డార్క్ కామెడీ పేరుతో పసిపిల్ల మీద నీచాతినీచమైన కామెంట్లు చేసిన ప్రణీత్ హనుమంతు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కొడుకు. పేర్లు అవసరం లేదు. కులం పేరు కూడా అవసరం లేదు. తల్లి తండ్రి బాగా చదువుకున్న కుటుంబం అని ఆయన తండ్రి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకున్నాడు. Powerfull ex DGP మనమడు అట…
డార్క్ కంటెంటు పేరుతో దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన వాడు ప్రణీత్ . తన ఇద్దరు కొడుకులూ హై స్పిరిటెడ్ గొప్పవాళ్లు అని వాళ్ళను కన్నందుకు తన్న జన్మ ధన్యం అని తండ్రి చెప్పుకున్నాడు.
మన ప్రణీత్ గారు ఏనాడూ కన్నవాళ్ళను ఒక్క రూపాయి అడగడు అని చెబుతున్నాడు. ప్రణీత్ గారి తాత గారు వందేళ్ళ కిందనే పలాస, శ్రీకాకుళంలో లేదా ఇంకెక్కడో రియల్ ఎస్టేట్ చేసిన తొలి భూవ్యాపారి. వారి మీద బహుశా పెద్ద గ్రంధమే వచ్చి ఉండొచ్చు. ప్రణీత్ తల్లి కొంతకాలం విమెన్ చైల్డ్ వెల్ఫేర్ లో పనిచేసారు, బహుశా ఆమె పసి పిల్లల పట్ల గౌరవంగా ఎలా ఉండాలో నేర్పి ఉండలేదు అనుకుంటా .
Ads
ఆమె లా, సైకాలజీ చదువుకొన్నారు యునిసెఫ్ లో కొంతకాలం కూడా పనిచేసారు . పసి పిల్ల మీద దారుణమైన కామెంట్ చేసిన ప్రణీత్ కు ప్రజయ్ అనే అన్న కూడా ఉన్నాడు. అన్నగారి పెళ్ళికి ‘నేనే’ గారు కూడా వచ్చారు అంటే హై ప్రొఫైల్ కుటుంబం. (నెట్‌లో ఆ ఫోటో కూడా ఉంది. అందుకే ఆ క్యాంపు అస్సలు స్పందించడం లేదా..?)
మన ప్రవర్తన, మన జ్ఞానం, మనం పెరిగిన పరిసరాలే నిర్ణయిస్తాయి అని గొప్ప గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పారు కదా ? DGP లు, ముఖ్యమంత్రులు, టాప్ బ్యూరో క్రాట్లు , యునిసెఫ్ లో పనిచేసిన తల్లి . దేశంలో హై ప్రొఫైల్ ఉన్న గొప్ప గొప్ప అధికారులు వచ్చిపోయే కొంప నుంచి ఇలాంటి సన్నాసి ఎలా వచ్చాడురా ?
ప్రణీత్ దొర గారు అరెస్ట్ అయ్యారు అని తెలిసింది. ఆయన బ్యాక్ గ్రౌండ్ మన ముఖ్యమంత్రులకి, పోలీసులకి తెలుసో లేదో. ఈ కేసు ఎలాగో ఎక్కువ కాలం నిలబడదు. గంటకు పది కోట్లు ఇచ్చి అయినా బెయిల్ కోసం ఢిల్లీ లాయర్లు రావచ్చు. పుల్ల ఐసు కరిగినంతసేపు చాలు ఈ కేసు వీగిపోవడానికి. ప్రణీత్ నిర్దోషి అని అతన్ని సగర్వంగా అమెరికా పంపడానికి సకల రంగాలు రేయింబవళ్లూ కష్ట పడతాయి .
ఇప్పుడే సదరు సెలబ్రిటీని బెంగళూర్ లో అరెస్ట్ చేసారట. నిత్యం భాషకు, సంస్కృతికి, తెలుగు తల్లికి మాతృ రూపం అని కీర్తించబడే ఈ టివిలో XXX లాంటి సంస్కారవంతమైన జబర్దస్త్ షోలు ఉన్నంత కాలం ప్రణీత్ లు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు . దీనికి నివారణ లేదు, నిర్మూలనే…… ( By Gurram Seetaramulu )
పూణెలోని సింబయాసిస్ లా కాలేజీలో చదివాడు… గతంలో కూడా అనాథలు, దివ్యాంగ పిల్లల మీద కూడా వెకిలి జోకులు వేసి విమర్శలకు గురయ్యాడు, ఇదే మొదటిసారి కాదు… (pinkvilla input)
తన బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసినా, తెలియకపోయినా … తన వికృత చేష్టలపై సొసైటీ నుంచి వస్తున్న విమర్శలతో వెంటనే కఠినంగా వ్యవహరించిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ పోలీసులు అభినందనీయులు… ప్రణీత్‌తోపాటు మరో ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు… వాళ్ల వివరాలనూ పోలీసులు వెల్లడించాల్సి ఉంది… (muchata)
Share this Article