనిపించినదే అసలు ‘ప్యారడైజ్’ !!
  • ఇది భూతల స్వర్గమేమీ కాదు! పేదరికం- కాయకష్టం- కన్నీళ్లు అన్నీ !!
  • సుఖాంతమే… కానీ అసలు కథ మాత్రం ఇప్పుడే మొదలైంది…!!
  • What a Memorable Match… ఇండియా రికార్డు చేజింగ్ విక్టరీ !!
  • ‘కంచ’ దాటిన పైత్యం ! చివరకు సీఎం మనవడి పేరుపైనా వక్రబాష్యాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions