దేశంలోకెల్లా పెద్ద పేరున్న పెద్ద లాయర్… సుప్రీంకోర్టు లాయర్… పెద్ద పెద్ద కంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి, రూపాయి జరిమానాతో తప్పించుకోగల రేంజ్… ప్రొ-సొసైటీ, ప్రొ-పూర్ అనే పేరున్న లాయర్… పేరు ప్రశాంత్ భూషణ్… అయితేనేం..? అప్పుడప్పుడూ విచిత్రమైన వ్యాఖ్యల్ని ట్వీట్ జారుతుంటాడు… ఆ ట్వీట్ పెట్టేముందు అది అవసరమా, లేదా, తన హోదాకు తగినట్టు ఉంటుందా, లేదా వంటివి ఏమీ ఆలోచించడు… ఇప్పుడు కూడా అలాగే నిర్లక్ష్యంగా ఓ ట్వీట్ పెట్టాడు… తీరా ఏం జరిగింది..? దేశమంతా నెటిజనం ఛీకొట్టారు, నువ్వు ప్రశాంత్ భూషణ్ అయితేనేం..? ఆయన తాతవు అయితేనేం..? నువ్వు పెట్టిన ట్వీటేమిటి..? నీ తల్కాయ్ అన్నట్టుగా తిట్టిపోశారు… ప్రశాంత్ భూషణ్ బొచ్చెడు ఆత్మాభిమానం కలిగిన లాయర్ కదా, చెదరలేదు, బెదరలేదు, స్టడీగా తన ట్వీట్ మీదే నిలబడ్డాడు… కానీ ఆ వ్యతిరేకత చూసి ఫాఫం, ట్విట్టర్ వాడికే చిరాకెత్తింది… ట్వీట్ డిలిట్ కొట్టేశాడు తనే… వెరసి ప్రశాంత భూషణుడి ఇజ్జత్ పోయింది… పెద్ద పెద్ద బుర్రలున్నాయనే పేరుంటే, నిజంగా పెద్ద బుర్రలున్నట్టు కాదు అని నిరూపితమైంది… ఇప్పుడాయన ట్విట్టర్ మీద కేసు వేసి, సుప్రీంకు లాగుతాడా..?
ఇదే సారు గారు మొన్న పదో తేదీన పెట్టిన ట్వీట్… ట్విట్టర్ వాడు డిలిట్ కొట్టిన ట్వీట్… ఈ భూషణుడు ఏమంటాడంటే..? ‘‘ఫలానా సైన్స్ డైరెక్ట్ అనే వెబ్ సైటు వాడు ఓ స్టడీ పబ్లిష్ చేశాడు, దాన్ని బట్టి ఈ ఫేస్ మాక్కులు శుద్ధ దండుగ… కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా అవి ఆపలేవు… పైగా అదనంగా సైకలాజికల్, ఫిజియలాజికల్ దుష్ప్రభావాలూ ఉన్నాయట సుమా… అందరూ చదవండహో’’…. ఇదీ ఈ ట్వీట్ సారాంశం… ఒకవైపు దేశమంతా కరోనా సెకండ్ వేవ్ కమ్మేస్తోంది… రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నయ్… కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ దశలోకి వెళ్లిపోతున్నయ్… తెలంగాణ వంటి స్టేట్స్లో కూడా ఫేస్ మాస్క్ లేకపోతే భారీ జరిమానాలు విధిస్తున్నయ్… ఈ స్థితిలో మాస్కులు శుద్ధ దండుగ అని ఓ సుప్రీం బడా లాయర్ గొంతెత్తి ట్వీటడం ఏమిటి..? దీన్నే ప్రశాంత భూషణిజం అంటారు…
Ads
అసలు ఆ సైటు ఏ దిక్కుమాలిన సర్వేను, స్టడీని ప్రామాణికంగా తీసుకుందో తెలియదు… దాన్ని పట్టుకుని అసలు మాస్కులే శుద్ధ దండుగ, పైగా నష్టం అని ఎవరు మాట్లాడినా అది మూర్ఖత్వంగానే చూస్తుంది సమాజం ఇప్పుడు… తను ఎంత పెద్ద లాయర్ అయితేనేం, నెటిజనం పెద్దపెద్దోళ్లనే లైట్ తీసుకుంటుంది… ఈ ట్వీట్ చూడగానే ఈయన మీద విరుచుకుపడింది… చివరకు ఆయన్ని అభిమానించే లెఫ్ట్ వింగ్ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా కాస్త నోర్మూసుకోవోయ్ అన్నట్టుగా కామెంట్లు పెట్టారట… ఇది జనాన్ని, దేశాన్ని, సమాజాన్ని తప్పుదోవ పట్టించే ట్వీట్ అని వరుసగా రిపోర్టులు కొట్టారట… దాంతో ట్విట్టర్ వాడు దాన్ని డిలిట్ కొట్టేశాడు…
నెటిజనం ఆగ్రహం, ట్విట్టర్ చర్య సమంజసమే… బాధ్యతారహితంగా వ్యవహరించింది ప్రశాంత్ భూషణే… ఇమ్యూనిటీ పెంచుకునే పద్ధతులు, వేక్సిన్ వేయించుకోవాల్సిన ఆవశ్యకత వంటి ప్రచారం జరగాల్సిన రోజులివి… మాస్క్ కరోనా వ్యాప్తిని ఆపలేదు అనేది అబద్ధం… రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది… అయితే కేవలం మాస్కే కరోనాకు పూర్తి విరుగుడు కాదు… అది ఒక ముందు జాగ్రత్త… అంతే… ఐనాసరే, దాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం తప్పు కదా… ప్రభుత్వాలు కూడా మాస్కే మహా సంజీవని అన్నట్టుగా వ్యవహరిస్తోంది… మరోవైపు సినిమా ఫంక్షన్లకు, పొలిటికల్ మీటింగులకు పర్మిషన్లు ఇస్తూ… తప్పు బార్లు, వైన్లు, థియేటర్ల మీదకు నెట్టేసే ప్రయత్నం చేయడం కూడా కరెక్టు కాదు… వ్యాప్తి ఎక్కడో, అక్కడే తొక్కాలి… ప్రభుత్వం చేయని పని కూడా అదే…!!
Share this Article