Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రాణం ఖరీదు… ఓ మెగా తెలుగు ఫిలిమ్ ఎస్టేట్ నిర్మాణానికి ఇది బొడ్రాయి…

October 26, 2024 by M S R

.

ఈ ప్రాణం ఖరీదు సినిమా గురించి చెప్పటానికి చాలా విశేషాలే ఉన్నాయి . మెగా స్టార్ చిరంజీవి మొదట సంతకం చేసిన సినిమా పునాదిరాళ్ళు . కానీ మొదట రిలీజ్ అయిన సినిమా ఈ ప్రాణం ఖరీదు . ఓ గొప్ప కేరెక్టర్ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు నటించిన మొదటి సినిమా . మరో విశేషం ఏమిటంటే ఈ ప్రాణం ఖరీదు నాటకంలో విలన్ రావు గోపాలరావు పాత్రను కోట శ్రీనివాసరావే నటిస్తూ ఉండేవారు . అయితే ఈ సినిమాలో మాత్రం చిన్న పాత్రలో కనిపిస్తారు .

నటనపరంగా మరోసారి చంద్రమోహన్ తన నట విరాటరూపాన్ని ప్రదర్శించారు . చెవిటి , మూగవాడిగా నటించి ప్రేక్షకులను మెప్పించటం అంత సులభం ఏమీ కాదు . చంద్రమోహన్ మెప్పించారు . కొత్త నటుడు అయినా చిరంజీవి బాగా నటించారు . పునాదిరాళ్ళు , ప్రాణం ఖరీదు , మన ఊరి పాండవులు ఇవన్నీ చిరంజీవికి మొదటి సినిమాలే . అయినా ఎంతో అనుభవం కలిగిన నటుడిగా ప్రేక్షకులను మెప్పించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు . NTR , ANR , కృష్ణ , కృష్ణంరాజుల్లాగా ఓ సినీ మెగా కుటుంబం ఏర్పడటానికి స్వేద తివాచీని పరిచారు .

Ads

జయసుధ . అద్భుతంగా నటించింది . ఈ ముగ్గురి తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పాత్ర సత్యనారాయణదే . బ్రహ్మాండంగా నటించారు . ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర , నటన . భూస్వామిగా , పెత్తందారుగా రావు గోపాలరావు క్రౌర్యాన్ని ప్రేక్షకులు మరచిపోరు . మునసబుగా నూతన్ ప్రసాద్ , విలన్ మొదటి భార్య కూతురిగా మాధవి , జయసుధ బేవార్స్ అన్నగా చలం , రమాప్రభ నటించారు . ఓ చిన్న పాత్రలో ఆర్ నారాయణమూర్తి కూడా నటించారు .

ఈ సినిమాలో చిరంజీవి జోడీ బంగారిగా ఒరియా నటి రేష్మా రాయ్ హుషారుగా నటించింది . (అసలు పేరు మహాశ్వేత రాయ్… బహుశా తెలుగులో మళ్లీ నటించలేదేమో… కానీ ఒడియాలో ఫేమస్ నటి… 8 స్టేట్ ఫిలిమ్ అవార్డులు గెలుచుకుంది… ఎందుకో గానీ తెలుగువాళ్లు ఆమెకు సరైన అవకాశాలు ఇవ్వలేదు…)

reshma ray

ఈ సినిమాలో మరో కీలక పాత్ర . స్వాతంత్య్రం రాక ముందు ఓ మారుమూల గ్రామంలో జరిగిన కధగా సినిమా మొదట్లోనే చెపుతారు . చట్టాలు , న్యాయాలు , మానవత్వం వంటి విషయాలు లేని నేపధ్యంలో సినిమా . పేదవాడి ప్రాణం ఖరీదు పాతిక రూపాయలు అనే డైలాగ్ చాలాసార్లు వినిపిస్తుంది . నిర్మాత క్రాంతి కుమార్ . ప్రముఖ దర్శకుడు కె ప్రత్యగాత్మ కుమారుడు కె వాసు ఈ సినిమాకు దర్శకుడు .

పెత్తందారి అరాచకాన్ని ప్రతిఘటిస్తూ చిరంజీవి ముందు నిలవగా , సత్యనారాయణ పిలుపుతో పెత్తందారు రావు గోపాలరావుని , బేవార్స్ చలాన్ని ఊరి జనం చంపేయటంతో సినిమా ముగుస్తుంది . జయసుధ , చంద్రమోహన్ పాత్రల్ని రావు గోపాలరావు చంపేస్తాడు . ప్రేక్షకుల బుర్రల్లో నిలిచిపోయిన ఓ చక్కటి సినిమా .

reshma ray(reshma ray)

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . ముఖ్యంగా యాతమేసి తోడినా యేరు యెండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు అనే పాట బాగా హిట్టయింది . ఆ తర్వాత ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాక యాలమీద పోయేరమ్మ గూటిచిలకా , నోమల్లో మామల్లో తోట కాడ గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ , బండ మీద బోడి గుండోడి దెబ్బ రామయ్యో రామచంద్రయ్యా పాటలు , వాటి చిత్రీకరణ చాలా బాగుంటాయి . గ్రామీణ పదాలతో పాటలను అన్నీ జాలాది చాలా గొప్పగా వ్రాసారు . బాలసుబ్రమణ్యం , చంద్రశేఖర్ , ఆనంద్ , యస్ పి శైలజ , యల్ ఆర్ ఈశ్వరి , యస్ జానకిలు చాలా శ్రావ్యంగా , డిఫరెంటుగా గ్రామీణ జనపద శైలిలో పాడారు .

మార్చి 22 , 1978 న రిలీజ్ అయిన ఈ సినిమా ధవళేశ్వరం వద్ద పొత్తిలంక గ్రామంలో , ఒకే షెడ్యూల్లో పూర్తి చేసారట . క్రాంతి కుమార్ ప్రొడక్షన్ ప్లానింగ్ రామానాయుడు ప్లానింగ్ లాగానే ఉంటుంది కదా ! సినిమా , సినిమాలోని కీలక సీన్లు , పాటల వీడియోలు అన్నీ యూట్యూబులో పుష్కలంగా ఉన్నాయి . చిరంజీవి , చంద్రమోహన్ , జయసుధ అభిమానులు చూడవచ్చు . A watchable movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions