Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐదు రూపాయలు… ఓ ఆదర్శ స్మరణీయుడి కథను చెబుతోంది ఇలా…

August 23, 2024 by M S R

“నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన

ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో !

కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు !

Ads

అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !

సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు

ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు

five

చెన్నైలో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థతగా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు

లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో ” నాన్న గారికి మందులు తీసుకురావాలి.. ఓ ఐదు రూపాయలు సర్దుతారా..?” అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంట క్షణ కాలం మాట రాలేదు !

వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు !

ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!

దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దరిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ?

ముఖ్యమంత్రి పదవి అంటే తరతరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా ? చూడగలమా ?

అంటే చూడలేమనే సమాధానం వస్తుంది !

ఆ తరం వేరు
నేటి తరం వేరు !

ఆనాటి రాజకీయాలు వేరు
ఈనాటి అరాచకీయాలు వేరు !

డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !

దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు అయ్యారు !

ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు ! ……  పరేష్ తుర్లపాటి   (గతంలో కూడా ఇది చదివినట్టు గుర్తొస్తుందా.? పర్లేదు, మళ్లీ మళ్లీ చదవొచ్చు… కాదు, చదివించొచ్చు… ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి ఆయన కథలో…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…
  • వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…
  • గుడ్డిగా నమ్మేయవద్దు… సోషల్ మీడియాలో కొందరుంటారు… జాగ్రత్త…!!
  • హీరోయిన్ బాత్‌రూం‌తో ఏం పనిరా..? వీటినే పిచ్చి కూతలు అంటారు…!!
  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions