.
నేను చాణుక్యుడిని… ఈ దేశంలో ఎవరినైనా గెలిపించగలను, ఎవరినైనా ఓడించగలను అనే తలబిరుసు భావనల్లో, భ్రమల్లో ఉండే ప్రశాంత్ కిషోర్ నేలకు దిగివచ్చాడు…
తత్వం బోధపడింది… మాటలు వేరు… చేతులు వేరు… ప్రజాక్షేత్రంలో మార్కెటింగ్ వ్యూహాలు మాత్రమే గెలిపించలేవనీ, సోషల్ మీడియా ప్రచారాలే గద్దెనెక్కించలేవనీ అర్థమైంది…
Ads
నా వారసుడివి నువ్వేరా, నా తరువాత బీహార్ పీఠం నీదేరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాడు నితిశ్ ఓ దశలో… కొన్నాళ్లు తనతో ఉండి, వదిలేశాడు, ఆఫ్టరాల్ ఈ సీఎం పీఠం నేను సొంతంగా దక్కించుకోలేనా అనుకున్నాడు… జనసురాజ్ పార్టీ అని ఓ కొత్త దుకాణం తెరిచాడు…
పాదయాత్రలు చేయండి, పదవి పక్కా అని తన కస్టమర్ నాయకులకు చెబుతుంటాడు కదా… ఇక తనే పాదయాత్రకు పూనుకున్నాడు… తన పార్టీ తరుపున 2022 అక్టోబరు రెండున స్టార్ట్ చేసి, 665 రోజులలో 2,697 గ్రామాలలో తిరిగినట్టు ఆ పార్టీ వెబ్సైట్ చెబుతుంది… ఎక్కడా ఆదరణ లేదు, జనం పట్టించుకోలేదు…
ఈ బీహార్ ఎన్నికల్లో 150 సీట్లు సాధిస్తానని, పది తక్కువ వచ్చినా ఓటమిని అంగీకరిస్తానని డాంబికాలు పలికాడు… మొత్తం సీట్ల సంఖ్య 243… తీరా ఇప్పుడు ఏమిటీ అంటే..? తను మొదట్లో హాజీపూర్ లేదా రాఘోపూర్‌లో పోటీచేయాలని అనుకున్నాడు…
తన సంస్థ ఐప్యాక్ ద్వారా పలుమార్లు సర్వే చేసినా హాజీపూర్ లో మూడో స్థానం, తాను పుట్టి పెరిగిన గడ్డ రాఘోపూర్ అసెంబ్లీ నియోకవర్గంలో డిపాజిట్ గల్లంతు అయ్యే పరిస్థితి ఉంది అని తేలడంతో షాక్… రాఘోపూర్ అంటే ఆర్జీడీ బాస్ తేజస్వి యాదవ్ నిలబడే స్థానం… అది ఆర్జీడీ కోట… లాలూ, ఆయన భార్య రబ్రీదేవి కూడా ఇక్కడి నుంచే గెలిచారు, తేజస్వి రెండుసార్లు గెలిచాడు…
సో, అక్కడ తను పోటీచేస్తే, దారుణంగా ఓడిపోతే… తన పొలిటికల్, మార్కెటింగ్ కెరీర్‌కే డేంజర్ అని అర్థమైంది… అందుకని రాఘోపూర్ నుంచి తను పోటీచేయకుండా చంచల్ సింగ్ అనే ఓ అనామక అభ్యర్థిని నిలబెడుతున్నాడు… హాజీపూర్ నిజానికి రాంవిలాస్ పాశ్వాన్ అడ్డా… ఇక్కడ ఆర్జీడీతోనే ప్రధాన పోటీ… సో, అక్కడా పోటీచేయకూడదని నిర్ణయించుకున్నాడు…
సీ-వోటర్ వంటి సర్వేలలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు తేజస్వి, ప్రశాంత్ కిషోర్‌లకుకూడా మంచి వోట్లు వచ్చాయి… కానీ సీట్లు, ఓట్ల విషయానికి వస్తే పదికి లోపు సీట్లు వస్తాయని, పది శాతం లోపు వోట్లు వస్తాయని ఐప్యాక్ సొంత సర్వేలలోనూ తేలిందట…
తన ఓటమితో ఇక తన సంస్థకు, వ్యక్తిగత రాజకీయ విశ్వసనీయతకు మరింత నష్టం కలిగే అవకాశం ఉందని భావించి, ఎక్కడా పోటీ చేయను అని ప్రకటించి, సొంత పోటీ ఆలోచనకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు…
తను ఓడిపోతే తనకు ఎలా నెగెటివ్ అంటే… తను 2026 ఎన్నికల కోసం బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో పనిచేస్తున్నాడు… తన ఓటమితో ఆయా రాష్ట్రాల అపోజిట్ పార్టీలకు మంచి అస్త్రం దొరికినట్టు అవుతుంది… ఇప్పుడు బీహార్‌లో తన ఆలోచన ఏమిటంటే…?
బీజేపీ- నితిశ్ కూటమికీ… కాంగ్రెస్- ఆర్జేడీ కూటమికీ నడుమ టఫ్ ఫైట్ ఉంది… తను గెలుచుకునే స్థానాలే గనుక మెజారిటీకి కీలకమైతే అలా చక్రాలు తిప్పవచ్చునని ఆశ… అన్నట్టు… వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూర్చుని రేవంత్ రెడ్డిని ఓడిస్తానని ఏవో డాంబిక ప్రకటనలు చేసినట్టు గుర్తు..!!
ఎన్నికల్లో పోటీచేయను అని ప్రశాంత్ కిషోర్ ప్రకటించాక ఆర్జేడీ స్పందన… పోటీకి ముందే ఓటమి అంగీకారం అని… నాయకుడే పోటీ నుంచి పారిపోతే ఇక కార్యకర్తలకు ఏం ధైర్యం అని నితిశ్ పార్టీ స్పందన… ప్రశాంత్ కిషోర్ అనే పొలిటికల్ బుడగ పోటీకి ముందే పేలిపోయిందని బీజేపీ విమర్శ..!!
Share this Article